Archive

Archive for November, 2012

నాన్న (చిన్న కథ)

November 28, 2012 Leave a comment

కరెక్ట్ గ పదిహేనేల్లైంది నాన్న నిను చూసి
ఏవో పట్టింపులు
ప్రేమించి పెళ్లి చేసుకున్నాననే కోపం
నన్నుతన నుండి దూరం చేసింది.
చాల ప్రయత్నాలు చేశాను ఐన లాబం లేకుండా పోయింది.
పొద్దున్నే అమ్మ ఫోన్ చేసింది,
“నాన్నకు గుండెలో నొప్పిర హాస్పిటల్ కి తీసుకేల్తున్నాం” అని
గుండెలో ఏదో మూలన కొంచెం వణుకు మొదలయింది.
ఆ క్షణమే వెళదామనుకున్న ఎంత ప్రయత్నించిన ఎం లాబం.
నాలుగు దేశాల సభ్యులతో మీటింగ్ రెండు నెలలు కష్టపడితే ఓ కొలిక్కి చేరుకొని ఈ రోజు ఫిక్స్ అయ్యింది.
ఎంతైనా కన్న తండ్రి. మరి కష్టపడి రెండు గంటల పర్మిషన్ తీసుకున్నాను.

చిత్రం కన్న తండ్రిని కూడా కలుసుకోలేనంత బిజీ గ నేను మారాన? నా మీద నాకే నవ్వొస్తుంది.
ఏదో సాధించాలని, ఏదో సాధిస్తున్నానని, నాకు నేను గర్వించినా
బావోద్వేగాలకు విలువ ఇవ్వకుండా నా మనసుకు నేనే ఓ పరాయి వ్యక్తిగా మారుతున్నాన?

నాన్న ఎన్నోసార్లు నిన్ను అసహ్యించుకున్నాను. నన్ను కొడుతున్నప్పుడు.
కాని నువ్వుంటే నాకెంతో ఇష్టం. నాకు తెలుసు నను నీ గుండెల్లో పెట్టుకొని కాపాడావు.

నేను చేసిన అతి చిన్న తప్పు ప్రేమించి పెళ్లి చేసుకోవడమేనా?
ఏమో బహుశ నువ్వున్న పరిస్థితులో కులాంతర వివాహం నిన్ను ఎంతగా బాధ పెట్టి ఉంటుందో నేను ఊహించలేక పోయా..

నిజమే  నాన్న  నువ్వు చెప్పింది. నిజం ప్రేమ వివాహంలో ఎన్ని ఆటు పోట్లు ఉన్నాయో అన్ని అనుభవించాను.
పేదరికాన్ని, ఇబ్బందుల్ని, అసహనాన్ని, కోపాన్ని, ఎవరు లేని ఒంటరి తనాన్ని, ప్రతిది అనుబవిస్తూ..

తెలిసి తెలియని జ్ఞానంతో పరిగెడుతూ పడిపోతు లేవడానికి  ప్రయత్నించినప్పుడు అప్రయత్నంగానే నా చేయి నీ వేలు కోసం వెతికింది.

ఎన్నో చెప్పాలనుంది

నీకు ఇద్దరు మనవళ్ళు నాన్న..
నాకు వయసొచ్చింద అని అనిపిస్తుంటుంది నీ మనవళ్ళని చూస్తుంటే.
వారిని నీ గుండెలపై ఆడిస్తుంటే పిల్లాడిలా నేను కేరింతలు కొట్టలనుకున్న.
నీకు నచ్చిన జిలేబి నీకోసం నీ కోడలితో చేపించి ఇవ్వాలనుకున్న.
నీతో పాటు నీకు తోడుగా ఉన్న బజాజ్ చేతక్ బండిపై  హెల్మెట్ లేకుండా సినిమా కెల్లాలనుంది.
నువ్వు నాకోసం తీసుకొచ్చే రూమల్ రోటిని కలిసి తినాలనిపించేది.

నీ కోడలు ప్రసవవేదనను పంటి బిగువన దాచుకుంది.
తోడుకోసం అమ్మనైన పంపిస్తావనుకున్న.
అన్ని వొదులుకొని నా మీద నమ్మకం పెట్టుకొని వచ్చిన నీ కోడలికి ఎలాంటి ఆప్యాయతని ఇవ్వలేక పోయా.

