Home > కవిత్వం > పుష్పం

పుష్పం

భానుడు తహ తహ లాడుతూ,

వెచ్చని పరువాలనే కాంతి రేఖలను నిచ్చెనలు వేసి మరి మెల్లిగా పంపిస్తున్నాడు ఈ ధరి పైకి,

చేతులు చాచి వాటిని తమ కౌగిల్లో బంధించి ఈ రేయి ఉదయించింది.

ఈ రేయిని నెమ్మదిగా చూస్తున్న సాగరం.

సాగరం బిగి కౌగిలిని ఆనందంగా ఆస్వాదిస్తున్న తీరం.

తీరం ఇసుక తెమ్మల పైపొరలను ఆనుకొని మనుసువిప్పుకొని పడుకొని ఉన్న పచ్చికబయల్లలో, భానుడి కిరణం సుతి మెత్తగా తమను తాకగానే మేల్కొని వెన్ను విరిచి గట్టిగ ఊపిరి పిల్చుకుంటూ అనంధపడుతున్నాయి పుష్పక లోగిళ్ళు.

 

తన రెక్కలతో ఈ రేయిని చీల్చుకుంటూ వెళ్తున్న తుమ్మెద కళ్ళకి

పుష్పక సొగసు రంగు సరికొత్తగ తోచే,

అది పుష్పక లోగిలియ…?

మౌన సంగీతపు కావ్య తరంగీయ…?

కలుపుగోలు వన్నె ఛాయా, కమలపు చివరి అంచుల రంగుల రాజ్యంలో దాగిన అందాల రాణియా..?

అని సమ్మోహనంతో పరవశిస్తూ జూమ్మని రెండు రెక్కలతో గాలిలో ఈదుతూ దాని వద్దకు చేరెను..

 

తుమ్మెదని చూసి ఆ పుష్పం సిగ్గులోలుకుతూ

“నా అందాలకి ముగ్ధుడై నా వద్దకు వచ్చేనా ఆహ.. నేను వయోసోచ్చిన పడుచునయ్యనా అని తలిచేను పుష్పం…”

సూటిగా తన కళ్ళలోకి చూస్తూ, తన చేతులతో సుతారంగా రేకులను స్పర్శిస్తూ, తన ముద్దులతో పరవశింప చేస్తూ తనలో దాగిన మన్మధ భానాన్ని పుష్పం గుండెలోకి సుతిమెత్తగా దింపుతూ గట్టిగ కౌగిల్లో తనని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, ఊహించని ఇంతటి ఆనందాన్ని ప్రేమని మౌనంగా ఆస్వాదిస్తూ ఆ క్షణంలో పుష్పం వొదిలింది తన మనసుని.

 

మధుమోహపు మత్తు సుగంధాల పరిమళాలతో తన ఆత్మ సౌందర్యంలో దాగిన మకరంధాన్నంతా  తనకే తెలియకుండా మన్మధ భాణంతో మెల్లిగా పిల్చేసాడు.

చూస్తుండాగానే వీరిద్దరికీ తెలియకుండానే భానుడు దుప్పటి కప్పుకొంటు, వెన్నలను మేలు కోల్పాడు. వెన్నల ఆకాశంలో విరబూసి ఈ మౌన గీతపు కౌగిల్ల భంధాన్ని చోద్యంగా చూడ సాగింది.

 

తన తనువంత తాగి వొదిలి నెమ్మదిగా రెక్కలను కదిలిస్తూ ఎగరడం మొదలు పెట్టింది ఆ తుమ్మెద…

 

ఎగురుతున్న తుమ్మేదని దీనంగా, మౌనంగా, ఆనందంగా, పరవశంతో, మల్లెప్పుడొస్తవ్ అని అడుగుతున్నది.

తుమ్మద వెర్రిగా నవ్వుతూ, నీకు తిరిగి సౌందర్యం వచ్చాక వస్తాను అంటూ వెనక్కి తిరిగి చూడకుండానే ఆకాశంలోకి ఎగిరిపోయింది.

ఎంతో ఆవేదనతో తన రూపాన్ని తాకి చూచుకుంది.

“ఆశ్చర్యం యవ్వనం మాయమైంది ముసలి చారికలు ఉట్టిపడుతున్నాయ్..”

చుట్టూ విషాదం అలుముకుంది.

గంబీరంగా మారింది ఈ రేయి.

ఎం చేయాలో తోచక నెమ్మదిగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. తన ఆత్మ తనకే తెలియకుండా పచ్చని పరువాలను, రేయిని, సాగారతీరాన్ని, మసక చీకట్లని వొదిలి వెళ్ళసాగింది. అన్నిటిని వొదులుతూ చివరికి ఆ ముసలి శరీరాన్ని కూడా వొదులుతూ, ప్రయాణం సాగిస్తూ, ఆ ఆకాశ గగనంలోని చల్లని గాలుల్లోకి చిన్నగా మరింత చిన్నగా కొద్దిసేపు కనిపించి మాయమైంది..

జరుగుతున్న తీరుని చూసి భాధతో జాబిలి మేఘాల ముసుగులో మొహం దాచుకొని లోపల లోలోపల భాధపడుతుంది. అది చూసిన మేఘం భాదని దిగమింగ లేక తనలోని భావాన్ని వ్యక్తికరించెందుకు వర్షించడం మొదలు పెట్టింది.

 

చల్లని గాలులు వర్షపు చినుకులు జతగా కలిసి పులకరింతల హాయి గొలుపుతూ, జంటగా ధరి పైకి చేరి జోరుగా పాతాళలోకం వరకు జల్లుల వారధి కట్టింది..

ఆ చినుకులకి తడిసి ముద్దై నేలంతా తొలకరి కవ్వింతలతో ఈ రేయంత పరువపు సొగసుల సోభగులతో కలగలిసి ఆ తీపి గుర్తులకు చిహ్నంగా చిన్న మొక్కలో పుట్టిచ్చింది పిల్ల మొగ్గని. అది కొద్ది కొద్దిగా పూయసాగింది.

చూస్తుండగానే గల గల నవ్వుతోంది సుందర పుష్పం.

దుప్పటిని తన కాళ్ళతో తన్నిఒల్లువిరుచుకొని తను మేలుకొని ఈ రేయిని కూడా మేలుకోల్పాడు భానుడు.

ఉదయించిన సూర్యోదయాన్ని చూసి పులకరించింది పుష్పం.

 

ఈ సృష్టి లీల స్వరూపం ఇలాగే కొనసాగుతూ..

Categories: కవిత్వం
  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: