Archive

Archive for December, 2012

పుట్నాలమ్మ

December 6, 2012 Leave a comment

ఈ రోజెందుకో 1 నెంబర్ మెట్రో బస్సు చాల సేపు రెతిఫైల్ స్టేషన్ లోనే గడిపింది.

కిటికీని నెమ్మదిగా తీసి బాగ్ ని ఒల్లో పెట్టుకొని కూర్చున్న.

“పల్లి బటాణి, పల్లి బటాణి” అనుకుంటూ ఓ ముసలావిడ. దాదాపు 80 కి పైన ఉంటుంది. ఇప్పటికి ఆ వయసులో పని చేసుకు బ్రతకాలనే తపన మెరుస్తున్న తన కళ్ళల్లో కనబడింది. 50 దాటితే చాలు మమ్మల్ని మా ఆలోచనల్ని ఎవరు కానట్లేధయ్య అంటూ వారి గోడు వెళ్ళబోసుకుంటూ కాలం గడుపుతున్న మా వీధి పెద్దలకు మరియు నాకు ఈ ముసలావిడ మంచి ఆదర్శం అనిపించింది.

 

ఎంతమ్మ..

రెండు రూపాయలకు చిన్న సీసడు (టానిక్ మూత), మూడు రూపాయలకు పెద్ద సీసడు (పిల్లలు ఆడుకునే చిన్న టీ కప్) బిడ్డ.

చెప్పు ఏ సీసడు కావలి.

చిన్న సీసడు బటానీలు ఇవ్వమ్మా అంటూ పది రూపయలిచ్చాను.

అయ్యో బోని నీదే బిడ్డ, చిల్లెర ఉంటె సూడు.

పర్లేధమ్మ ఉండనివ్వు.

అయ్యో వద్దు బిడ్డ నీ సొమ్ము నాకెందుకు.

ఇంకా మూడు సీసాలు ఇవ్వనా..

సరే ఇవ్వు.

పేపర్లో పోసి పొట్లం గట్టి చేతిలో బెట్టి, చిన్నగా ఊగుతూ, నెమ్మదిగా బొడ్డు సంచిలో పది రూపాయలను బెట్టుకొని, ఆకుపచ్చ రంగు చీర చెంగును సరిచేసుకుంటూ, పయిలం బిడ్డ అనుకుంటూ వెళ్ళింది.

కాసేపటికి ముందుకు కదిలిన బస్సుకి విరుద్ధంగా నా ఆలోచనలు వెనక్కి కదిలాయి.

**

తన పేరు నాకు ఇప్పటికి తెలియదు. కానీ మేము(పిల్లలమంతా) ఓ పుట్నాలమ్మ ఇటు రా మా అమ్మ పిలుస్తుంది. అంటూ పిలిచుకోచ్చేవాన్ని. రోజు కాకపోయినా వారానికోసారైన మా పుట్నలమ్మ మా గల్లికి వస్తుండేది. నాకు బాగా గుర్తు అప్పటికే తన వయసు అరవై ధాటి ఉంటుంది. ఎవరో తాను తెలియదు కాని తనకి మా ఇంటికి మంచి అనుబంధం. మా అమ్మంటే తనకి చాల ఇష్టం. ఎండన బడి వస్తున్న తనని నేను పిలువగానే ఎట్లున్నావ్ సరోజనవ్వ అనుకుంటూ ఇంట్లోకోచ్చేది. మా అమ్మ చేతి సహాయంతో బుట్ట కిందబెట్టేది. నన్ను పెద్ద చెంబులో నీళ్ళు తేమ్మనగానే. గబుక్కున వెళ్లి బింధలో ముంచి తీసుకొచ్చి ఇచ్చేవాన్ని.

 

“అవ్వో నా బిడ్డే సల్లంగుండు నాయన” అంటూ చెంబును చేతికి తీసుకొని. గడ గడ తాగేది.

“బడి లేదా నాయన”. “ఉంది ఒక్క పుటే. పోయ్యోచ్చిన”.

 

నా చూపు మాత్రం మా అమ్మ, పుట్నలమ్మ ముచ్చట్లలో కాకా, పుట్నాలు బటానీల బుట్ట మీదే ఉండేది. పెద్ద బుట్టలో ఒక సంచిలో పుట్నాలు, మరో సంచిలో బటానీలు, ఇంకో సంచిలో కర్రెంటు వైరునీ కాల్చిన తర్వాత బయటపడే రాగి, ఇత్తడి తీగలు, బొమ్మలు ఉండేవి. ఒక పక్కన సద్ది టిఫును, ఒక చిన్న తరాజు, సుతిలి తాడు తో వేలాడదీసిన చిన్న అయస్కాంతం. సాధారణంగ డబ్బుకు కాకుండా, రాగి ఇత్తడి తీగలను తీసుకొని, దోసెడుతో ఇచ్చేది.

 

నేను ఒక చిన్న గిన్నలో కొంచెం బెల్లం వేసుకొని పుట్నాలు పోసుకొని. ఇంటెనక వేప చెట్టుకింద నా గోనే సంచిని పరుచుకొని. పీటను తల కింద బెట్టుకొని. నిక్కరు సదురుకోని పడుకొని నా తల పక్కన పుట్నాల గిన్న పెట్టుకొని కొంచెం బెల్లం కొన్ని పుట్నాలను నోట్లో వేసుకొని, నెమ్మదిగా చప్పరిస్తూ, ఊరించుకుంటూ తింటూ, వేప కొమ్మలను, రాలుతున్న వేప పళ్ళను, దానికి ఆవల ఉన్న నీలాకాశం చూస్తూ, ఒక మంచి రాజభోగాన్ని అనుభావిన్చేవాన్ని.

 

మా బాపు ముందు గది లోకి రెండు వేల రూపాయలు గిరి గిరి కింద అప్పు తీసుకొచ్చి బండలేపించాడు. కొద్ది రోజులకి గిరి గిరి చిట్టి తీరగానే మల్లి అప్పుతీసుకొని కరెంటు పెట్టించాడు. నెమ్మిదిగా రాత్రిళ్ళు మా పడక ఇంటెనక చెట్టుకింద నుండి పంక(ఫ్యాన్) కిందికొచ్చింది. లైట్ వెలుతురున్నా కూడా, ఆ గదిలో వెన్నెల కనిపించేది కాదు.

 

ఒక్కో సారి పుట్నాలమ్మకి మా అమ్మ భోజనం పెడుతుండేది. అప్పుడప్పుడు జ్వరంగా ఉంటె తను మా ముందు గది పంక కింద నడుం వాల్చేది.

 

మా అమ్మ వాళ్ళ అమ్మ తన చిన్నప్పుడే కాలం చెల్లిందని. మా బాపమ్మనే తన తల్లిలా బావిస్తూ సేవలు చేసేది. మా బాపుని మా బాపు వాళ్ళ చెల్లేని(నాకు అత్తయ్య). పిల్లలు లేని మా బాపమ్మ,తాతయ్య వాళ్ళ తమ్ముడి దగ్గరనుండి దత్తత తీసుకున్నారు. ఆ రకంగా నాకు మా బాపు వాళ్ళ సొంత తల్లిదండ్రులు, పెంచుకున్న తల్లి దండ్రులు, ఇద్దరు బాపమ్మలు, ఇద్దరు తాతయ్యలు అంతే కాకుండా అమ్మ వాళ్ళ నాన్న ఆ తాతయ్య.

 

మా అమ్మ చదువుకోలేదు కాబట్టి తనకి ఓల్డ్ ఏజ్ హోమ్ ల గురించి తెలియదు. కేవలం ఆప్యాయత, అనురాగం తప్ప.

అందుకేనేమో తాతయ్యలు, బాపమ్మలు, మంచన పడితే విసుక్కోకుండా సేవలు చేసేది. చిత్రం ఏమిటంటే. అందరింట్లో అత్త కోడళ్ళ గొడవల గురించి వినపడేది కానీ, మా ఇంట్లో మా అమ్మతో ఎప్పుడు కృతజ్ఞత బావంగా ఉండేవారు. నా చిన్నప్పటినుండి. ఒకరి ఒకరి తర్వాత ఒకరు కల గర్బంలో కలుస్తుండడం, అప్పు తీసుకొచ్చి మరి కర్మ కాండలు చేపిస్తూ బాపు, వచ్చిన వాళ్ళందరిని అరుసుకుంటూ మా అమ్మ (అబ్బో మా చుట్టాల లిస్టు చెప్తే తరిగేది కాదు). నేను ఎందుకో వచ్చిన వాళ్ళతో పెద్దగ కలవలేక పోయేవాణ్ణి. నాకు మా ఇంట్లో ఎప్పుడు చావు డప్పు తప్ప వేరే శబ్దాలు వినపడలేదు. అందరు తాతయల్లు బాపమ్మలు దూరమయిన పది పన్నెండెండ్లకు గాని శుబకార్యం జరగలేదు మా ఇంట్లో.

 

అందుకే అనిపిస్తుంది ఆడవారికి, ఎంతో ఓర్పు, సహనం కావాలని, అవన్నీ మా అమ్మకి పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఇన్ని సేవలు చేసిన, తగోచ్చిన మా బాపు దెబ్బల తిప్పలు తనకి తప్పలేదు అన్ని బరించేది. నాకన్నా కొంచెం పొడుగున్న మా అన్న, ఏడుస్తూ మా అక్క, ఆపడానికి ఎంత ప్రయత్నించే వారో. ప్రతి రోజు రాత్రి బాపు వస్తున్నాడంటే గుండెలో దడ మొదలయ్యేది. ముసలోళ్ళు వాళ్ళు చెప్పిన పలితం లేకుండా పోయేది. తన అరుపులు మా గల్లీలో ఉన్న నా యిడు పిలగండ్లమందరికి వణుకే.

ఎంత గొడవ చేసిన కూడా ఒక్కసారికూడా బాపు మమ్మల్ని(నన్ను, అక్కయని, అన్నయ్యని) ఏమనలేదు. అదే మహా బాగ్యం అనుకునేది మా అమ్మ. ఈ రకంగా మా అమ్మ దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని అందరికి సేవ చేసేది.

 

అప్పుడుప్పడు పుట్నాలమ్మకి మా అమ్మ పాత చీర ఇస్తే, చీరను ప్రేమగా తాకుతూ. కంట నీరు పెట్టుకునేది. నువ్వు సల్లగుండాలి అవ్వ అంటూ దండం పెడుతుంటే. ఇదంతా అమ్మ కొంగు చాటున నుండి తొంగి చూస్తుండే వాణ్ని. అప్పుడనిపించేది, మనసులకి కావాల్సింది, డబ్బు కాదు ఒక మంచి మాట, చిన్న ఆప్యాయత, ప్రేమగా ఇచ్చే కాసిన్ని మంచినీళ్ళు. ఈ రకంగా మా అమ్మ దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని అందరికి సేవ చేసేది. ఆవును పట్టుకొని  ఇంటి ముందుకొచ్చే జంగాయన నుండి మొదలు పెడితే, కూరగాయలు అమ్ముకునే పెద్దమ్మ, చీరాల భద్రయ్య, వయసు పైపడి వంక కర్ర ఉతంతో పొద్దున్నే బన్ను రొట్టె తెచ్చే ఫతిమమ్మ, మెడలు పట్టుకుంటే సరి చేసే డబ్బా కదా అంటి, పెద్దలకు బియ్యం ఇచ్చినప్పుడు, మా విధి చివర్లో ఉన్న బాపనామే, పిరికెడు బియ్యం కోసం రోజు వచ్చే ఓ ముసలి తాత వరకు అందరు మా అమ్మ సేవకు ప్రతిఫలంగా మమ్మల్ని దీవించే వాళ్ళు. మా అమ్మ మాకు తెలియకుండానే మా మనస్సులో ఎన్నో విషయాలు నింపింది. అందుకేనేమో నాలో చదువుని, మనుషుల్ని నమ్మక. కేవలం మనసుల్ని నమ్మాలనే భావన నాటుకుంది. ఆ భావనే ఇప్పటికి నను ముందుకు నడిపిస్తుంటుంది.

 

ఆ రోజు పుట్నాలమ్మ తన ప్రేమను బటానీలు, పుట్నాలతో పెద్ద గిన్న నిండా నింపి ఇచ్చింది. గిన్న నిండా ఉన్న పుట్నాలు బాటనీలను చూడగానే నా మనసు ఎంత సంతోషించిందో మాటల్లో చెప్పలేను. అందుకేనేమో మా పుట్నాలమ్మ ఇప్పటికి నా మనసులో మేదులుతుంటుంది.

 

తెల్లారి ఆదివారం. దోసెడు నిండా ఒక పేపరులో పుట్నాలు, ఇంకో పేపర్లో బటానిలు కొంచెం బెల్లం జత చేసిపొట్లం కట్టుకొని, సంచిలో పెట్టుకొని, నేను సాబిర్ కొడుకు ఆరిఫ్, పాష భాయి కొడుకు అమ్జాద్, గుండం వాడ అబ్జల్, ఇర్షాద్, ఆరిఫ్ వాళ్ళ చిన్నమ్మ కొడుకు యాకుబ్ పాషా, కాకతీయ కలని రవి గాడు, మచిలిబాజార్ హరి, రాగాపురం అనిల్. అందరం కలిసి ముళ్ళ చెట్లతో నిండిన బాధ్రకాలి చెరువు గట్టు ని ధాటి, గుడిని ధాటి విశాలంగా ఉన్న ప్రదేశంలో అందరు క్రికెట్ ఆడుతుంటే, నేను మాత్రం దూరంగా ఉన్న చెరువును ఆస్వాదిస్తూ ఒంటరిగా నా మనసుకు నేనే ప్రశ్నలు వేస్తూ సమాధానం చెప్పుకుంటుండగా, అలసి పోయి ఒక్కొక్కరిగా వచ్చి నా పక్కన చేరే వాళ్ళు . అప్పుడు పొట్లాలు బయటికి తీసి అందరికి ఒక చేతిలో పుట్నాలు ఒక చేతిలో బటానీలు కొంచం బెల్లం పెట్టి. నేను కూడా ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ మాటలు లేకుండా ఆస్వాదిస్తూ. దూరంగా పరుచుకొని ఉన్న చెరువుని గుట్టను, చల్లని గాలిని ఆస్వాదిస్తూ గంటల కొద్ది గడిపేవాళ్ళం.