నాన్న ఎన్నో చెప్పలనున్నాయి.

** **
ఏమేవ్ చిన్న వచ్చాడ…

లేదండి.

ఒరేయ్ చిన్న ఏమోర ఒక్క రోజు కూడా నిను చూడకుండా గడపలేని నేను
నీకు దూరంగా పదిహేనేళ్ళు ఎలా గడిపానో ఆ భగవంతుడికే తెలియాలి.
తర తరాలుగ  నూరి పోసిన కుల పట్టింపులు నువ్వు చేసిన పనికి నను వెక్కిరించాయి.

అన్ని తెలుసు చచ్చాక ఏ కులం నను అంటుకొని రాదని
ఐన అనుక్షణం మనసొకటి చెప్తుంటే మనిషోకటి చేస్తాడు.
నా దౌర్బాగ్యం మనిషికి విలువిచ్చి మనసును చంపుకుంది.

అది శాపమై ప్రతిక్షణం నను కాల్చుకు తిన్నది.

చిన్న ఎన్నో సార్లు నువ్ బ్రతిమాలవు నన్ను నీతో మాట్లాడమని.
ఏమి చేయలేని నిస్సహాయత.

ఎవరితోనైనా నీ గురించి మంచి మాట వింటే మనసు సంతోషంతో ఉప్పొంగి పోయేది.
నీకు కష్టం కలగిందని తెలియగానే బాలాజీకి రెండు కొబ్బరికోయలు కొట్టి  నిన్ను చల్లగా చూడమణి ఆర్జీ పెట్టుకునే వాణ్ని.

నిజమే పెద్ద  వాళ్ళమయ్యమని ఇక అన్ని తెలుసుకున్నామని అనుకుంటుంటాము.
ఒరేయ్ చిన్న అన్ని గనక తెలిస్తే నేను ఈ నరకం అనుభవించే వాణ్ని కాదేమో.

అమ్మాయి  ప్రసవానికి చేరువవుతుందని తెలిసి పండంటి మగ బిడ్డ పుట్టాలని మొక్కని దేవుడు లేడు.
ఐన నా కర్మ..  కుల  పెద్ద అనే ఒక గంట మేడలో వేసారుగా ఎటు కదిలిన గంట మోగేది.
ఎవరితో పురమాయించను అమ్మనెల పంపను.
బిడ్డ  ఎన్ని కష్టాలు పడుతుందోనని  అమ్మ ఎన్నో సార్లు ఏడ్చేది.
మనవళ్ళని చూడనివ్వకుండా చేసావని ఇప్పటికి ఆడీ పోసుకుంటుంది.

నా మాట జవ దాటలేక ఒక్కసారి కూడ అమ్మ నీతో మాట్లాడలేదు.

క్షమించమనైతే నిన్ను అడగను. నీ ఆయుషు తగ్గుతుంది.

నేను మంధలించినపుడు ధబెలుమని డోర్ వేసుకొని ఒంటరిగా గడిపే నీ గది లోనే ఈ పదిహేనేళ్ళు నీవు వాడిన వస్తువులతో నువ్వు లేని నా ఒంటరి మనసు ఒంటరిగా కుమిలిపోయింది.

నాకు తెలుసు ఇక నేను చవడమోకటే మిగిలింది.

ఇప్పటికైనా  నిను చూడకపోతే.  దానికి మించిన మరో నరకం ఉంటుందని నేను అనుకోను.

**

ఇన్నేళ్ళ తర్వాత ఏమని పలుకను,

ముందెళ్ళి కాళ్ళ మిధ పడతాను,

గుండె పైన తల పెట్టుకొని క్షమించమని అడుగుతాను.

తన చేతిని నా చేతిలోకి తీసుకొని నేను ఉన్నాను నాన్న. నీకేం కాదని ధైర్యం చెప్తాను.

నీ మనవళ్ళను చూసి నువ్ యిట్టె కోలుకుంటవ్ అని చెప్తాను.
మళ్ళి మనం ఎప్పుడు  వెళ్ళే గుడికి కలిసేల్ధం.
నీకు రచనలంటే ఇష్టం కదా నువ్వు రాసినవన్నీ నేను ప్రింట్ చేపించి పెద్ద సభ ఏర్పాటు చేద్దాం.
నిన్ను అమ్మని నాతో పాటు తీసుకెళ్తాను.

