పిల్లికి రాజబోగం
ఫోటోషూట్ కోసం మిత్రుడు ఒకరింటికి తీసుకెళ్ళాడు.
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంది ఆ ఇల్లు నేను చూసిన సంపన్నుల్లో తను ఒకరు. కళా హృదయులు చెట్లు మొక్కలను అభిమానించే ప్రకృతి ప్రేమికుడు ఆ ప్రేమ తోనే అనగా అదే తన వ్యాపారం వ్యాపకం అని తెలిసింది ప్రపంచం లో ఉన్న వింత వింత మొక్కలని వ్రుక్షలని పెంచి పోషించి వాటిని అమ్మడం. ఒక్కో మొక్క సుమారుగా పాతిక వేలనుండి రెండు లక్షల వరకు కరిదు. నమ్మలేక పోయిన అక్షరాల నిజం ఇలాంటి మొక్కలని పెంచి పోషించడానికి పనివాళ్ళతో సేల్స్ సిబ్బంది తో కూడిన ఒక పెద్ద ఫ్యాక్టరీ నే నడుపుతుండడం ఆశ్చర్యమేసింది.
నాలుగు పదులు దాటని ఆ వ్యక్తి తో ఎక్కువ సేపు మాట్లాడలేక పోయిన వారి ఇంటి ఆవరణలో ఉన్న రక రకాల మొక్కలని నా కెమెరా లో బంధించడం లో నిమగ్నమయ్య నాతో పాటు నా ఫ్రెండ్ మరియు పాతిక లోపు వయసు గల ఓ కేరళ అమ్మాయి ఆ కంపెనీ మార్కెటింగ్ ad director ముగ్గురం కలసి వారి ఇంటి ఆవరణలో మరియు బాల్కనీ లో అందంగా పేర్చిన వింత వింత మొక్కలని కబుర్లు చెప్తూ తీసాను.
అదే ఇంట్లో ఓ పిల్లి ని చూసాను చూడడానికి అందంగా నిద్ర మబ్బు కళ్ళతో సుతి మెత్తని బూరు తో ముద్దుగ ఉంది. పక్కనే ఉన్న కేరళ అమ్మాయి ఇంగ్లాండ్ నుండి తెచ్చిన ఆ పిల్లి కరిదు చెప్పగానే ఒక్క సరిగా నా బుర్ర తిరిగిపోయింది అక్షరాల లక్ష రూపాయలు. ఇష్టం అనేది ఉండాలి కానీ మరి ఇంతలనా అనుకున్న. దానికి సుతి మెత్తని పరుపు మెడికల్ చెకప్ తనని చూసుకోవడాని ఒక వ్యక్తి అబ్బో పెద్ద రాజ బోగమే అనుబవిస్తున్నది ఆ పిల్లి.
అతి మెత్తని తన పరుపు చూడగానే మతి పోయింది.