 

కొందఱు మన జీవితాల్లో చెరగని ముద్రలు వేస్తారు.

నిజమే కొన్ని అనుబంధాలు తర్కానికి అందవు కేవలం మానవత్వం అనే సన్నని తీగతో మా పుట్నాలమ్మ నా మనసుని అల్లుకుంది.

 

**

 

“నారాయణగూడ” “నారాయణగూడ” కండక్టర్ పిలుపుతో మెలకువ వచ్చి జ్ఞాపకాల తీగను తెంపి దబుక్కున కిందికి దూకి టైం చూసుకొని, అరరే టైంతో పాటే నేను కూడా యంత్రికున్నని, ఓ మరమనిషినని గుర్తు తెచ్చుకొని ఆఫీసు కి పయనమయ్యాను.

అపురూపం

December 6, 2012 Leave a comment

అపుడే జన్మించిన శిశువు అరుపు అపురూపం

పుట్టిన శిశువుకి మెత్తని అమ్మఒడి అపురూపం

ఉదయించిన సూర్యోదయంలో విరిసే గాలి అపురూపం

 

అపుడే రెక్కలు తెరుచుకొని గర్వంగా విరబూసిన మందారం అపురూపం

అందంగా ప్రకాశవంతమై నగ్నంగా కన్పించే ఆ గులాబీ పువ్వు అపురూపం

చల్లగా సేద తీరిన మేఘం నుండి వచ్చిన మొట్టమొదటి ముత్యపు చినుకు అపురూపం

 

గొంగళి పురుగు నుండి అందమైన సీతాకోక చిలుకల మారే తీరు అపురూపం

అందని అందమైన హరివిల్లులో ప్రకాశవంతమై కవ్వించే ఆ రంగుల సంద్రం అపురూపం

మనసు బాధని చల్లార్చి ధైర్యం చెప్పి ప్రోత్సహించే స్నేహం అపురూపం

 

ప్రతిక్షణం రంగులు మార్చే ఆ సూర్యాస్తమయం అపురూపం

సుధూర దూర తీరాలలో నుండి కమ్మగా వీచే చల్లని గాలులు అపురూపం

తెలియని మనస్సులో దాగిన ఊహలు అపురూపం

 

కదలాడే ఆ కళ్ళలో కనిపించకుండా కదిలే మౌన భావాలు అపురూపం

భువిలోని సప్త సముద్రాలలో పొంగే నీరు అపురూపం

నీటిలో ఒకదాని వెనుక ఒకటి నెమ్మదిగా సాగే అలలే అపురూపం

 

ఈ లోకంలోని ప్రతి అందం అపురూపం

అన్నిటికి మించిన మనవ జన్మ అపురూపం

అందాలన్నీటినీ ఆస్వాదించే అందమైన మనసు అపురూపం

 

ఈ క్షణలన్నిటిని ఒకటి కూడా వదలకుండా చూసే కనులు అపురూపం

నవరసాల సమ్మేళనంతో కూడిన జీవితం అపురూపం

జీవితాన్ని సృష్టించిన ఆ దైవం అపురూపం

ఆ దైవాన్ని మించి ప్రేమను పంచే అమ్మ అపురూపం.

Categories: కవిత్వం

ఆరుద్ర

December 6, 2012 Leave a comment

మళ్ళీ చాల కాలం తర్వాత జయతి అక్కయ  గారి ఫోటో ఆల్బం లో చూసాను ఆరుద్రని. అచ్చమైన ఎరుపువర్ణం లో ఉన్న ఆరుద్రని చూసి చాల కాలమైంది. దాదాపు పదేండ్లు కావస్తుంది.

వేసవి సెలవులు అనే పధం వినపడితే చాలు చిన్నమ్మ వాళ్ళ ఇళ్లు గుర్తొచ్చేది. కొత్తకొండ, ధర్మారం కరీంనగర్ జిల్లాలో ఉండేది వారి ఇళ్లు.  ఎండాకాలమే కాదు వర్షాకాలం శీతకాలల్లో కూడా నాలుగైదు రోజులు వెళ్లి గడిపెవాల్లము.

 

అప్పట్లో ఇప్పటి లాగ ఆటోలు లేవు హన్మకొండ బస్సు స్టాండ్ లో బాపు, అమ్మ, అన్నయ, అక్కయ, నేను అందరం కలిసి ములకనూరు బస్సు ఎక్కేవాళ్ళం.

అక్కడ మొదలైన బస్సు మెల్లిగా కదులుతూ పెట్రోల్ పంప్, నయీం నగర్, కాకతీయ విశ్వవిద్యాలయం దాటిన తర్వాతే వేగం పుంజుకునేది. ఆ కాలంలో బస్సు కిటికే నాకో పెద్ద ఇంటర్నెట్ ఎండకాలమైతే Windows XP వానకలమైతే Windows  Vista ఇక ఆ బస్సు కిటికిలోంచి  ప్రపంచాన్ని చూడడమే తరువాయి దూరంగ కనిపించే కొండలు, వేగంగ వెనక్కి పరిగెత్తే చెట్లు, ఒక గ్రాఫ్ లో గీతల్లాగా పైకి కిందికి ఊగిసలడుతున్నట్టు తోచే కరెంటు స్థంబాల వైర్లు, మధ్యలో కనిపిస్తున్న ప్రతి వారికి చెయ్యి ఊపుతూ టాటా చెపుతూ సాగే ప్రయాణంతో ఒక గంటలో ములుకనూరు చేరేవాళ్ళం. చుట్టూ పక్కన ఉన్న గ్రామాలన్నిటికీ అదే టౌను.

 

అక్కడినుండి కొత్తకొండ బస్సు ఎక్కి చుట్టూ ఉన్న సుందర లావణ్యాన్ని చూస్తుండగా చల్లని ఈదురు గాలులకు దీటుగా బస్సు దూసుకుపోతుంటే వెచ్చటి అమ్మ ఒళ్ళో కూర్చొని కిటికీ నుండి చూడగా దూరంగా మంచుతో కప్పబడిన కొండలు ఏదో గ్రామంలో ప్రయనిస్తున్నట్టు కాకా ఊటీ కొడైకెనాల్ కు వెళ్తున్న అనుభూతి కలిగేది(ఇప్పటికిను), మెల్లిగా చినుకులు పడుతుండగా పడిశం పడుతుందని అమ్మ కిటికీ మూసేది. నీటి తుంపర్లతో మసగ్గా మారిన కిటికీ  నుండి చూడగా కనిపించే కొండలు వాటిని కప్పుకొని ఉన్న మంచు పొగలు, జోరుగు కురుస్తున్న వర్షం, ఈదురు గాలులకు వంగి పోతున్న చెట్లు, ముద్దైన పంటపొలాలు, అన్ని కూడా, ఓ చిత్రకారుడు గీసిన వర్ణ చిత్రం లాగ తోచేది. అప్పుడప్పుడు తలుక్కున మెరిసే ఆవులు, పొలం చివర్లో గట్టుపైన కట్టుకున్న గుడిసెలు, తడుస్తూ పరుగులు పెడుతూ పొలం బాయిల కాడ నా ఈడు పిల్లలు, మరి వెలుతురుగా కాకా మరి చీకటిగా కాకా మసక వెలుతురులో, అధ్బుతమైన ప్రకృతి అందాలు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వంద మంది చిత్రకారుల వర్ణ చిత్రాలతో ఏర్పాటు చేసిన అతి పెద్ద సహజ గేలరీ ని చూస్తున్న అనుబూతి ఓ బస్సు కిటికీ ద్వారా కలిగేది.

 

మెల్లిగ వర్షం తగ్గే సమయానికి కొత్తకొండ కి చేరుకునే వాళ్ళం. ఇక అక్కడినుండి ధర్మారం గ్రామంలోకి వెళ్ళాలంటే ఎర్ర మట్టి రోడ్డు పై నాలుగు కిలోమీటర్లు నడవాల్సిందే. ఇక తడిచి ముద్దైన నేల బాటపై బురద చిల్లకుండ స్లిప్పర్లను బొటన వేలుతో గట్టిగ పట్టుకొని, అన్నయ చూపుడు వేలును ఆసరాగా తీసుకొని  నెమ్మదిగ అడుగులు వేస్తూ వెళ్ళేవాళ్ళం.  ఇక నేను మాత్రం కుడి వైపుకు ఉన్న పెద్ద పెద్ద కొండలని, గుట్టల చివరని, తల పైకెత్తి చూస్తుంటే, అక్కడికి చేరుకుంటే ఆకాశాన్ని అందుకోవడమే అని అన్నయ చెప్తూ ఉంటె వింటూ నడిచేవాన్ని, ఎడమ వైపు నేల కనపడకుండా పచ్చని పొలాలు, చిన్న చెరువు, చెరువు మొత్తం ఓ frame  లాగ ఆకాశం మేఘాలు ఆ frame  లో బంది అయి కనులకు ఇంపుగా తోచేది.

 

ధోతి పైకెత్తుకొని, తలకు రుమాలు చుట్టుకొని, చలి బెట్టకుండా గొంగడి కప్పుకొని, చేతి కర్ర పట్టుకొని, ఆహే ఆహే అంటూ పాతిక గొర్రెలను తోలుకుంటూ ఎదురొచ్చే తాత, పెద్ద సైకిల్ పై గోనే సంచుల మూటలతో లుంగీలు కట్టుకొని ఎదురొచ్చే మధ్యవయసు యువకులు, కూలి పనులకి పోతున్న ఆడవాళ్ళు, ఒక్కొక్కటి ఎదురు పడుతుండగా చూస్తూ వెళ్ళేవాళ్ళం. ఆ నాలుగు కిలోమీటర్ల ప్రయాణంలో కొండలపైనుండి పరుగులు పెడుతున్న కొండెంగా కోతులు, ఎలుగుబంట్లు, పరుగులు పెట్టె కుందేళ్ళు (చిత్రం అవ్వన్నీ ఇప్పుడు డబ్బులు పెట్టి “జూ” కి వెళ్తే తప్ప చూడని పరిస్థితి), బతుకమ్మ పండగలో ఉపోయోగించే, తంగేడ పూలు, సీత  జడ పూలు, ఇంకా నాకు పేర్లు తెలియని అందమైన పూలు, నిలువెత్తు జమవాయిలు చెట్లు, మామిడి, జామ, కంకి, వరి, పత్తి, ప్రొద్దు తిరుగుడు పూల తోటలు. అన్ని కూడా నన్ను సాధారముగా ఆహ్వానం పలికేవి, నా మనసు ఎన్నో అవతారలేత్తేది నాలో బిన్న భావాలూ ఒక కవిగా, శాస్త్రవేత్తగా, చిత్రకారునిగా, విశ్లేషకుడిగా, దర్శకుడిగా, ఫోటోగ్రాఫర్ గ, సృష్టి రహస్యాన్ని చేధించాలనే ఓ యోగి ల , జీవిత పరమార్ధం ఈ ప్రకృతిలోనే దాగుందని నమ్మే ఓ సాధువుల ఇలా  చెప్పుకుంటూ పోతే ఎన్నో అవతారాలెత్తిధి.

మనసుని చూపుని నాకు సాధ్యమయెంత  వరకు ఓ వల లాగ విసిరి ఆ ప్రకృతి దృశ్యాన్ని మొత్తం గుండెల్లో పదిలంగా దాచుకొని మనస్పూర్తిగా ఆనందించే వాణ్ని.

 

నాలుగు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ధర్మారం లోకి చేరుకునేవాళ్ళం. ఆ గ్రామం లో మొదటి ఇల్లు మా చిన్నమ్మ వాళ్ళదే. మూడు గదులు గల చిన్న పెంకుటిల్లు ముందు కూర్చోవడానికి గద్దె(అరుగు), నీడకోసం వేసిన పందిరి దానికి అల్లుకొని పెరుగుతున్న బటాణి పూల చెట్టు, మూడు గదులు కూడా ఎర్రమన్నుతో అలికి ముగ్గులు పెట్టి ఎప్పుడు శుబ్రంగ ఉంచుతుంది చిన్నమ్మ(శుబ్రత విషయంలో మా చిన్నమ్మ తీసుకొనే జాగ్రత్తలు అంత ఇంత కాదు). ఇంటి వెనకాల విశాలమైన ప్రదేశం మధ్యలో అతి పెద్ద చింత చెట్టు ఆ ఇంటి మొత్తాన్ని ఓ గొడుగుల తన కౌగిల్లోకి తీసుకొని కాపాడుతున్నట్టు ఉంటుంది. ఓ మూలన దాదాపు ఏడెనిమిది బొప్పాయీ చెట్లు, రెండు జామ చెట్లు, నిమ్మ చెట్టు, కాయగూరల మొక్కలు, కనకాంబరం, సీత జడ పూల మొక్కలు, ఇంకా కంద మొక్కలు, పాలకూర, బచ్చలి, చిక్కుడు మొక్కలు ఉండేవి. ఎప్పుడు ఇంట్లో కుటుంబ సబ్యుల్లా మెదిలే చిట్టి పిల్లి కూనలు(రెండు ముద్దల పెరుగన్నం పెడితే తినేసి ఇంట్లో ఓ మూలాన సేద తీరేవి), కోడి పుంజులు, పదికి పైన కోళ్ళు.

 

అప్పట్లో సైకిల్ అద్దెకిచ్చే షాపు నడిపించేవాడు బాబాయ్, గ్రామం లో అందరికిను మాట సాయం, చేత సాయం చేస్తూ ఏదైనా గొడవలు సమస్యలు గ్రామం ప్రజల్లో కలిగితే న్యాయ నిర్ణేత (పెద్దమనిషి) గ వ్యవహరించేవాడు.