ఏమని చెప్పాలి ఒక వైపు సంతోషం మరో వైపు ఏమి కాకూడదనే దడ.

బహుశ మనసులో జరుగుతున్న ఈ అనుభవమే నిజమైన ప్రేమ?

నాన్న నిను ఎప్పుడెప్పుడు చూస్తానా.

**

ఎలాగు నేను బ్రతకను,

డబ్బు, ఉద్యోగం ఒకటే అవసరం అని గడుపుతున్న రోజుల్లో.
నువ్వు  పుట్టాకే తెలిసింది మరో కొత్త మాధుర్యం.

చచ్చే వాణ్ని నీకేం చెప్పాలి.
ఏది ఏమైనా పిల్లల్ని మాత్రం దూరం చేసుకోకు.

కోడల్ని కష్టపెట్టకు మన పంతాలతో వారి కంట నీరు తెప్పించకు.
ఆ బాధ ఎలా ఉంటుందో మీ అమ్మను చూస్తే అర్ధమైంది.

ఒరేయ్ నన్ను ఎంతో ద్వేశిస్తున్నావ్ నాకు తెలుసు.
నీకు నా మొహం చూపించే అర్హత నాకు లేదని తెలుసు.
ఏదో ఒక భావన ఇప్పటికి మనల్ని కలవనివ్వకుండా చేస్తుంది.

**

-నిశబ్ధం ఆవరించిన నాన్న ఉన్న హాస్పిటల్ గది లోకి మెల్లిగా డోర్ తీసి లోపలికేల్లాను.

-నెమ్మదిగా కళ్ళు తెరిచి నాన్న చూసాడు, నా గుండె వేగం కాస్త స్థిమిత పడింది.

-ఎంతో నీరసం కమ్ముకున్న నాన్న కళ్ళలో తెలియని ఒక ఆనందం నా మనసుకు మాత్రమే కనపడింది.

-నెమ్మదిగా అడుగులేస్తూ నాన్న బెడ్ పక్కన కుర్చీని లాక్కొని కూర్చున్న బెడ్ పై చేతిని ఆనించి,

ఘాడ నిశ్శబ్దం నోట మాట రావట్లేదు, మొదటిసారి నిశబ్ధం మా ఇరువురిని ఇంకా దూరంగానే  ఉంచుతోంది.

చాల సేపటి మౌనం తర్వాత అప్రయత్నంగా నా చేతి పై నాన్న ముని వెళ్ళు.

ఒక్కసారిగా గుండెల్లో తెలియని భారం అంత దిగి పోయింది.

కళ్ళలోని కన్నిరుని బయటికి రానివ్వకుండా చాల ప్రయత్నించాను.

కేవలం చూపుల మధ్యే సంబాషణ పదిహేనేళ్ళ మా దురం చెల్లా చేదురైపోయింది.

తన చేతిని నా చేతులోకి తీసుకొని తడి ఆరిన గొంతుతో “నీకేం  కాదు  నాన్న”  అన్నాను.
అంతే గట్టిగ నా చేతి వోతుతూ ఒక్కసారిగా కళ్ళు మూసి తెరిసారు. సన్నని నీటి తెర తన కంటిని వదలి చెవు వరకు చేరింది.

ఇంకా ఏం మాట్లాడాలో తెలియలేదు.

మళ్ళి మౌనం ఈ సారి నిశబ్ధం ఉల్లాసమై సంతోషంతో నిండి ఉంది.

అమ్మ వచ్చింది అక్కున  చేర్చుకుంది.
ఏమి మాట్లాడలేదు.

ఇంతలో బాస్ ఫోన్.

ఒక్కసారిగా ఆనందాన్ని తెగ నరికేసిన కసాయి అనుకుంటూ ఫోన్ ఎత్తి వస్తున్న అని చెప్పాను.

అమ్మ. నాన్నకి ఏమి కాదు రేపు కోడలు మనవళ్ళతో వస్తాను కంగారుపడకండి నేను వెళ్తున్న.