నా చిన్నప్పుడు మా బాపు (నాన్న గారు) బియ్యం నిలువ చేసే కాలి గోనే సంచులని పట్టుకొచ్చేవాడు వాటిలో కొద్దిగా నున్నగా ఉన్న సంచిని నాకోసం అని పక్కనపెట్టుకునే వాడిని మా పెంకుటింట్లో రెండు గదులు ముందు గది లో బండలు నా ఐదో తరగతి లో వేసినట్టు గుర్తు రెండో గదిలో ఉన్న నేలని మాత్రం అమ్మ పేడ ఎర్రమన్ను తో కలిపి అలుకు పెట్టి మూలల్లో (బోర్డర్) గోడ అంచులలో ముగ్గులు పెట్టి నున్నగా చేసి ఎప్పుడు శుబ్రంగా ఉంచేది. బయట కాలి ప్రదేశం ఉండేది చాల కలం వరకు నాతో పాటే పెరిగిన బావి పక్కన వేపచెట్టు దానిని అల్లుకున్న పెద్ద చిక్కుడు కాయ చెట్టు కింద ఆ గోనే సంచి ని నేలపై పరిచి నా పుస్తకాల సంచి బుక్స్ డ్రాయింగు తో గడిపేవాణ్ణి వర్షం వచినప్పుడు మాత్రం గోనే సంచిని రెండో గది లో పరుచుకొని పని కానిచ్చేవాడిని. ఒక రోజు ఏదో బ్యాంకు ఆఫీసు కాలి చేస్తున్నారట అందులో ఉన్న చిరిగినా గోధుమ రంగు పెద్ద కిటికీ కర్టేను ఒకటి బాపు తీసుకొచ్చాడు. అది శుబ్రంగా పిండి చిరిగినా చోటున కుట్టింది అమ్మ ఆ కర్టేను చాల మెత్తగా ఉండడం తో అమ్మ పడుకునే అప్పుడు పెద్ద నార చాపలు రెండు పక్కపక్కన వేసి బొంత చేద్దరు దానిపై ఈ మెత్తని కర్టేను తో మాకోసం పాన్పును సిద్ధం చేసిది అదే అతి గొప్ప పాన్పు నాకు.
ఇంట్లో కరెంటు లేదు రాత్రిపూట కిరోసిన్ దీపం వెలుగుతు ఉంటె దాన్ని చూస్తూ కాసేపు దీపం వెలుతురుని నోటితో ఊదుతూ వయ్యారంగా కదిలే ఆ చిన్ని దీపం మంటను చూస్తూ నిధ్రపోయేవాన్ని. ఎండకాలమైతే అమ్మ పల్చని తన చీర కొంగుని మొహం పైన వేసి ఇంటివెనకాల గది బయటి తలుపు కొంచెం తెరిచి నా చాతి పై తన చేయి పెట్టి నెమ్మదిగ జో కొడుతూ నిధ్రపుచ్చేది ఎప్పుడో ఒకసారి వీచే గాలి కి మొహం పై ఉన్న అమ్మ కొంగు కదులుతూ చెక్కిలిగింతలు పెడుతుండేది ఎంతో ఆహ్లాదాన్ని మైకం కమ్ముతున్నట్టుగా తోచేది ఆ హాయితో మెల్లిగా నిద్రలోకి జారుకునే వాణ్ణి.
మరి ఈ పిల్లికి సిద్ధం చేసిన పరుపుతో తెలిసిపోతుంది మనం ఎంత వెర్రిగా డబ్బు వృధా చేస్తున్నామో అని..
మొన్నీమధ్య ఫేసు బుక్ మిత్రుడు నేను కలిసి వారి బాబు ని స్కూల్ లో వదిలి కార్ లో తీరిగోస్తున్నప్పుడు స్కూల్ admission, bus fare ఇతరత్రా లెక్కలు చెప్తూ ఎనబై వేలు కర్చైందని. నవ్వొస్తుంది ఇంత ఇంత డబ్బులు గుంజుతున్న కార్పోరేట్ స్కూల్స్ ని చూసి.
ఎందుకంత అని అడుగితే తప్పదు మరి అందరితో పాటే మనం అని. నిజమే ఓ మిత్రురాలు (ప్రవీణ గారు) చెప్పినట్టు.
ప్రవాహానికి ఎదురీద లేక,
ఎదురీత తెలిసినా,
ఎదురీదే సాహసం లేక,
ఎదురీదితే వెనుక పడిపోతామేమోనన్న భయంతో,
ప్రవాహంలో కొట్టుకుపోవడానికి పరుగులు..