 

ఇంట్లోకి చేరుకోగానే చిక్కటి మజ్జిగ తాగి చింత చెట్టు కింద ఎవరికీ నచ్చిన చోట వారు చాపలు పరుచుకొని సేద తీరుతుంటే, చింత చెట్టు కాడా మట్టి పోయ్యిలోనే వంటలన్నీ కూడా దానికి అనుకోని పక్కనే రోలు రోకలి(రోకలి తో ఉన్న అనుబంధం అంత ఇంత కాదు), ఇక నేను బయటికొచ్చి, ఎదురుగా ఉన్న రెండెకరాల పొలంలోకి వెళ్ళే వాణ్ని వెళ్లిన ప్రతిసారి రకరక ల పంటలు పత్తి, మొక్క జొన్న, కంది, ప్రొదు తిరుగుడు, బాబ్బెర్లు పండించేవారు నాకు మాత్రం ప్రొద్దు తిరుగుడు, కంది, బాబ్బెర్ల పంటలంటే  మరి ఇష్టం. ఆ పొలం లో ఎంత సేపు గడిపిన తక్కువే అనిపిస్తుంటుంది. ఆ పొలం ధాటి మట్టి దారిని ధాటి వేరే పొలం గట్ట్లపైనుండి నడుస్తూ వెళితే కనిపిస్తుంది పెద్ద ఊడల మర్రి చెట్టు, అక్కడ ఊడలు చేత పట్టి ఊయల ఊగే ప్రయత్నం చేసే వాణ్ని, ఆ మర్రి చెట్టు మొదల్లో కనిపించేవి ప్రదేశమంత మహారాజుల్ల మహారానిల్ల  పాలిస్తున్నట్టుగ ఆరుద్ర పురుగుల గుంపు, చాల సార్లు చేతిలోకి తీసుకొనే ప్రయత్నం చేశాను కాని ధైర్యం చాలలేదు. ఎత్తు వంపులను ఎక్కుతూ థిగుతూ, ఒక దాని వెంబడి ఒక్కొక్కటి రైలు బోగిల్ల వెళ్తుండడం భలే ముచ్చటేసేది. ఆ గ్రామం లో గడిపిన రోజుల్లో ప్రతి రోజు ఆరుద్ర పురుగుల రాజ్యానికి వెళ్లి వచ్చేవాడిని. ఆరుద్ర రాజ్యాన్ని అనుకొనే పెద్ద నల్ల చీమల రాజ్యం, దానికి కొంచెం దూరం లో ఉన్న పిచ్చి మొక్కలను ఆసరాగా తీసుకొని జీవనం సాగిస్తున్న బంగారు పురుగులు, అలా కొంచెం తల పైకెత్తి చూస్తే కనిపించే తేనె తెట్ట ల మహేలు, ఒక వందకు పైగా సంగీతాలు వాయించే పిచుకలు వాటి గూళ్ళు, అప్పుడప్పుడు వినిపించే కోయిల స్వరం, ఊడల మధ్యలనుండి సింధూరం పూసుకొని సిగ్గుతో తలదించుకొని అస్తమిస్తున్న సూర్య బింబం, గాలి విచినప్పుడల్లా పసుపువర్నంలోకి మారి రాలుతున్న ఆకులు, ఇలా ఓ అధ్బుత సుందర లోకం లోకి అతిధిగా వచ్చిన  నా మనసుకు ప్రతిరోజు సేవ చేసేది ఆ ప్రాంతం అంత. ఇదే తంతు ప్రతి రోజు ఒక్కోరోజు ఉదయాన్నే వేల్లెవాన్ని ఒక జేబులో వేయించిన పల్లీలు, మరో జేబులో, వేయించిన శనగలు, చేతిలో మొక్కజొన్న పాలేలు, అలా తినుకుంటూ అక్కడికి చేరుకొనే వాణ్ని, అపుడే ఉదయిస్తున్న సూర్యుని కిరణాలూ, పంట పొలాలపై ప్రతి చిన్న ఆకును కూడా వదలకుండా పడేది. జివ్వుమని తగిలిన సూర్యకిరణం ప్రతి ఆకును మేలుకోల్పేది. ఆకూపై సేదతీరుతున్న చిన్న చిన్న నీటి బిందువులు పై పడుతున్న సూర్యకిరణం తో ఉత్తేజితమై వజ్రపు రంగులోకి రూపాంతరం చెందేది. అదంతా గమనిస్తున్న నేను నా మనసు కెమరాలో బంధించుకునే వాణ్ని. హమ్మయ్య లేగండ్రా  అనుకుంటూ ఆరుద్ర పురుగులు బయటికోచ్చేవి తమ రాజ్యంలో  ఉన్న మిగతా పురుగులతో ఆ సమయంలో వాటి రంగు మరింత తేజోమయమై ఉండేధి.

 

కొంత కాలం తర్వాత నా జేబులోకి డిజిటల్ కెమరా వచ్చి చేరాక ఆ ఆరుద్ర కోసం నాలుగు రోజులు వెతికాను. ఈ అతిధి మీద కోపం పెంచుకున్నాయేమో లేక మరే కారణమో కాని కాలంతో పాటు జరిగిన మార్పులతో మర్రి చెట్టు, ఆ ఆరుద్రలు, పక్షుల గూళ్ళు, కాలంలోనే మాయమయ్యాయి. ఏమో ఏదో తెలియని అనుబంధం ప్రక్రుతితోనో లేక బావాలతోనో, లేక నాలోనే దాగిన నాతోనో ఏమో ఎవరికీ చెప్పుకోలేని ఓ వింత వేదనకి గురయ్యాను అవి కనపడక పోవడంతో. చెప్పాలంటే ఆ గ్రామం లో నేను చుసిన ప్రతి అంగుళం కూడా నా మనసు వాటికి మాత్రమే తెలిసే బంధం ఏర్పరుచుకున్నది. ఒక్కో చోటు ఒక్కో పుస్తకమై మనసు లైబ్రేరి లో దుమ్ముపట్టకుండా పదిలంగా దాచుకున్న.

 

పదిహేను సంవత్సరాల్లోనే అభివృద్ధి పేరుతో మనుషుల మధ్యన జరుగుతున్న మార్పులు ఆ గ్రామాన్ని కూడా చుట్టుముట్టాయి. ఇది కొత్తేం కాదు నేను ఊహించిందే అయిన జంతు సంరక్షణ పేరుతో కనిపించిన ప్రతి మూగ జీవిని లాక్కెళ్ళి పోయారు, కొన్ని వందల నెమల్లు, కొండెంగ కోతులు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు, ఒకటి రెండు చిరుతలు, వందల్లో వింత వింత పాములు. ఇలా చెప్పుకుంటూ పోతే తమ తమ రాజ్యాలని కొల్లోగోట్టిన మహానుభావులము మన మానవులమే అని చెప్పుకోవడంలో ఏమాత్రం సిగ్గుగా లేదు.

 

ఆ గ్రామా ప్రజలందరికీ రాజకీయ గుర్తింపు లబించింది. ఇక రాజీకయ అనుబవగ్నులకి ప్రజలంతా ఉపయోగ పడడం మొదలయింది. పంటలను తగ్గించి, కొల్ల ఫారాలు( పెద్ద  మొత్తం లో వచ్చిన నష్టం ఏ ప్రబుత్వం బరించలేక పోవడం తో వారి నెత్తినే భారం వేసుకొని రైతన్నల మేడలు వంగి పోవడం జరిగింది), పొగాకు బిడిలా సెగ ప్రతి పాలిచ్చే మహిళను కూడా పనిలోకి దింపింది. చైతన్యం పేరుతో గ్రామా దేవతల పండుగలు, ఎడ్లబండ్లపై కొత్తకొండ జాతరను దర్శించుకోవడాలు, ఇంట్లో కుల దేవత పూజలు, అన్ని మాయమవుతున్నాయి, ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు నడిచే ఓపిక, సమయం ఎవరికీ లేదు ప్రతివారు చేతిలో వాచీ చూసుకొని టైం లేదు మరీ చాల బిజీ, ఆటో లు మొదలయ్యాయి బస్సులు కరువయ్యాయి, నా కిటికీ గేలరీ మూతపడింది. 

 

పిల్లల చేసే అల్లరికి ప్రకృతి మాత మౌనంగ కొంగు అడ్డుపెట్టుకొని బాధ పడడం కళ్లారా కనిపించింది. అయిన ఏదో ఆశ, ఏదో అలజడి, ఒక కొత్త అనుబవం, ఒక కొత్త కోరిక ఎప్పుడు నా మనసును ఆ గ్రామా ప్రకృతి దేవత తన వైపుకు లాగుతుంటుంది. ఇప్పటికేమి మించిపోయింది ఏమి లేదని గ్రామా బ్యాంకు సహాయంతో వ్యవసాయశాక   అధికారులు, వేప మందు పరిచయం చేసారు. మంచి పనులు చేయడానికి గ్రామా పెద్దలు ముందుకు రావడం కూడా ఆరోగ్యకరమైన విషయమే.

 

గ్రామానికేల్లి చాల రోజులయ్యింది. కొత్తగ  తీసుకొన్న ప్రొఫెషనల్ కేమరకి ఇంకా ఆ గ్రామాన్ని పరిచయం చేయలేదు. మరో నాలుగు రోజులు వెళ్లి గడపాల్సిందే.

మెల్లిగ నెమరువేసుకున్న పుస్తకాన్ని మనసు లైబ్రేరి లో బద్రంగా పెట్టుకొని. అందమైన ఆలోచనల నుండి బయటపడి మల్లి రణగొణ ధ్వనులతో యుద్ధం సాగిస్తూ సికింద్రాబాద్ రేతిఫైల్ బస్సు స్టాప్ లోనుండి ఒకటో నెంబర్ బస్సెక్కి ఆఫీసు కి పయనం..

జీవితం – ఒక రైలు ప్రయాణం

December 6, 2012 Leave a comment

హలో ఎలా ఉన్నారు అన్నయ అని పలకరించింది శ్రావ్య.

చాల రోజుల తర్వాత విన్న గొంతు తో మనసులో సంతోషం ఒక్కసారిగా పొంగుకొచ్చింది.

కులాసా కబుర్ల తర్వాత ఫోన్ అరుణ్ అందుకున్నాడు.

ఏరా మామ ఎలా ఉన్నావు రా అంటూ మొదలు పెట్టిన మాటలు ౩౦నిమషాలకి గాని పూర్తవలేదు.

ఫోన్ పెట్టేసి పక్కకు తల వాల్చి…

అరుణ్ శ్రావ్య లే కాళ్ళ ముందు మెదిలారు.

జీవితం అనే రైలు ప్రయాణం లో ఎన్నెన్నో మలుపులు కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులు, కొత్త మధురనుబుతులు కొందరు దగ్గర ఉన్న పట్టించుకోము. దూరంగా ఉంటె తట్టుకోలేము. కానీ అరుణ్ శ్రావ్య వీరు మాత్రం ఎక్కడున్నా నా మనసులో ఎప్పుడు మెదులుతూనే ఉంటారు.

2004 కాజిపేట లో కృష్ణ  ఎక్స్ ప్రెస్ ఎక్కినా రెండు నిమిషాలకి కదిలింది. లక్కీగ కిటికీ పక్క సీటు కాలిగా ఉండడంతో వెళ్లి కూర్చున్న మెల్లిగా బాగ్ లో నుండి బుచ్చిబాబు చివరికి మిగిలేది బుక్ తీసి చదవడం మొదలు పెట్టాను. ఒక పేజి చదివిన తర్వాత ఎదురుగా ఉన్న వ్యక్తి చదువుతున్నా పుస్తకం పై కన్ను పడింది “కలలో జారిన కన్నీరు” అది కూడా బుచ్చి బాబు గారిదే.

నా పేరు రఘు అంటూ పరిచయం చేసుకున్నాను. తను అరుణ్ అంటూ చేయి చాచాడు. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని. మాటల్లో దిగాము. మూడు గంటల ప్రయాణం తర్వాత సికింద్రాబాద్ చేరుకున్నాం. మూడు గంటల ప్రయాణం లో చాల అర్ధమైపోయాము. ఎంతగా అంటే ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టుగ.

చాల కలం తర్వాత నాలుగు రోజుల కాలి సమయం దొరికింది కదా అని హైదరాబాద్ లో ఉన్న పెన్ ఫ్రెండ్ పీటర్ ని కలిసి ఒక నాలుగు రోజులు గడుపుదామని బయలుదేరాను. మధ్యలో ఇలా అరుణ్ పరిచయం.

అప్పుడు మొదలైన మా పరిచయం ఎన్నో మార్పులు చేర్పులు ఇరువురి జీవితాల్లో జరుగుతూ ఉన్న మా స్నేహం మాత్రం కొనసాగుతూనే ఉంది.

అరుణ్ కి పాలిటిక్స్ అంటే మమకారం CM  కావాలని కలలుకంటుండె వాడు. వాడు, వాడి ఆలోచనలు ఎప్పుడు బడుగు బలహీన వర్గాల చేయుతకై పాటు పడే సంఘాలతో పల్లెల్లో రసాయనాల వాడకాన్ని నిర్ములించి వేపతో తాయారు చేసిన పురుగుల మందు పై అవగాహనా కలిగించేందుకు వ్యవసాయ శాక అధికారులతో గ్రామాల్ని పర్యటించేవాడు. సమస్యని ఎత్తి చూపడం తగ్గించి, దానిని ఎలా అధిగమించాలి అని ఆలోచిస్తూ తన వంతు సాయం చేయడానికి ఎప్పుడు సిద్దంగ ఉండే వాడు.