**

ఎన్నో ఏళ్ళ బాధ చెల్లా చెదురైపోయింది,
ఏదో తెలియని ఆనందం.
ఎప్పటి నుండో వేచి చూస్తున్న తరుణం ఇంకా నమ్మలేకపోతున్న.
నాన్న నను క్షమించడం తన కళ్ళలో చూసాను.

ఏంటి ఈ తెలియని హాయి
మరో కొత్త విజయాన్ని సాధించాన, ఈ విషయం అరుణకి చెప్పాలి. పిల్లలిద్దరికి చెప్పాలి. సందడి సందడి చేయాలి.

రేపు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా మీటింగ్ పూర్తి చేయాలి.

నాన్న కు నచ్చిన జిలేబి,
విపుల, చతుర నవల,
తనకు ఇష్టమైన చెరుకు రసం,
ఇంకా ఇంకా ఎప్పుడెప్పుడు రేపోస్తుందా…..

**
హమ్మయ్య అన్ని రెడీ చేయమని చెప్పాను ఒక గంట లో పూర్తి చేసుకోవాలి.
ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో మధురానుభూతులు అన్ని పంచుకోవాలి.
నాన్నని కలవాలి. తనతో ప్రతి క్షణం గడపొచ్చు.
నాన్నని కలవాలి త్వరగా కలవాలి. మొదటి సారి నా కింది తరగతి ఉద్యోగులు అనుకునే ఊత పధం గుర్తోచింది “తొక్కలో మీటింగ్”

మీటింగ్ హాల్ కి వడి వడి గ అడుగులేస్తూ..
.
.

సెల్ లో మెసేజ్ ..

“DAD IS NO MORE “..

అంతే ఉన్నచోటే  గోడకి చతికిల బడి తల వెనక్కి వాల్చి కనులు మూతబడ్డాయి..
సన్నని కన్నీరు బుగ్గను తడుపుతూ జారుకుంది..

Categories: కథనం

పుష్పం

November 21, 2012 Leave a comment

భానుడు తహ తహ లాడుతూ,

వెచ్చని పరువాలనే కాంతి రేఖలను నిచ్చెనలు వేసి మరి మెల్లిగా పంపిస్తున్నాడు ఈ ధరి పైకి,

చేతులు చాచి వాటిని తమ కౌగిల్లో బంధించి ఈ రేయి ఉదయించింది.

ఈ రేయిని నెమ్మదిగా చూస్తున్న సాగరం.

సాగరం బిగి కౌగిలిని ఆనందంగా ఆస్వాదిస్తున్న తీరం.

తీరం ఇసుక తెమ్మల పైపొరలను ఆనుకొని మనుసువిప్పుకొని పడుకొని ఉన్న పచ్చికబయల్లలో, భానుడి కిరణం సుతి మెత్తగా తమను తాకగానే మేల్కొని వెన్ను విరిచి గట్టిగ ఊపిరి పిల్చుకుంటూ అనంధపడుతున్నాయి పుష్పక లోగిళ్ళు.

 

తన రెక్కలతో ఈ రేయిని చీల్చుకుంటూ వెళ్తున్న తుమ్మెద కళ్ళకి

పుష్పక సొగసు రంగు సరికొత్తగ తోచే,

అది పుష్పక లోగిలియ…?

మౌన సంగీతపు కావ్య తరంగీయ…?

కలుపుగోలు వన్నె ఛాయా, కమలపు చివరి అంచుల రంగుల రాజ్యంలో దాగిన అందాల రాణియా..?

అని సమ్మోహనంతో పరవశిస్తూ జూమ్మని రెండు రెక్కలతో గాలిలో ఈదుతూ దాని వద్దకు చేరెను..

 

తుమ్మెదని చూసి ఆ పుష్పం సిగ్గులోలుకుతూ

“నా అందాలకి ముగ్ధుడై నా వద్దకు వచ్చేనా ఆహ.. నేను వయోసోచ్చిన పడుచునయ్యనా అని తలిచేను పుష్పం…”

సూటిగా తన కళ్ళలోకి చూస్తూ, తన చేతులతో సుతారంగా రేకులను స్పర్శిస్తూ, తన ముద్దులతో పరవశింప చేస్తూ తనలో దాగిన మన్మధ భానాన్ని పుష్పం గుండెలోకి సుతిమెత్తగా దింపుతూ గట్టిగ కౌగిల్లో తనని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, ఊహించని ఇంతటి ఆనందాన్ని ప్రేమని మౌనంగా ఆస్వాదిస్తూ ఆ క్షణంలో పుష్పం వొదిలింది తన మనసుని.