నా విషయానికొస్తే 1989 లో స్కూల్ లో జాయిన్ చేసారు అంతకు ముందే మా అన్నయ అక్కయ కూడా అదే స్కూల్ కి వెళ్తున్నారు వారితో పాటే పంపించారు. అప్పుడు స్కూల్ ఫీజు 25 రూపాయలు నెలకి ఆ తర్వాత కాలాల్లో 25 కాస్త 50, 75 నా పదో తరగతి పుర్తేయ్యే అంటే 2000 ల సంవత్సరానికి నా school ఫీజు 150 రూపాయలు ఎన్ని కర్చులు లెక్క కట్టిన స్కూల్ ఫీజు, బట్టలు బుక్స్ అన్ని కలిపి పదేండ్లల్లో16 నుండి 18 వేల తో గడిచిపోయింది నా స్కూల్ విద్య.
కానీ ఆ టైం లో స్కూల్ ఫీసులు కట్టాలంటే చాల కష్టాలు పడేది మా అమ్మ ఎందుకంటే మా బాపు కి మా కన్నా ఎక్కువ మద్యం బాటిల్ పై ప్రేమ ఎక్కువ పొద్దున తొమ్మిది గంటలకి వెళ్లి ఎప్పుడో రాత్రి పన్నెండు గంటలకి వచ్చేవాడు. అప్పుడు మొదలై ఏ ఒంటి రెండు గంటలకు పుర్తయేది తను గొడవ పెట్టుకోవడం. చాల రాత్రులు నా జీవితంలో రాత్రి అనేది ఎందుకోస్తుందా, ఎందుకు ఉందో అని భయపడేవాన్ని అల అని నన్ను ఏమైనా అంటాడ అని కాదు తను తన జీవితాన్ని చాల చక్కగా తీర్చిదిదుకున్నాడు బీదరికం అనే పేరుతో. తను నిర్మించుకున్న బీదరికం వలలో అమ్మ అన్నయ అక్కయ నేను. ఒక్కో సరైతే ఇంట్లో ఉన్న వస్తువులనుండి ఇంటి మీదున్న పెంకుల వరకు అన్ని పగల గొట్టే వాడు ఇంటి తలపులని బావిలోకి విసిరి పడేసేవాడు మా బాపమ్మ (నాయనమ్మ) తను మాత్రం ఏం చేయగలుగుతుంది కండ్ల ముందే కొడుకు ఎలా పతనమవుతున్నడో చూస్తూ బాధపడడం తప్ప. బహుశ మా నన్నే నాకు ఆదర్శం కావచ్చు అందుకే తనకు విరుద్ధంగా జీవితంలో సిగరెట్టూ మద్యం నా దరికి చేరనివ్వకుడధానుకున్న. చేసే లేబర్ పనికి వచ్చిన కొద్ది మొత్తం డబ్బులో తాగుడు కు పోను మిగిలిన డబ్బుతో ఎవరిపై ఆధారపడకుండా గుట్టుగా ఇల్లును గడుపుతూ వచెది మా అమ్మ.
ఆ టైం లో స్కూల్ లో అందరి చేతుల్లో 50 పైసల నుండి మొదలు 2 రూపాయలు 5 రూపాయల వరకు రోజు కనిపించేవి దాన్నే పాకెట్ మనీ అంటారని తర్వాత తెలిసింది. నా దగ్గర మాత్రం పదో తరగతి వరకు కూడా డబ్బు అనే అవసరం సొంత కర్చులు అనేవి తెలీనే తెలియవు. మా ఇంటివేనకల ఉండే రాజమౌళి మామయ్య ఇచ్చే పోస్ట్ కార్డులతో, రంగు రంగుల స్కెచ్ పెన్నులు మిగిలిన పేపర్లతో బైండింగు చేసిన తెల్ల కాగితాల నోటుబూక్ లో బొమ్మలు గీయడం, లైబ్రరీ నుండి వారం వారం తీసుకొచ్చే పుస్తకాలతో గడిచిపోయిన కాలం లో పాకెట్ లో ఏ రోజు డబ్బు కోసం చేయి పెట్టింది లేదు. నిజమే ఇప్పుడు ఆలోచిస్తుంటే 20 వేలు పెద్ద కష్టం కాదు అని అనిపించొచ్చు అల అని ఇప్పుడు ఉన్నత స్థితులో ఉన్నామని కాదు పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. కానీ వాడ వాడ మొత్తం వినిపించేలా లొల్లి పెట్టె తన గొంతుకు తనే కళ్ళెం వేసుకున్నాడు. తన తాగుడు తో గొంతు కాన్సెర్ తెచ్చుకున్నాడు. అప్పుడు తన ఆపరేషన్ కి నేను అన్నయ కలిపి 50 వేలు ఖర్చు పెట్టాము ఎంత తాగుబోతైన కన్నా తండ్రి కదా.