వాడికి ఉన్న రాజకీయ అనుభవం అవగాహనా వాడు రాస్తున్న ఆర్టికల్స్ లో ప్రస్పుటంగ కనిపించేవి. నువ్వు కనుక CM  అయితే ముందు ఎం చేస్తావురా అని అడిగితే. మద్యం, సిగరెట్టు, గుట్క లు అమ్మే షాపుల్ని ఒక్కసారిగా పెకిలించేసి రాష్ట్రంలో ఎక్కడ కూడా మద్యం, సారాయి, లాంటి మత్తు పదార్ధాల్ని, లేకుండా చేస్తాను. అని చెప్తూ ఉంటె పక్కనున్న మేమంతా గొల్లున నవ్వేవాళ్ళం. దానికి వాడు ఏ మాత్రం చిన్న బుచ్చుకోకుండా, ఈ మాత్రం కూడా చేయలేని వాడు CM  అయ్యే బదులు అడుక్కుతినడం మేలు. అనే వాక్యంతో మా నోర్లు మూసే వాడు.  వాడి ఆలోచనలు కేవలం ఆలోచనలతో పరిమితమయ్యేవి కావు. ప్రతిది కూడా చాల పకడ్బందిగా సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో ఎవరిని కలిస్తే త్వరగా పని పూర్తవుతుందో వారిని కలిసే వాడు.

తండ్రి లేడు తల్లి మాత్రం ఉంది వీడొక్కడే కొడుకు. ఊర్లో పొలం, పాలేర్ల (పని వాళ్ళు) తో సాగు చేపిస్తుండేది తల్లి. వీడి దూకుడు చూసి వీడి మామయ్య తన కూతుర్ని ఇవ్వనన్నాడు. అరుణ్ ఇంకా వాడి ఫ్రెండ్స్ తో కలిసి గ్రామాల్లో నిరక్షరస్యతో నిర్మూలన పేరుతో నాటకాలు వేయిస్తూ. కలెక్టర్, గ్రామా పెద్దల సహకారంతో మారుమూల పల్లెల్లో మరుగుదొడ్లు కట్టించడం, ఏదైనా ఒక గ్రామాన్ని తీసుకొని వ్యవసాయ శాక అధికారి సహాయంతో  రోడ్డు కిరువైపులా వేప మరియు పళ్ళ మొక్కలని విద్యార్థులతో నాటించడం. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.  ఆ కార్యక్రమాలకి నన్ను కూడా లాక్కొని పోయేవాడు.

తనని చూసినప్పుడల్లా నేనెందుకు నా ఆలోచనలని చేతల్లో పెట్టలేకపోతున్న అని ఆలోచించేవాన్ని.

ఒక వ్యక్తి ఆలోచనకు ఎంత బలం ఉంటుందో. తనని చూస్తే తెలుస్తుంది.

వాడితో గడిపింతసేపు రాజకీయాలు, సేవ కార్యక్రమాలే కాదు, మా వయసుకు తగ్గట్టు సినిమాలు, బైక్ షికార్లు, సంగీతం, కొత్త అనువాద పుస్తకాలు, గుళ్ళు, జగన్నాధ రథ యాత్రలు, గణపతి ఉత్సవాలు, సికింద్రాబాద్ మహంకాళీ, ఓరుగల్లు సమక్క సారలమ్మ జాతరలు, హొలి సందళ్ళు, పండగలలో ప్రతి పల్లెల్లో రక రకాల విందు బోజనాల పిండి వంటల రుచులు, పల్లె సువాసనలు పీలుస్తూ ఎడ్ల బండ్లపై ప్రయాణాలు, పొలం గట్లపై నడకలు, మోకాళ్ళ పైకి పాయింటుని మలుచుకొని బురదలో పరుగులు, మా ఇంటి వెనకాల గుట్ట పై రాళ్ల తో ఆటలు, ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్లపై బెల్ పూరి, పావ్ బాజీ, కంకులు, పిచు మిటాయి, టపాసులు, కేకు తో న్యూ ఇయర్ సంబరాలు, ఒకటేంటి ఎన్నో ఎన్నెన్నో…

ఎయిడ్స్ అవగాహనా సదస్సు కై ఓ స్వచ్చంద సంస్థ నిర్వహించిన కార్యక్రమం లో బాగంగా కొందరు నృత్యకారులు తమ నృత్య ప్రదర్శన ఇచ్చారు. దానికి అరుణ్ తో కలిసి నేను వెళ్ళడం జరిగింది. ప్రదర్శన తర్వాత డాన్సు కంపోస్ చేసిన డాన్సు మాస్టర్ నాలుగు పదులు నిండిన ఓ మాతృ మూర్తి లలిత దేవి గారిని కలిసి అభినందించాము. ఆ పరిచయం తర్వాత వివిధ కార్యక్రమాల్లో తరచు కలవడం తన దగ్గర శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటున్న శ్రావ్య తో పరిచయం చాల త్వరగా జరిగింది.

పరిచయమైనా కొద్ది రోజులకి అరుణ్ శ్రావ్య చాల దగ్గరయ్యారు. అన్నయ అన్నయ అంటూ ఆప్యాయంగా పలకరించేది ఎప్పుడైనా లలిత దేవి గారింటికెళ్తే  తప్పక కనిపిస్తుండేది. ఒక రోజు అరుణ్ నాతో శ్రావ్యని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. విషయం చెప్పడానికి ధైర్యం చాలట్లేదని చెప్పాడు. నేను వీడు చెప్పిందే ఆలస్యంగా వెంటనే శ్రావ్య తో విషయం చెప్పను తను చాల కూల్ గ ఇది జరగని పని అన్నయ అని చెప్పింది. ఎంతైనా టైం పడుతుంది కదా అని అనుకోని పర్లేదు ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పాను.

అరుణ్ కి వ్యవసాయ శాకలో చిన్న ఉద్యోగం దొరికింది. అదే రోజు ధైర్యం తెచ్చుకొని తన ప్రేమ విషయాన్నీ చెప్పాడు శ్రావ్యతో.

తను అవుననలేదు కాదనలేదు గంట సేపు మౌనం తర్వాత తల కొంచెం ఎత్తి శ్రావ్య తన జీవితంలో ప్రతి నిర్ణయం లలిత దేవి గారికి తెలియకుండా తీసుకోలేను. నువ్వోక్కసారి తనకి ఈ విషయం చెప్పు అని చెప్పి గుడి గంటలు మోగుతుండగా సికింద్రాబాద్ గణపతి టెంపుల్ లో నుండి ఓని సరి చేసుకుంటూ వెళ్లి పోయింది.

రణ గోణా ధ్వనులతో ఎవరికీ ఎవరు కానట్టుగ పరుగు లాంటి నడకలతో మమ్మల్ని డీకొంటున్న జనాలను చీల్చుకుంటూ నడుస్తూ విషయం నాతో చెప్పాడు.  నాకు అప్పుడు అర్ధం కాలేదు ఒక గురువికి, శిష్యురాలికి, ఈవిడకి, ఆవిడకి గల సంబంధం ఏంటో..  మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు. లలిత దేవి గారే తన బాగోగులు చూసుకుంటుందని తల్లి తండ్రి లేని శ్రావ్యకి అండగా ఉంది. ఆ క్షణం ఒక్కసారిగా నా కంటికి లలిత దేవి గారు నిజమైన మాత్రుముర్తి లాగ కనిపించారు.

మంచి సమయం చూసుకొని నేను అరుణ్ లలిత దేవి గారిని కలిసాము. కొంతసేపటి తర్వాత అరుణ్ చెప్పడం మొదలు పెట్టాడు. నేను శ్రావ్య పెళ్లి చేసుకోవాలను కుంటున్నాను అని దానికి సమాధానం గా రఘు నేను అరుణ్ తో పర్సనల్ గ మాట్లాడాలి అని చెప్పడం తో ఆరు బయట లాన్ లో మొలిచిన పచ్చ గడ్డిని చూస్తూ పైన వేలాడదీసిన పంజరం లో ని రెండు పిచ్చుకలని చూస్తూ ఆ పక్కనే ఉన్న డాన్సు క్లాసు రూము లో సాగరసంగమం సినిమాలోని బాలకనకమయ చేల సుధాకర అని వినిపిస్తున్న పాటని ప్రాక్టీసు చేస్తున్న చిన్నారులను చూస్తూ నిల్చుండి పోయాను..

ఒక గంట తర్వాత బయటికి వడి వడి గ వస్తున్న అరుణ్ చూసి కంగారు పడ్డాను.

ఏమైందిరా అని అడిగాను.

ఏమి చెప్పలేదు. కాసేపు మౌనంగా క్లాసు రూము బయట అరుగుపై కూర్చొని కాలి వేళ్ళతో గడ్డిని తెంపుతూ ఆలోచనలో బడ్డాడు. మెల్లిగా మాట్లాడడం మొదలు పెడుతూ. నేను ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్ననురా ఎవరు ఏమైనా అనుకోని తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న… అని అన్నాడు దానికి నేను లలిత దేవి గారు ఏమన్నారు. అని అడిగాను.

చాల సేపు మౌనంగ ఉండి తనకు కూడా ఇష్టమే అని చెప్పాడు.

నేను సంతోషించి మరి ఇంకేం శ్రావ్యతో ఈ విషయం చెప్పు అని అన్నాను.

క్లాసు రూము లో ఉన్న శ్రావ్య ని బయటికి రమ్మంటూ సైగ చేసి.

నేను లలిత దేవి గారి తో మాట్లాడను. అంటూ శ్రావ్య చేతిని తన చేతి లోకి తీసుకొని మెల్లిగా లలిత దేవి గారి దగ్గరికి తీసుకెళ్ళాడు వారి వెంటే నేను.

ఒక్క సారిగా మమ్మల్ని ఆశిర్వదించండి అంటూ లలిత దేవి గారి కాళ్ళపై  ఇద్దరు మోకరిల్లారు.

ఛ ఛ ఇదేంటయ్య లేవండర అంటూ వారిద్దరిని అక్కున చేర్చుకుంది. ఆ రోజు లలిత దేవి గారి కళ్ళల్లో ఆనందం తో కూడిన అశ్రువులను నేను చూడకుండా తన కళ్ళజోడు ఆపలేకపోయింది.

నేను ఒప్పుకుంటే సరిపోదు మీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి ముందు ఆ పనిలో ఉండండి అని చెప్పింది. అంతే కాకా పెళ్లి శ్రావ్య నర్సింగ్ కోర్సు పూర్తవగానే చేద్దాం అంది.

ఇక వీరి ఆనందాలకి అవధుల్లేవు.

ఒక విధంగా అరుణ్ నాకన్నా పెద్దవాడైన ఎప్పుడు మేము మామ మామ అంటూ పిలుచుకునే వాళ్ళం.

ఆ రోజు తర్వాత మళ్లీ నాకు చాల రోజులకు కలిసాడు.

ఉద్యోగం బానే ఉంది అన్నాడు. మెల్లిగా తన స్థావరాన్ని హైదరాబాద్ కు మార్చుకున్నాడు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను ఇక అరుణ్ శ్రావ్య తరుచు కలుసుకోవడాలు.

ఫ్రెండ్స్ అందరం కలిసి పిక్నిక్ లు ప్లాన్ చేయడం. పోలియో చుక్కల కార్యక్రమాలకి శ్రావ్యతో పాటు అందరం వెళ్ళడం. హాస్పిటల్స్ కి, రక్త దాన శిబిరాలకి, ప్రతిదానికి అందరం కట్ట గట్టుకొని వెళ్ళేవాళ్ళం.

డాన్సు ప్రోగ్రాం ఇస్తున్నది తెలిస్తే చాలు అందరం కలిసి మరి వెళ్ళేవాళ్ళం.

కొన్ని రోజులు కలిసాక అరుణ్ తన తల్లి ని ఒప్పించి అరుణ్ ఫ్రండ్స్ శ్రావ్య ఫ్రెండ్స్ లలిత దేవి గారు వారి భర్త నారాయణ మూర్తి మరియు మరికొంత మంది సమక్షం లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరు లేని వాళ్ళలాగా ఇలా పెళ్ళిచేసుకోవడం తనకు ఇబ్బంది కలిగించినదేమో తన కొడుకు బాధపడుతాడని పక్కకొచ్చి కొంగుతో కళ్ళు తుడుచుకుంది అరుణ్ తల్లి.

నేను ఊహించలేదు తన పెళ్లి ఇంత త్వరగా జరుగుతుందని. ఆ మరుసటి రోజు నేను లలిత దేవి గారు, నారాయణ మూర్తి గారు, ఇంకా కొంత మంది మిత్రులతో తిరుపతికి ప్రయాణమై అక్కడ దండలు మార్చుకొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

అందరికి చాల సంతోషమేసింది చూడ చక్కని జంట అంటూ లలిత దేవిగారు మెచ్చుకున్నారు.

పెళ్ళైన కొద్ది రోజులకి శ్రావ్య కి ఓ ప్రబుత్వ ఆసుపత్రి లో హెడ్ నర్స్ గ జాబు వచ్చిందని అది కర్ణాటక లో హున్సూర్ కి దగ్గర ఓక గ్రామం లో అక్కడే తెలిసిన వారి అనాధ ఆశ్రమం ఉండడం తను జాబు చేస్తాననడం తో అరుణ్ శ్రావ్య ఇద్దరు అక్కడికి వెళ్ళడం జరిగింది.

వెళ్ళిన కొద్ధిరోజులకి అరుణ్ శుభా వార్త చెప్పాడు తను తండ్రి కబోతున్నట్టు. శ్రావ్య కూడా మాట్లాడి అన్నయ నువ్వు మామయ్య అవుతున్నావ్ అంటూ ఎంతో సంతోషం తో తన మాటల్లోనే తన ఆనందం చూడగలిగాను.

మరో పది రోజులు గడిచాక అరుణ్ కాల్ చేసి నేను హైదరాబాద్ కి వస్తున్నాను నిన్ను కలవాలి అని.

అన్నట్టుగానే వచ్చాడు.

తన గురించి వెయిట్ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నేను.

కాసేపటి తర్వాత చేరుకున్న అరుణ్ చూసి సంతోషంతో వెళ్లి

ఏరా మామ ఎంత కాలానికి అంటూ బుజం తడుతూ బయటికి నడిచాం.

అల నడుస్తూ బయటికొచ్చినా మేము ఎప్పుడు నడిచే ట్యాంక్ బండ్ వైపుకి వెళ్ళాం.