 

మధుమోహపు మత్తు సుగంధాల పరిమళాలతో తన ఆత్మ సౌందర్యంలో దాగిన మకరంధాన్నంతా  తనకే తెలియకుండా మన్మధ భాణంతో మెల్లిగా పిల్చేసాడు.

చూస్తుండాగానే వీరిద్దరికీ తెలియకుండానే భానుడు దుప్పటి కప్పుకొంటు, వెన్నలను మేలు కోల్పాడు. వెన్నల ఆకాశంలో విరబూసి ఈ మౌన గీతపు కౌగిల్ల భంధాన్ని చోద్యంగా చూడ సాగింది.

 

తన తనువంత తాగి వొదిలి నెమ్మదిగా రెక్కలను కదిలిస్తూ ఎగరడం మొదలు పెట్టింది ఆ తుమ్మెద…

 

ఎగురుతున్న తుమ్మేదని దీనంగా, మౌనంగా, ఆనందంగా, పరవశంతో, మల్లెప్పుడొస్తవ్ అని అడుగుతున్నది.

తుమ్మద వెర్రిగా నవ్వుతూ, నీకు తిరిగి సౌందర్యం వచ్చాక వస్తాను అంటూ వెనక్కి తిరిగి చూడకుండానే ఆకాశంలోకి ఎగిరిపోయింది.

ఎంతో ఆవేదనతో తన రూపాన్ని తాకి చూచుకుంది.

“ఆశ్చర్యం యవ్వనం మాయమైంది ముసలి చారికలు ఉట్టిపడుతున్నాయ్..”

చుట్టూ విషాదం అలుముకుంది.

గంబీరంగా మారింది ఈ రేయి.

ఎం చేయాలో తోచక నెమ్మదిగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. తన ఆత్మ తనకే తెలియకుండా పచ్చని పరువాలను, రేయిని, సాగారతీరాన్ని, మసక చీకట్లని వొదిలి వెళ్ళసాగింది. అన్నిటిని వొదులుతూ చివరికి ఆ ముసలి శరీరాన్ని కూడా వొదులుతూ, ప్రయాణం సాగిస్తూ, ఆ ఆకాశ గగనంలోని చల్లని గాలుల్లోకి చిన్నగా మరింత చిన్నగా కొద్దిసేపు కనిపించి మాయమైంది..

జరుగుతున్న తీరుని చూసి భాధతో జాబిలి మేఘాల ముసుగులో మొహం దాచుకొని లోపల లోలోపల భాధపడుతుంది. అది చూసిన మేఘం భాదని దిగమింగ లేక తనలోని భావాన్ని వ్యక్తికరించెందుకు వర్షించడం మొదలు పెట్టింది.

 

చల్లని గాలులు వర్షపు చినుకులు జతగా కలిసి పులకరింతల హాయి గొలుపుతూ, జంటగా ధరి పైకి చేరి జోరుగా పాతాళలోకం వరకు జల్లుల వారధి కట్టింది..

ఆ చినుకులకి తడిసి ముద్దై నేలంతా తొలకరి కవ్వింతలతో ఈ రేయంత పరువపు సొగసుల సోభగులతో కలగలిసి ఆ తీపి గుర్తులకు చిహ్నంగా చిన్న మొక్కలో పుట్టిచ్చింది పిల్ల మొగ్గని. అది కొద్ది కొద్దిగా పూయసాగింది.

చూస్తుండగానే గల గల నవ్వుతోంది సుందర పుష్పం.

దుప్పటిని తన కాళ్ళతో తన్నిఒల్లువిరుచుకొని తను మేలుకొని ఈ రేయిని కూడా మేలుకోల్పాడు భానుడు.

ఉదయించిన సూర్యోదయాన్ని చూసి పులకరించింది పుష్పం.

 

ఈ సృష్టి లీల స్వరూపం ఇలాగే కొనసాగుతూ..

Categories: కవిత్వం