కనీసం తనను చూసైన తనల తయరవకుడదని అమ్మ ఎప్పుడు చెప్తుండేది. ఇప్పటికి తన వ్యవహారం లో మార్పు లేక పోయిన మా ఎదుగుదలను చూస్తూ గర్వపడుతూ తన పని తాను చేసుకుంటున్నాడు.
అన్నయకు అక్కయకు నాకు అందరికి పెళ్లిల్లు అయిపోయాయి. పండగలకి అందరం కలుసుకోవడాలు. ఇప్పుడు బాపు కి మా అన్నయ కొడుకు హేమంత్ తో ఆడుకోవడం అమ్మ నెలలు నిండుతున్న అక్కయను చూసుకోవడం తో చాల బిజీ అయిపోయారు.
ఇప్పటికి తన లేబర్ పనిని మానుకోలేదు బాపు, మా సంతోషాన్ని కోరుతూ కనిపించని భగవంతుడికి వేల వేల దండాలు పెడుతూ అమ్మ. మొన్న ఈ మధ్య కట్టించిన రేకుల ఇంట్లో కాలం గడుపుతున్నారు. వారికీ ఈ హైదరాబాద్ వాతావరణం పడదు. ఎందుకో మా నాన్న తను పుట్టి పెరిగిన ఊరిని వ్యక్తుల్ని వదిలి రాలేనంటాడు తనతో పాటే అమ్మ నిజంగా వారె అన్యోన్న దంపతులు అని నాకనిపిస్తుంటుంది. మా బాపు చేసిన రాక్షసత్వాన్ని ఎవరు భరించలేరేమో అందుకే కాబోలు ఆడవారికి సహనం ఓర్పు ఎక్కువని అది మా అమ్మను చూసినపుడు మరి అనిపిస్తుంటుంది. వెళ్తే ఇక నేను కూడా తిరిగి హనంకొండ కే వెళ్తాను కావచ్చు. నా అనుకునే వారందరు కూడా కోరేది ఇదే నేనుంటే మా ఇంట్లో ఆ సందడే వేరు.
ఆత్మీయ అనురాగాలు ఆప్యాయతలను మరిచి ఏదో చేసెయ్యాలి అని అందరికి దూరంగా గడిపే నా లాంటి మిత్రులందరికీ తెలుసు వాటి అర్ధం ఏంటో..
ఎంత బిధరకాన్ని అనుబవించిన కాలంతో పాటు జీవన పరిస్థితులు మారుతాయి. మన సమాజం లో డబ్బు అనేది సమస్య కాదు నేను చుసినటువంటి సంపన్నులు మన హైదరాబాద్ లో కోకొల్లలు. ఆలోచిస్తే ఎవరికీ ఏ లోటు లేదు లోటు కేవలం మన మనస్సులో ఆలోచన విధానం లో ఉంది.
నేను మారితే అన్ని మారినట్టే..
లక్షలు పోసి పెంచుకుంటున్న పిల్లి కున్న సుఖం అనాధ ఆశ్రమం లో గడుపుతున్న ఓ అనాధ చెల్లి కి లేకుండా పోయింది అని బాధ పడడం తప్ప చేసేది ఏమి లేదనుకుంటూ దాని తలపై నిమిరి దాన్ని నా కెమరా లో బంధించి వెనుదిరిగాను.