అంత బావుంది. కానీ వాడిలో మునిపటి చలాకి తనం కనపడలేదు.

మెల్లిగా నడుస్తున్నాం.

ఏమైంది రా అని అడిగాను.

ఒక బల్ల కుర్చీ పై కూర్చొని ఎదురుగా ఉన్న బుద్ధ విగ్రహాన్ని చూస్తూ.

చాల సేపటి మౌనం తర్వాత “మాకు ఎయిడ్స్ రా” అని పిడుగులాంటి వార్త చెప్పాడు.

ఒక్క క్షణం నాకు పిచ్చెక్కి పోయింది. కళ్ళముందు సుడులు తిరిగిన గతమంతా, ఆనందమంత ఎవరో లాక్కొని పోయి నల్లని చీకట్లు కమ్ముకున్నట్టుగ ఎదురుగా ఉన్న బుద్దుడీ లాగే మౌనమైంది నా మనసు.

ఈ విషయం శ్రావ్యకి తెలుసా అని అడిగాను. చెప్పాను అని బదులిచ్చాడు. లలిత దేవి గారికి తెలియదు తనని కలవడానికే వచ్చాను అని చెప్పాడు. ఏం జరిగిందో ఎలా జరిగిందో అని అర తీయడానికి అది సమయం కాదని తెలిసి ఏమి అడగలేదు. ఇద్దరం కలిసి లలిత దేవి గారింటికి వెళ్ళాం. విషయం చెప్పడం తో ఒక్కసారిగా దుఖం కట్టలుతేచ్చుకొని బోరున విలపంచిడం మొదలు పెట్టడంతో అరుణ్ కూడా ఆపుకోలేక పోయాడు.  ఎలా ఓదార్చాలో నాకు తెలియలేదు.

మరుసటి రోజు ప్రయాణమయ్యాడు. తనతో పాటే లలిత దేవి గారు కూడా.

లలిత దేవి గారు తిరిగొచ్చిన తర్వాత ఒకో రోజు వీలు చూసుకొని వెళ్ళాను. కళ్ళద్దాలు సరిచేసుకుంటూ కుర్చోమంటూ చైర్ చూపించింది.  ఏం జరిగిందండి అని అడిగాను.

తను బాధతో చెప్పడం మొదలు పెట్టింది.

వ్యబిచారాన్ని వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తున్న ఓ మహిళ కూతురే ఈ శ్రావ్య. తన తో పాటే వేశ్యా వృత్తి లో కొనగించెందుకు ప్రయత్నించింది. తనని ఒక చోటుకి పంపిస్తుండగా పోలీసు లు పట్టుకొని నా మిత్రురాలు నడిపిస్తున్న స్వచ్చంద అనాధ ఆశ్రమానికి తీసుకొచ్చారు. అక్కడి నుండి తనని నేను తీసుకొచ్చి నేనే పెంచుకుంటున్న.

అరుణ్ వచ్చి అడిగినప్పుడు ఇదంతా తనకి చెప్పాను. అన్ని తెలుసుకొని కూడా తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు.

నిజమే అన్ని తెలిసి కూడా పెళ్లి కి సిద్ధమైన మిత్రుడు నాకు మిత్రుడైనందుకు నాకు గర్వంగా ఉంది.

నాకు నోట మాట రాలేదు, అరుణ్ కి కాల్ చేశాను పుట్టబోయే పాపకి ఎలాంటి హాని జరక్కుండా చూసుకోమంటూ సలహా ఇచ్చాను.

డాక్టర్స్ మరియు కొంత మంది పెద్దవారు చెప్పిన సూచనలు పాటిస్తూ కొద్ది కొద్దిగా మానసికంగ బలాన్ని పుంజుకుంటున్న ఆ జంటను పది కాలాల పాటు చల్లగా చూడామణి భగవంతున్ని కోరుతున్నాను. ఎంత అవగాహనా సదస్సులు పెట్టి ఎయిడ్స్ పై అవగాహనా ఇచ్చిన వీరికే ఎయిడ్స్ ఉందన్న నిజం బాధ పెట్టకుంట ఉంటుందా..

నిజమే నా దోస్తు CM  కాలేదు కానీ నాకు మాత్రం అంత కన్నా ఎక్కువే.

ఏ కష్టం లేకుండా హాయిగా గడుపుతూ ఐదు నెల్ల క్రితం చక్కని చుక్క కి జన్మనిచ్చింది శ్రావ్య.. పాపా పేరు హారిక అని పెట్టుకున్నారు.

లలిత దేవి గారిని కలవడానికి ఆగష్టు లో వస్తున్నారని చెప్పారు.

ప్రపంచాన్ని మరిచి తాము నిర్మించుకున్న సౌధంలో అనుక్షణం ఆనందంగా గడుపుతూ అరుణ్ శ్రావ్య .

నా పెళ్లి కి రాలేక పోయిన ఈ సారి అందరం కలవబోతున్నాం అనే సంతోషం లో నేను..

పిల్లికి రాజబోగం

December 6, 2012 Leave a comment

ఫోటోషూట్  కోసం మిత్రుడు  ఒకరింటికి  తీసుకెళ్ళాడు.

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంది ఆ ఇల్లు నేను చూసిన సంపన్నుల్లో తను ఒకరు. కళా హృదయులు చెట్లు మొక్కలను అభిమానించే ప్రకృతి ప్రేమికుడు ఆ  ప్రేమ తోనే అనగా అదే తన వ్యాపారం వ్యాపకం అని తెలిసింది ప్రపంచం లో ఉన్న వింత వింత మొక్కలని వ్రుక్షలని పెంచి పోషించి వాటిని అమ్మడం. ఒక్కో మొక్క సుమారుగా పాతిక వేలనుండి రెండు లక్షల వరకు కరిదు. నమ్మలేక పోయిన అక్షరాల నిజం ఇలాంటి మొక్కలని పెంచి పోషించడానికి పనివాళ్ళతో సేల్స్ సిబ్బంది తో కూడిన ఒక పెద్ద ఫ్యాక్టరీ నే నడుపుతుండడం ఆశ్చర్యమేసింది.

నాలుగు పదులు దాటని ఆ వ్యక్తి తో ఎక్కువ సేపు మాట్లాడలేక పోయిన వారి ఇంటి ఆవరణలో ఉన్న రక రకాల మొక్కలని నా కెమెరా లో బంధించడం లో నిమగ్నమయ్య నాతో పాటు నా ఫ్రెండ్ మరియు పాతిక లోపు వయసు గల ఓ కేరళ అమ్మాయి ఆ  కంపెనీ మార్కెటింగ్ ad director ముగ్గురం కలసి వారి ఇంటి ఆవరణలో మరియు బాల్కనీ లో అందంగా పేర్చిన వింత వింత మొక్కలని కబుర్లు చెప్తూ తీసాను.

అదే ఇంట్లో ఓ పిల్లి ని చూసాను చూడడానికి అందంగా నిద్ర మబ్బు కళ్ళతో సుతి మెత్తని బూరు తో ముద్దుగ ఉంది. పక్కనే ఉన్న కేరళ అమ్మాయి ఇంగ్లాండ్ నుండి తెచ్చిన  ఆ  పిల్లి కరిదు చెప్పగానే ఒక్క సరిగా నా బుర్ర తిరిగిపోయింది అక్షరాల లక్ష రూపాయలు. ఇష్టం అనేది ఉండాలి కానీ మరి ఇంతలనా  అనుకున్న. దానికి సుతి మెత్తని పరుపు మెడికల్ చెకప్ తనని చూసుకోవడాని ఒక వ్యక్తి అబ్బో పెద్ద రాజ బోగమే అనుబవిస్తున్నది ఆ  పిల్లి.

అతి  మెత్తని  తన  పరుపు  చూడగానే   మతి  పోయింది.

నా చిన్నప్పుడు మా బాపు (నాన్న గారు) బియ్యం నిలువ చేసే కాలి గోనే సంచులని పట్టుకొచ్చేవాడు వాటిలో కొద్దిగా నున్నగా ఉన్న సంచిని నాకోసం అని  పక్కనపెట్టుకునే  వాడిని మా పెంకుటింట్లో రెండు గదులు ముందు గది లో బండలు నా  ఐదో  తరగతి లో వేసినట్టు గుర్తు రెండో గదిలో ఉన్న నేలని మాత్రం అమ్మ పేడ ఎర్రమన్ను తో కలిపి  అలుకు పెట్టి మూలల్లో (బోర్డర్) గోడ అంచులలో ముగ్గులు పెట్టి నున్నగా చేసి ఎప్పుడు శుబ్రంగా ఉంచేది. బయట కాలి ప్రదేశం ఉండేది చాల కలం వరకు నాతో పాటే పెరిగిన బావి పక్కన వేపచెట్టు దానిని అల్లుకున్న పెద్ద చిక్కుడు కాయ చెట్టు కింద ఆ గోనే సంచి ని నేలపై పరిచి నా పుస్తకాల సంచి బుక్స్ డ్రాయింగు తో గడిపేవాణ్ణి వర్షం వచినప్పుడు మాత్రం గోనే సంచిని రెండో గది లో పరుచుకొని పని కానిచ్చేవాడిని. ఒక రోజు ఏదో బ్యాంకు ఆఫీసు కాలి చేస్తున్నారట అందులో ఉన్న చిరిగినా గోధుమ రంగు పెద్ద కిటికీ కర్టేను ఒకటి బాపు తీసుకొచ్చాడు.  అది శుబ్రంగా పిండి చిరిగినా చోటున కుట్టింది  అమ్మ  ఆ కర్టేను చాల  మెత్తగా ఉండడం తో అమ్మ పడుకునే అప్పుడు పెద్ద నార చాపలు రెండు పక్కపక్కన వేసి బొంత చేద్దరు దానిపై ఈ మెత్తని కర్టేను తో మాకోసం పాన్పును సిద్ధం చేసిది అదే అతి గొప్ప పాన్పు నాకు.

ఇంట్లో కరెంటు లేదు రాత్రిపూట కిరోసిన్ దీపం వెలుగుతు ఉంటె దాన్ని చూస్తూ కాసేపు దీపం వెలుతురుని నోటితో ఊదుతూ వయ్యారంగా కదిలే ఆ చిన్ని దీపం మంటను  చూస్తూ నిధ్రపోయేవాన్ని. ఎండకాలమైతే అమ్మ పల్చని తన చీర కొంగుని మొహం పైన వేసి ఇంటివెనకాల గది బయటి తలుపు కొంచెం తెరిచి నా చాతి పై తన చేయి పెట్టి నెమ్మదిగ జో కొడుతూ నిధ్రపుచ్చేది ఎప్పుడో ఒకసారి వీచే గాలి కి మొహం పై ఉన్న అమ్మ కొంగు కదులుతూ చెక్కిలిగింతలు పెడుతుండేది ఎంతో ఆహ్లాదాన్ని మైకం కమ్ముతున్నట్టుగా తోచేది ఆ  హాయితో మెల్లిగా నిద్రలోకి జారుకునే వాణ్ణి.

మరి ఈ పిల్లికి సిద్ధం చేసిన పరుపుతో తెలిసిపోతుంది మనం ఎంత వెర్రిగా డబ్బు వృధా చేస్తున్నామో అని..

మొన్నీమధ్య  ఫేసు బుక్  మిత్రుడు నేను కలిసి వారి బాబు ని  స్కూల్ లో వదిలి కార్ లో తీరిగోస్తున్నప్పుడు స్కూల్ admission, bus fare  ఇతరత్రా లెక్కలు చెప్తూ ఎనబై వేలు కర్చైందని.  నవ్వొస్తుంది  ఇంత ఇంత డబ్బులు గుంజుతున్న కార్పోరేట్ స్కూల్స్ ని  చూసి.

ఎందుకంత అని అడుగితే తప్పదు మరి అందరితో పాటే మనం అని. నిజమే  ఓ మిత్రురాలు (ప్రవీణ గారు) చెప్పినట్టు.

ప్రవాహానికి ఎదురీద లేక,

ఎదురీత తెలిసినా,

ఎదురీదే సాహసం లేక,

ఎదురీదితే వెనుక పడిపోతామేమోనన్న భయంతో,

ప్రవాహంలో కొట్టుకుపోవడానికి పరుగులు..

నా విషయానికొస్తే  1989 లో స్కూల్ లో జాయిన్ చేసారు అంతకు ముందే మా అన్నయ అక్కయ కూడా అదే స్కూల్ కి వెళ్తున్నారు వారితో పాటే పంపించారు. అప్పుడు స్కూల్ ఫీజు 25 రూపాయలు నెలకి ఆ తర్వాత కాలాల్లో 25 కాస్త  50, 75 నా పదో తరగతి పుర్తేయ్యే అంటే 2000 ల సంవత్సరానికి నా school ఫీజు 150 రూపాయలు ఎన్ని  కర్చులు లెక్క కట్టిన స్కూల్ ఫీజు, బట్టలు బుక్స్ అన్ని కలిపి పదేండ్లల్లో16 నుండి 18 వేల తో గడిచిపోయింది నా స్కూల్ విద్య.

కానీ ఆ టైం లో స్కూల్ ఫీసులు కట్టాలంటే చాల కష్టాలు పడేది మా అమ్మ ఎందుకంటే మా బాపు కి మా కన్నా ఎక్కువ మద్యం బాటిల్ పై ప్రేమ ఎక్కువ పొద్దున తొమ్మిది గంటలకి వెళ్లి ఎప్పుడో రాత్రి పన్నెండు గంటలకి వచ్చేవాడు.  అప్పుడు మొదలై  ఏ ఒంటి రెండు గంటలకు పుర్తయేది తను గొడవ పెట్టుకోవడం. చాల రాత్రులు నా జీవితంలో రాత్రి అనేది ఎందుకోస్తుందా, ఎందుకు ఉందో అని భయపడేవాన్ని అల అని నన్ను ఏమైనా అంటాడ అని కాదు తను తన జీవితాన్ని చాల చక్కగా తీర్చిదిదుకున్నాడు బీదరికం అనే పేరుతో.  తను నిర్మించుకున్న బీదరికం వలలో అమ్మ అన్నయ అక్కయ నేను.  ఒక్కో సరైతే ఇంట్లో ఉన్న వస్తువులనుండి ఇంటి మీదున్న పెంకుల వరకు అన్ని పగల గొట్టే వాడు ఇంటి తలపులని బావిలోకి విసిరి పడేసేవాడు మా బాపమ్మ (నాయనమ్మ) తను మాత్రం ఏం చేయగలుగుతుంది కండ్ల ముందే కొడుకు ఎలా పతనమవుతున్నడో చూస్తూ బాధపడడం తప్ప. బహుశ  మా నన్నే నాకు ఆదర్శం కావచ్చు అందుకే తనకు విరుద్ధంగా జీవితంలో సిగరెట్టూ మద్యం నా దరికి చేరనివ్వకుడధానుకున్న. చేసే లేబర్ పనికి వచ్చిన కొద్ది మొత్తం డబ్బులో తాగుడు కు పోను మిగిలిన డబ్బుతో ఎవరిపై ఆధారపడకుండా గుట్టుగా ఇల్లును గడుపుతూ వచెది మా అమ్మ.

ఆ టైం లో స్కూల్  లో  అందరి చేతుల్లో 50 పైసల నుండి మొదలు 2 రూపాయలు 5 రూపాయల వరకు రోజు కనిపించేవి దాన్నే పాకెట్ మనీ అంటారని తర్వాత తెలిసింది.  నా దగ్గర మాత్రం పదో తరగతి వరకు కూడా డబ్బు అనే అవసరం సొంత కర్చులు అనేవి తెలీనే తెలియవు. మా ఇంటివేనకల ఉండే రాజమౌళి  మామయ్య ఇచ్చే పోస్ట్ కార్డులతో, రంగు రంగుల స్కెచ్ పెన్నులు మిగిలిన పేపర్లతో బైండింగు చేసిన తెల్ల కాగితాల నోటుబూక్ లో బొమ్మలు గీయడం, లైబ్రరీ నుండి వారం వారం తీసుకొచ్చే పుస్తకాలతో గడిచిపోయిన కాలం లో పాకెట్ లో ఏ రోజు డబ్బు కోసం చేయి పెట్టింది లేదు. నిజమే ఇప్పుడు ఆలోచిస్తుంటే 20 వేలు పెద్ద కష్టం కాదు అని అనిపించొచ్చు అల అని  ఇప్పుడు ఉన్నత స్థితులో ఉన్నామని కాదు పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. కానీ వాడ వాడ మొత్తం వినిపించేలా లొల్లి పెట్టె తన గొంతుకు తనే కళ్ళెం వేసుకున్నాడు. తన తాగుడు తో గొంతు కాన్సెర్ తెచ్చుకున్నాడు. అప్పుడు తన ఆపరేషన్ కి నేను అన్నయ కలిపి 50 వేలు ఖర్చు పెట్టాము ఎంత తాగుబోతైన కన్నా తండ్రి కదా.

కనీసం తనను చూసైన తనల తయరవకుడదని అమ్మ ఎప్పుడు చెప్తుండేది. ఇప్పటికి తన వ్యవహారం లో మార్పు లేక పోయిన మా ఎదుగుదలను చూస్తూ గర్వపడుతూ తన పని తాను చేసుకుంటున్నాడు.

అన్నయకు  అక్కయకు  నాకు అందరికి పెళ్లిల్లు అయిపోయాయి. పండగలకి అందరం కలుసుకోవడాలు. ఇప్పుడు బాపు కి మా అన్నయ కొడుకు హేమంత్ తో ఆడుకోవడం అమ్మ నెలలు నిండుతున్న అక్కయను చూసుకోవడం తో చాల బిజీ అయిపోయారు.

ఇప్పటికి తన లేబర్ పనిని మానుకోలేదు బాపు, మా సంతోషాన్ని కోరుతూ కనిపించని భగవంతుడికి వేల వేల దండాలు పెడుతూ అమ్మ.  మొన్న ఈ మధ్య కట్టించిన రేకుల ఇంట్లో కాలం గడుపుతున్నారు. వారికీ ఈ హైదరాబాద్ వాతావరణం పడదు. ఎందుకో మా నాన్న తను పుట్టి పెరిగిన ఊరిని వ్యక్తుల్ని వదిలి రాలేనంటాడు తనతో పాటే అమ్మ నిజంగా వారె అన్యోన్న దంపతులు అని నాకనిపిస్తుంటుంది. మా బాపు చేసిన రాక్షసత్వాన్ని ఎవరు భరించలేరేమో అందుకే కాబోలు ఆడవారికి సహనం ఓర్పు ఎక్కువని అది మా అమ్మను చూసినపుడు మరి అనిపిస్తుంటుంది. వెళ్తే ఇక నేను కూడా తిరిగి హనంకొండ కే వెళ్తాను కావచ్చు. నా అనుకునే వారందరు కూడా కోరేది ఇదే నేనుంటే మా ఇంట్లో ఆ సందడే వేరు.

ఆత్మీయ  అనురాగాలు ఆప్యాయతలను మరిచి ఏదో చేసెయ్యాలి అని అందరికి దూరంగా గడిపే నా లాంటి మిత్రులందరికీ తెలుసు వాటి అర్ధం ఏంటో..

ఎంత బిధరకాన్ని అనుబవించిన కాలంతో పాటు జీవన పరిస్థితులు మారుతాయి. మన సమాజం లో డబ్బు అనేది సమస్య కాదు నేను చుసినటువంటి సంపన్నులు మన హైదరాబాద్ లో కోకొల్లలు. ఆలోచిస్తే ఎవరికీ ఏ లోటు లేదు లోటు కేవలం మన మనస్సులో ఆలోచన విధానం లో ఉంది.

నేను మారితే అన్ని మారినట్టే..

లక్షలు పోసి పెంచుకుంటున్న పిల్లి కున్న సుఖం అనాధ ఆశ్రమం లో గడుపుతున్న ఓ అనాధ చెల్లి కి లేకుండా పోయింది అని బాధ పడడం తప్ప చేసేది  ఏమి లేదనుకుంటూ దాని తలపై నిమిరి దాన్ని నా కెమరా లో బంధించి వెనుదిరిగాను.

నా పేరు నయీం…. (చిన్న కథ)

December 6, 2012 Leave a comment

ఉదయం 5.00 గ..

దూరాన మసీదు మైకు గొట్టం నుండి నమాజు తో తెలవారింది.

వస్తున్న నమాజు శబ్దానికి మెలకువ వచ్చింది.   

దుప్పటి తెరుచుకొని ఒళ్ళు విరుచుకుంటూ ఒక చేత్తో కళ్ళజోడు కోసం వెతుకుతూ, నెమ్మదిగా లేచాడు.

 

ఆదొక రేకుల గది,

సాధారణంగా ఆ గది లో అతను తప్ప ఎవరు లేరు ఇంకా పెళ్లి కాలేదు. 

సాదా సీదాగ కనిపించే తనకి ఓ పాతికేల్లుంటాయి.

మనిషి చూడడానికి కాస్త నేమ్మధస్తుడిగా, అమాయకత్వంతో, ఎప్పుడు ఆలోచనతో గడిపే రకం.

 

దొరికిన కల్లజోడుని టేబుల్ పై పెట్టి. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి, నిద్ర మబ్బు పోవడానికి వాష్ బేసిన్ కులాయి విప్పి దోసిలితో నీళ్లు ముఖాన జల్లుకొని రెండు చేతులతో ముఖాన్ని నుదురు దాటిస్తూ కళ్ళు తెరుచుకుంటూ అద్దంలో కనిపిస్తున్న తన కళ్ళని సూటిగా చూస్తుండగా..

 

నెమ్మదిగా తన మనసు మాట్లాడడం మొదలు పెట్టింది. 

“నా పేరు నయీం….”

 

కాళ్ళు చేతులు కూడా శుబ్రం చేసుకొని కింద పొడిగుడ్డను పరిచి తలకు టోపీ పెట్టుకొని నమాజుకు సిద్దం అవుతాడు. నమాజు పూర్తిచేసి, 

 

“మా అమ్మి పేరు జుబేద బేగం 

 మా అబ్బ సుల్తాన్ పాషా 

 నాకో చెల్లి నస్రీన్ ఫాతిమా 

 తమ్ముడు ఇక్బాల్” 

 

చొక్కా పాయింటు వేసుకొని కళ్ళజోడు తొడుక్కొని రేకుల గదికి తాళం బిగించి మెట్లు దిగి, రోడ్ మీద బస్ కోసం వేచి చూస్తుండగా బస్ వచ్చింది. 

పరుగులాంటి నడకతో బస్ ఎక్కాడు. కాళీగా ఉన్న సీటులో కూర్చొని నెమ్మదిగా కిటికీ నుండి వెనక్కి దూసుకెళ్తున్న ప్రపంచాన్ని చూస్తూ ముందుకు సాగుతున్న బస్ లో సాటి జనాల్లో ప్రయానికుడిగా ఉన్న ఓ ఒంటరి వ్యక్తి.

 

ఆలోచనలన్నీ వెంట వెంట దూసుకొస్తున్న. చూపులు మాత్రం కిటికీ పక్కన వెనక్కి సాగిపోతున్న బ్రతుకు చిత్రాలను ఆకాశ హర్మలను చూస్తూ…

 

మా అబ్బ… ఇంటింట ప్లాస్టీకు సామానును తోపుడు బండి మీద కొనుక్కొని, పెద్ద గరాజుకెల్లి అమ్మేస్తుంటాడు.

మా అమ్మి… మూరెడుకు భారాన చొప్పున పూలు రోజంతా అల్లుతునే ఉంటది. 

నా చెల్లికి పెల్లిచేసినం మా భావ కోటి చౌరస్తాల చెరుకురసం పిండుతనే ఉంటడు. మిగిలిన కట్నం డబ్బులు తేలేదని చెల్లిని రోజు ఉతికి ఆరేస్తునే ఉంటాడు.  

నా  తమ్ముడు మస్తు సధువులు సదవాలి అని తెగ సదువుతుంటాడు. ఆడికి సదువుమీదున్నంత ఇష్టం నాకు లేదు. ఆడ్నైన సదివిద్ధామంటే పైసల్లేవు.

 

పైసలు.. ఇవి లేకే.. మా ఇంట్లోల్ల తిప్పలన్ని.

మా అబ్బ సేప్ప్తుంటోడూ అరేయ్ నీకు ఏ ఒక్క పనికూడా చాతగాదు. ఎందుకు పనికిరాని అసమర్దుడివి.

 

నిజమే నేను ఎందుకు పనికి రాని అసమర్దున్నే… నేను సమర్దున్నే అయితే ఇంకా నా వాళ్ళు ఇలా ఎందుకుంటారు.

నేనే సమర్దున్నైతే మా ఇల్లు ఇరుకుగల్లిల ఎందుకుంటది? 

కట్నం డబ్బుల కోసం చెల్లి పడుతున్న తిప్పలు తీరేవి. 

 

బహుశ మా అబ్బ ఎప్పుడు నన్ను సమర్ధుడిగా చూడ లేక పోవడమే నేనిలా ఉండడానికి కారణం.

ఎలాంటి బావోద్వేగాలు అంటకుండా, ప్రపంచం లోనే ఉంటూ ప్రపంచం తో పనిలేనట్టుగా మిగిలిపోయా, నా అసమర్ధతకి చిహ్నంగా ఓ ఒంటరి వాడిగా మిగిలిపోయా..

నన్ను నేను నిరుపించుకోవాలనుకుంటే కావాల్సింది డబ్బు.

డబ్బు కేవలం డబ్బు ఆ డబ్బే మా ఇంట్లో వాళ్ళ దాహం తీరుస్తుంది. నన్ను సమర్దున్ని చేస్తుంది. 

ఎలాగైనా చేసి డబ్బు సంపాదించాలి.ఏంటో ఈ డబ్బు..

 

నేనెవరో తెలియనంత వరకు ప్రపంచానికి నేనొక అజ్ఞాతాన్ని, నేనేంటో తెలిసిన నాడు ప్రపంచం చూపంత నా వైపే.

 

కసయోడికి తన కుటుంబం మీద ప్రేమ ఎక్కువ.

అయిన వాడి చేతిలోని కత్తికి పదునెక్కువ.

గొర్రె పోతు మెడకి నునుపెక్కువ

దానికి తనకన్నా కసయోడిమీదే నమ్మకం ఎక్కువ

ఇక ధర్మ సందేహంలో పాపా పుణ్యాల తావెక్కడ…!

బ్లేడి లైఫ్ 

 

ఏది ధర్మమో ఏది న్యాయమో ఎప్పుటికి నాకు అంతుపట్టని చిక్కు ప్రశ్న. ఒకడి మంచి మరొకడికి చెడు. అదే ధర్మం అని సమర్ధింకోవడమే జీవితమా? ఏంటో.. మనకు తెలిసిందే న్యాయం అనే ముసుగు తొడిగి మనసు మనల్ని ఊపిరాడనివ్వదు. 

 

ఆలోచనలు తెంపుతూ వాస్తవంలోకి వచ్చి చూడగా బస్సు అఫ్జల్ గంజ్ చేరుకుందని తెలుస్తుంది.

 

ఓ నేను పుట్టి పెరిగిన నా ఆనవాలు నా కోసం ఎదురోస్తున్నాయి.

 

కలీల్ గాడు ఈ గల్లిలల్లనే పరిచయం అయ్యాడు. నా ఒంటరి ప్రపంచాన్ని అర్ధం చేసుకున్నది వాడొక్కడే. వాడే గనక లేక పోతే ఇపుడు నేనిలా మిగలకపోయేవాన్ని.. వాడి పరిచయం తరువాత వాడిని నమ్మడం మొదలు పెట్టడంతో వాడు నన్ను పనిలో పెట్టాడు. ఆరేడు నెలలనుండి దాదాపు మా కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తీరుతున్నాయి. ఇక వాడి పుణ్యమా అని మరో కొద్ది గంటల్లో నేను దుబాయ్ కెల్లబోతున్న.. ..

 

ఆలోచనను హత మార్చుతూ చార్మినార్ స్టాప్ లో బస్సు ఆగింది.

అందరితో పాటు దిగి బస్ స్టాప్ నుండి బయటికి రాగానే. తచ్చాడిన ఆ చిన్న నాటి వాసనలు ఒక్కసారిగా వెంట పడ్డాయి.

 

మరో కొద్దిగంటల్లో నేను తెగ తిరిగిన ఈ చోటుకి దురం కాబోతున్న. ఉన్న ఈ కొన్ని గంటలు నేను పుట్టి పెరిగి తిరిగిన ఈ గల్లిలని హత్తుకోవాలని ఇక్కడికొచ్చ.

 

నోరు మేధపకున్న నా బ్రతుకికి నిలువెత్తు సాక్ష్యం ఈ చార్మినార్. నా చిన్ననాటి రోజులన్నీ ఈ రద్ది మనుషులమధ్యే గడిచింది. బ్రతుకు చిత్రాల నడుమ చిత్రంగా సాగేది కర్రతో నెట్టుకుంటూ పోయే నా టయీర్ ఆట.

 

ఏ మార్పు లేదు.. చార్మినార్ కి, దాని వాకిలి నిండా పరుచుకున్న జీవితాలకి. 

 

ఏంటో ఈ జీవితం చూస్తుండాగానే కాలం అల పరుగులుతీస్తునే ఉంటుంది మన ప్రమేయం లేకుండా. 

ఇప్పుడంత రద్దీ లేదు గాని పండగ దినాల్లో ఆ సందడే వేరు. 

 

నేను నా ఇంట్లో వాళ్ళతో తప్ప ఎవరితో మాట్లాడింది లేదు. 

అయిన అందరు నాకు పరిచయమే నేనే వారికి తెలియదు. 

చెప్పానుగా ప్రపంచంతో పని లేనట్టు ఓ ఒంటరి పిచ్చివాడిగా గడిచింది చిన్నప్పటినుండి ఇప్పటి వరకు.

అయిన ఈ వీదులే నా నేస్తాలు, ఆ మక్కా మస్జిదె నా చోటు, 

ఆ చార్మినార్ ఆలింగనంలో ప్రశాంతంగా సేద తీరేవాన్ని.

 

నెమ్మదిగా నడుస్తూ చుట్టూ చూస్తూ ఆలోచిస్తూ మక్కా మస్జిదు ఎదురుగా రోడ్డు మీద తోపుడు బండి మీద పొయ్యి పెట్టి దోసలు వేస్తున్న చోట ఆగి, 

ఎక్ బట్టర్ దోస.. ఆర్డర్ ఇచ్చి తాయారు చేస్తున్న దోసలను చూస్తూ నెమ్మదిగా ఆలోచనలోకి…

 

మా అమ్మ తర్వాత నాకు తిండి పెట్టేది ఈడే నాకు ఊహ తెలిసినప్పటి నుండి రోజు పొద్దున్న వీడి దగ్గర టిఫిన్ చెయ్యందే రోజు గడవదు, దునియా తెలవదు. 

 

ప్రతి రోజు చూసేవాన్ని ఏ రోజు ఎక్ దోస అనే పదం తప్ప ఇంకో మాట వాడితో పలికింది లేదు. ఏంటో చిత్రంగా ఈ రోజు కూడా ఏమి మాట్లాడలేక పోయా..

 

చేతికిస్తున్న దోసాని తీసుకొని నెమ్మదిగా తినడం పూర్తయ్యింది. మక్కా మస్జిదు లోకి వెళ్లి ఎగురుతున్న కపోతాలు, వాటికి దాన వేస్తూ పిల్లలని చూస్తూ.

 

ఈ మక్కలోనే ఎన్నో దువాలు చేస్తే అల్లా దయ వళ్ళ నేను పుట్టానట.

అందుకే అమ్మికి, అబ్బ జాన్ కి ఈ మసీదంటే ప్రాణం.

 

అల్లః యాడుంటాడో తెలియక పోయిన నీతోడు ఉంటాడ్రా… అని అమ్మ చెబితేనే నమాజు చేస్తున్నా…

నాకు తను ఉన్నాడన్న నమ్మకం ఇప్పటికి కలగ లేదు. 

అమ్మ చెప్పింది కాబట్టి దేవుడున్నాడని నేను నమ్ముతున్న…

 

ఈ మెట్ల మీదే కూర్చొని పాపం పుణ్యం, ధర్మం న్యాయం, నరకం స్వర్గం, అని ఏమేమో చెప్పే టోడూ మా అబ్బ జాన్.. ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు.

నాకు అర్ధమైంది ఒకటే నను కన్నది నా తలిదండ్రులు వారే నా దేవుళ్ళు బస్.. 

అంతకు మించి ఎం చెప్పిన ఎం జరిగిన అంత పిచ్చిగా ఉంటుంది. అందుకే ఈ విషయాలకి నేను దూరం.

 

అమ్మ తరువాత నను అమ్మలా సేద తీర్చేది ఈ మసిదే అందుకే నాకు ఈ మసీదన్న కనిపించని దేవుడన్న ఇష్టమే..

 

నేను ఈ దేహాన్ని కాదంట… ఆత్మనంట… ఆత్మని కప్పుకున్న తొడుగు ఈ దేహమంటా కావచ్చు. నేను కాదనను.

చివరికి నేను అత్మనని నా మెదడు కూడా నమ్మింది కాని ఎం లాభం నాకు నాకు చెప్పినోడికి ఇద్దరికి ఇంకా అనుభవంలోకి రాలేదు.

 

నెమ్మదిగా బయటికొచ్చి చార్మినార్ వైపుకు అడుగులు. పొద్దున్న లేవడమే ఆలస్యం టయిరు పట్టుకొని దిని చుట్టూ తిరుగుతూ ఆడుకోవడం. 

అబ్బాజాన్  చెంప పగలగొట్టినపుడు ఏడుస్తూ వచ్చి ఇక్కడే కూచునే వాణ్ని. 

నేను ఇక్కడే కుర్చుంటానని మా అమ్మకి తెలుసు అందుకే మా అమ్మ భోజనం టైం కి వచ్చి నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళేది. 

 

ఈ చరిమినార్ చుట్టూ వీధులన్నీ ఎప్పుడు నన్ను హత్తుకుందామ అని చూస్తున్నాయి. ఈ వీదులకి ఈ చార్మినార్ కి మరి కొద్ది గంటల్లో నేను దూరం. కాదు కాదు నా మనసుకే నేను దూరం కాబోతున్న.

 

కిందికి దిగి చార్మినార్ మూల దుర్గ పూజని చూస్తూ.. 

 

ఎవరి నమ్మకాల్లో వారు ఉండడమే మంచిది. కనీసం ఆ నమ్మకల్లోనైన ఆనందంగా బ్రతుకుతారు. ఏంటో అప్పుడప్పుడు దేవుడున్నాడనే బ్రమ నిజమనిపిస్తుంది. కొందరి నమ్మకాలని చూస్తుంటే. ఉన్నాడేమో నిజంగానే రక్షిస్తున్నడెమో ఏమో.. ఎవరికి తెలుసు… 

 

మెల్లిగా అడుగులు చార్మినార్ వొదిలి వీధిలోకి నడుస్తూ ….

 

కనపడే ఆ ఇరుకు గల్లిలోనే మా ఇల్లుండేది. కోల్ల లొల్లితోనే రోజంతా గడిచేది నాకు.

 

అన్ని తప్పని తెలిసిన తప్పు చేస్తూనే ఉంటాం. ఒకడు ఇంకొకడి మంచిని కోరేవాడైతే  ఈ లోకమంతా ప్రవక్తలే, ప్రపంచం అంత సాదువులే. ఇది ఎప్పటికి జరగని తీరని ఓ అందమైన కల.

 

ఆలోచనలు ఇరానీ కేఫ్ దగ్గర ఆగిపోవడంతో లోపలికెళ్ళి కూర్చున్నాడు. ఒక చాయ్ ఆర్డర్ ఇచ్చాడు. ఇచ్చిన కాసేపటికి తెచ్చిన చాయ్ ని తాగుతూ.  

 

నేను జ్ఞానినో అజ్ఞానినో తెలుసుకోవాలన్న తాపత్రయం లేదు. 

అన్ని తెలుసనుకునే ముర్కున్ని, ఏమి తెలియదని సమర్ధించుకునే అమాయకుణ్ణి.

 

బయటికొచ్చిన కాసేపటికి కాస్తున్న ఎండలో మండుతున్న కడుపుని పట్టుకొని 

కనిపించిన మదిన హోటల్ లోకి దూరి బిర్యాని ఆర్డర్ ఇస్తూ కూర్చున్నాడు.  

 

బ్రతుకు పోరాటంతో పోలిస్తే, ప్రతి నినాదం, ధర్నాలు, జులుసులు, శాంతి పోరాటాలు, వర్గ పోరాటాలు, మత కలహాలు, అన్ని పనికిమాలినవే.

ఆకలేస్తే కడుపు మాడక మానదు. తెల్లారితే ఏదో ఒక పనిచేసుకొని బ్రతకక తప్పదు.

 

వచ్చిన బిర్యనిని తిని నెమ్మదిగా బయటికొచ్చి, కిల్లి వేసుకొని..

బస్సు స్టాపులో బస్ కోసం ఎదురుచూస్తూ, వచ్చే పోయే వాహనాలను చూస్తూ…

 

ఉన్న జీవితం లోనే అధ్బుతల్లేవు ఇక కళ్ళు మూసుకుంటే లేని లోకాల బ్రమలో ఏమస్తుందో.

 

సమాజం ఎప్పుడు మన ఆలోచనలకి వెనకబడి ఉంటుంది. ఆ ఆలోచనలని అందుకోడానికే ఈ ఉరుకులు పరుగులు. 

 

బస్సు ఎక్కి కిటికీ వైపు కూర్చొని కొద్ది దూరం తర్వత కిటికిలోంచి కనపడిన చర్చి ని చూసి 

 

నా చిన్నపుడు మా అబ్బ జాన్ ని అడిగా అందులో ఏముంటుంది అబ్బా అని.

మా అబ్బ చెప్తుండే మంచి అని చెప్పిన మంచి మనిషిని మోలలతో కొట్టి శిలువేసారు. ఏంటో ఈ లోకం ఎంత చెడు చేసిన పట్టించుకోదు. మంచి చేద్ధామనుకున్నోని ఒర్వదు.

అందుకేనేమో ఎలాంటి ఎమోషన్స్ లేని నాలాంటి బండ రాయి కసాయి లే ఈ లోకమంతా.

 

బస్ దిగి హుస్సేన్ సాగర్ ఆ మూలనుండి నడుస్తూ.. బుద్దిడికి చేరువయ్యాడు. సాగరాన్ని, ఆకాశాన్ని, పక్షుల్ని సూర్య అస్తమయాన్ని మౌనంగా నిలుచున్నా బుద్దుడిని చూస్తూ…

 

చిన్నప్పటి నుండి చూస్తున్న… ఎండకి వానకి తడుస్తూ, వీచే పెనుగాలులని, మురికి కంపుని, రణ గోన ధ్వనుల్ని భరిస్తూ, ప్రశాంత వదనంతో ఆశీర్వదిస్తూ.

ఏంటో ఇప్పటి వరకు తను నాకు చెప్పింది ఏమి లేదు. నేను కూడా తనకి చెప్పింది ఏమి లేదు. ఇద్దరం ఓ శిలువల నిల్చోని ఉన్నాం కొన్ని యేండ్ల నుండి.

 

అక్కడినుండి నెమ్మదిగా గోరీలున్న చోటు దగ్గర కూర్చొని

 

ఎన్ని నమాజులు చేసిన ఎన్ని బజనాలు చేసిన చివరికిలా వెల్లికలా పడుకోవల్సిందే.

ఇక పాపం పుణ్యం అంత ఓ ట్రాష్… తనకు తానో లేక ఇంకొకరినో త్రుప్తి పరిచే వింత ఆరాటమే లైఫ్ బ్లేడి లైఫ్.

రేపెప్పుడో నేను కూడా చివరికి ఇక్కడే ఎక్కడో వెల్లికల పడుకోవల్సిందే… అయిన ఏంటో నా ఈ వింత ఆరాటం.

నా ఆరాటానికి ఓ అర్ధం ఉంది నా దైవాలైన అమ్మ అబ్బని  సంతోషపెట్టాలని. వారు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు ఎవరితో పని లేదు. 

నా మాటలు వింటే నాకు స్వార్ధం ఎక్కువ అనుకోవచ్చు. నిజమే నాది స్వార్ధమే. నా స్వార్ధం కోసమే ఏ పని చేసిన, నేనే కాదు అందరు అంతే..

నాలంటోల్లె ఈ ప్రపంచమంతా కూడా.

 

ప్రపంచంతో సంబంధం లేకుండా నేనుంటే నాతో సంబంధం లేకుండా ఈ ప్రపంచం.

కొన్ని వేల ఎకాకుల్లో నేనో ఏకాకిని.

 

అక్కడి  నుండి అన్ని చూస్తూ తిరుగు ప్రయాణం. రేకుల గది తలుపులు తెరిచి లోపలికెళ్ళి తలుపులేసుకున్నాడు. అంత చీకటి. చీకటి కమ్మిన ఆ గదిలో టేబుల్ లాంప్ స్విచ్ ఆన్ చేసి కళ్ళ జోడు పక్కన పెట్టి..

టేబుల్ కి ఆనుకొని ఉన్న కుర్చీని లాగి నెమ్మదిగా కూర్చొని మొబైల్ దగ్గరకి తీసుకొని చూస్తే నో మిస్డ్ కాల్స్, ఏంటి ఇంకా కలీల్ ఫోన్ చేయలేదు. పని పూర్తయ్యాక చేస్తా అన్నాడు.

 

ఏంటో ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి మా అమ్మకి నేనంటే పిచ్చి, మా అబ్బకు నన్ను తిట్టడం అంటే పిచ్చి, నాకు నా కుటుంబం అంటే పిచ్చి, ఆ కుటుంబానికి డబ్బంటే పిచ్చి,

ఏంటో ఈ పిచ్చి గోలా.

 

నాకు లాగే కలీల్ గానికి ఇంకో పిచ్చి ఎప్పుడు ఎదోదేదో వాగుతాడు ఎక్కడెక్కడికో తీసుకెళ్తాడు, ఎవరెవరికో పరిచయం చేస్తాడు, నేను అల్లా కోసం ప్రాణలిస్తా అని ఆవేశంతో ఊగిపోతాడు. వాడి పనులన్నీ నేను చేసిపెడతాను కాని నేనెప్పుడు వాడిని సమర్ధించలేను, అలా అని విమర్శించలేను, వాడు చేసే పనుల్లో నా ప్రమేయం ఉన్న నాకెందుకో వాడి కున్న కసి నాకు లేదు. 

దేవుడంటేనే నాకు సరిగా తెలియదు. దేవుడి కోసం చేసే ధర్మ యుద్ధం గురించి ఎం పట్టించుకోవాలి.

 

ప్రపంచంలో శాంతి తీసుకు రావాలంటే ఒకరిని చంపడం అధర్మమేమి కాదని వాడి వాదన. ఏంటో ఈ యుద్ధం ధర్మనికో అధర్మాని ఏ రకంగ చంపినా పోయేది ప్రాణమే అనేది నా భావన. అయిన నాకేందుకోచ్చిన గొడవ నాకు నా కుటుంబం సంతోషం కోసం డబ్బు కావలి. డబ్బు వీడుస్తున్నాడు నేను పనిచేస్తున్నాను. ఇక పాపం పుణ్యం తో నాకు  సంబంధం లేదు.

 

ఇక  నా తల రాత రాసింది దేవుడే అయితే తనకు తెలుసుగా నేను చేస్తున్నది తప్పని, తప్పని తెలిసిన నా నుండి తప్పు జరిగితే దేవుడు లేనట్టే…

నిజంగా దేవుడుంటే ఈ యుద్ధాలను చూస్తూ ఎందుకూరుకుంటాడు. ఈ అసమర్ధుని చేతిలో తప్పు ఎందుకు జరగనిస్తాడు.

 

ఏంటి ఎన్నడు లేనంతగా వింత వింత ఆలోచనలు నను చుట్టూ ముడుతున్నాయి. నేను చేసిన పనికి భయపడుతున్నాన ఏమో చూస్తుంటే అలానే అనిపిస్తుంది. 

నేను దొరికే ఛాన్స్ లేదు. కాని దొరికిపోతే………..

 

నిశ్శబ్దం ఆవహించిన ఆ గదిలో గడియారపు ముళ్ళు శబ్దం అతి బయంకరంగా ఉంది. టేబుల్ లాంప్ వెలుతుర్లో  బయం తాలుకు వణుకు కళ్ళల్లో చేతుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. నుదురు చిట్లిస్తూ భారంతో నిండిన తల నెప్పిని భరించలేక కను బొమ్మలను ముని వేళ్ళతో ఒత్తుకుంటున్నాడు. తల పట్టుకొని మళ్లీ ఆలోచనలు.

 

నేను దొరకను ఒక వేల దొరికితే.. ఆత్మని కప్పుకున్న ఈ దేహానికి ప్రపంచం ఓ వింత పేరు తగిలిస్తుంది అదే తీవ్రవాది. నేనెవరిని చంపలేదు కాని….. కాని కొన్ని వేల చావులకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను కారకున్నే. ఏంటో పూర్తిగా ఈ ఊబిలోకి చిక్కుకున్న. 

 

ఒక వేల ముందే చెప్తే ఏమని చెప్పను నేను తీవ్రవదినన. అదే చెప్తే సంతోషంగా భోగ బాగ్యలతో సుఖంగా ఉన్న కుటుంబం మళ్లీ మురికివాడలోనో మరెక్కడో బ్రతుకు లీడుస్తారు. లోకం నిజం చెప్తే ఎన్నడు నమ్మిందని. నన్ను ఓ తివ్రవాధిగా గుర్తించి అనుక్షణం నరకం అనే బిరుధిని ఇస్తారు జైల్లో..

 

ఇదంతా చూసి మా అమ్మి బతికుంటుందా. ఎవరికి తల వంచక తలెత్తుకొని తన పనిలో తాను గర్వంగా బ్రతికిన అబ్బ జాన్ తల నా మూలాన దించుకోవడం ఎంత వరకు న్యాయం.

 

ఎన్నడు లేంది ఏంటి నా గుండెలో ఈ భయం. నేను స్వర్ధపరున్నే కాని ఎదుటి మనిషి చావాలని కోరుకునే కసాయిని కాను. కాని నేను చేసిన పని నను కసాయిగా ముద్ర వేస్తుంది తప్పదు.

 

నా ఒక్క కుటుంబం కోసం కొన్ని వందల కుటుంబాలు బలి కాబోతున్నాయ????

 

ఆ చీకటి గది లో క్షణనికోసారి వాచీ చూస్తూ ఈ గోరం ఎక్కడ జరగబోతుందో తెలియదు, ఎలా ఆపాలో తెలియదు.

హా  దేవుడున్నాడని నమ్మే మా అమ్మి దువ సత్యమైతే ఆ దేవున్నే కోరుతున్న నా నుండి ఏ తప్పు జరగకుండా చూడు. ఏ గోరం జరగకుండా చూడు.

 

పొడి గుడ్డని నేలపై పరిచి నమాజు చేస్తూ…

 

దేవుడా  రక్షించు  నిను వేడుకునే అభాగ్యులని రక్షించు.. నీవున్నవో లేవో నాకు తెలియదు. అయినా వేడుకుంటున్న..

 

ఏంటో తను ఉన్నాడో లేడో.. కాని నేను తప్పు మానవత్వం కోణం నుండి చూస్తే నేను తప్పు చేశాను. ఆ తప్పుకు శిక్ష లోకనికన్న ముందే నేను వేసుకుంటున్న.

నా స్వార్ధం పూర్తయ్యింది. నా తల్లి దండ్రులని సంతోష పెట్టాను వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ సమ కూర్చాను 

తివ్రవాధిగా నన్ను చూస్తూ వేదనకు గురి చేయడం కన్నా నేను లేకున్నా నా జ్ఞాపకాలతో వారు సంతోషంగా ఉండగలరు నాకా నమ్మకం ఉంది.

 

నిజం… ఏది నిజం.. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు ఎప్పుడు తప్పే.. ఆ తప్పుకి నేనే శిక్షించుకుంటున్న.. 

రెండు నిమిషాల గడియారపు ముల్లె ఇంత గుచ్చుకుంటుంది. కొన్ని వందల కుటుంబాల అక్రంధనల చూపులు ఇంకెంతగా గుచ్చుకుంటాయో ఆ నరకం అనుభావించడం కన్నా ఒక్క గుండుతో చావడమే స్వర్గం.

 

మొబైల్ ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే ఖలీల్. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎత్తితే అవతలి వైపు నుండి ఖలీల్ గొంతు.

 

ముబారక్ నయీం ముబారక్ మనం అనుకున్నది సాధించం. మేము పెట్టిన బాంబు పేలింది. ఇపుడు హైదరాబాద్ అంత అల్లకల్లోలం. టీవీ చూల్లేదా.. ఒకటే అరుపులు, అక్రనాదాలు, వందల మంది మాంసపు ముద్దలై రోడ్లమీద గిల గిల కొట్టుకోవడం అః ఎంత చూడ చక్క చిత్రం దిల్ కుష్ హోగయా ఈ జీహాద్ యుద్ధం లో మనం గెలిచాం.

 

ఇక నువ్ ఏ టెన్షన్ లేకుండా దుబాయి కి వెళ్ళిపో సంతోషంగా ఉండు.

 

ఫోన్ పక్కన పెట్టి ఏడవడం మొదలు పెట్టాడు, భయం భయం కళ్ళల్లో భయం 

ఏడుస్తూ అంతా అయిపోయింది. ఇక నా తప్పుకి చావే ముగింపు.

 

చెప్పానుగా దేవుడు లేడు. కనీసం నేను నా కుటుంబన్నైన సంతోషంగా చూడాలని నాకు నేను వేసుకున్న శిక్ష

గన్ తీసుకొని మెదడు గురి పెట్టుకొని కాల్చుకుంటుండగా 

మళ్లీ ఫోన్ మోగింది.

 ఎత్తాడు.

 ఒరేయ్ నయీం నేన్ర పాషాని. ఎక్కడున్నావ్ విషయం తెలుసా!

మీ అబ్బ అమ్మి బాంబు పేలుడులో చచ్చిపోయారు. 

నువ్ దుబాయ్ క్షేమంగా వెళ్ళాలని దువ చేయడానికి మసిదుకెల్తుంటే బాంబు పేలిదంట 

వేరు పడిన తలలను చూసి గుర్తు పట్టారూ.

 అంతే 

కట్టలు తెంచుకున్న బాధ ఆవేశంతో ఫోన్ విసిరిగొట్టి 

యా అల్లః  “నా రాతను ఇలా రాసావా.. ఇదేనా నరకం అంటే..” 

మెదడులోకి  గుండు దిగుతూ 

కళ్ళ ముందు నల్లని తెర.

  

*మిత్రుడు జాహీద్ కవిత “ఆఖిరీ పల్ – చివరిక్షణం” ఆధారంగా..

Categories: కథనం

బంధం – బంధనమైతే..?!

December 5, 2012 Leave a comment

నా మిత్రుడు ఒక అమ్మాయిని మూడేళ్ళ నుండి ప్రేమించి క్రితేడాది పెద్దలు లేకుండా పెళ్లి చేసుకున్నారు.

అందరికి తెలిసేలాగే కాపురం పెట్టుకున్నారు.

పర్వాలేదు నాలుగు చేతుల సంపాదన చెప్పుకోవడానికి వారికి సమయమోకటే తక్కువ కాని ఆర్ధికంగా ఎలాంటి ఆపదలు వచ్చే అవకాశం లేదనే చెప్పుకోవాలి.  ఏమైనా అయితే ఇరువైపులనుండి ఆదుకోవడానికి పెద్ద మొత్తం లోనే ఆస్తిపరులైన ఇరువురి తల్లిదండ్రులు.

ఇక్కడి వరకు ఇక బాగానే ఉందనుకుంటుండగానే….

ఎప్పుడో గాని గుర్తుకురాని నన్ను ఉన్నపళాన రమ్మని ఫోన్ చేయడంతో ఇక వెళ్లక తప్పలేదు.

చినుకు చినుకు కలిసి గాలి వానయినట్టు. ప్రతి అనవసరమైన విషయాలన్నీ వారి అవసరమైనట్టు గులకరాళ్ళు వారికి కొండరాళ్ళ కనిపిస్తున్నట్టున్నాయి. అందుకే ఎక్కడలేని తూఫనంత వారివురి నడుమే.

ఇక ఇదే సందన్నట్టు “పోనీ లేరా ఇది కాకపోతే ఇంకొకతి దీనికన్నా మంచి పిల్లనే తీసుకొచ్చి పెళ్ళిచేస్తా వోదిలేయరా!” అని ఆడి అమ్మ ఆజ్యం పోసింది. ఇక వాళ్ళ అమ్మ ఏమైనా తక్కువ తిన్నదా “అబ్బో ఇగ నువ్వు చేస్తావు నేను చూడాలి. పోనిలేవ్వే నీకోసం పిలగాడు ఇప్పటికి రెడీ గ ఉన్నాడు నిన్ను చేసుకోవడానికి పదవే పదా…..” అంటూ వాళ్ళమ్మ పొగలో కిరసనయిలేసి సెగ పెట్టింది.

ఇక నువ్వెంత అంటే నువ్వెంత అనే కాడికొచ్చి రేపోమాపో బంధం పుటుక్కుమనేలా ఉంది.

చదివిస్తే ఉన్నమతి చెడినట్టు అనే మా అమ్మ నోట విరివిగా వినపడే సామెత గుర్తొచ్చింది. నిజమే చదువుతో మేధావి తనంతో పాటు బంధాలను భలపరుచుకోవాలనే విషయం ఎందుకు నేర్చుకోరో… అసలు నేర్పిస్తే కదా…..

ఏంటో బంధాలు ఇంత భలహీనమైనవా?

నాలుగు ముచ్చట్లు, రెండు షికార్లు, ఒక సినిమా, సందు దోరికేతే పార్టీలు, స్ట్రెస్ కి ఫీలయితే కాస్త ఉపశమనానికి, విషయానికి ఓ తోడు.

ఇంకాస్త దూరంగా ఆలోచిస్తే ప్రేమ ఆ తర్వత వీలైతే పెళ్లి లేకుంటే సహజీవనం. ఏదైతేనేమి అన్ని ఇన్ స్టంట్ వ్యవహారాలు ఇన్ స్టంట్ జీవితాలు. చదువు వల్ల ఉద్యగం వల్ల కాస్త ఇండి విజ్యువాలిటి పెరగడమే దీనంతటికి కారణమా?  నా బతుకు నేను బతక గలను నా పరిధిలోకి నువ్వు నీ పరిధిలోకి నేను రాకుండా, నీ స్వతంత్రం నీది నా స్వతంత్రం నాది, అయిన నువ్వంటే ఇష్టం, సర్వస్వం, మనమెప్పుడు ఇలానే కలిసుందాం. సమస్య వొస్తే పరిష్కారించుకుందం.

కాని……… నా గమ్యాలు అవి, నా లక్ష్యాలు ఇవి. వీటికి నీకు అభ్యంతరం లేనంతవరకు మనం ఇలా కొనసాగుధం….

ఏంటో నవ్వొస్తుంది. పదాలకి అర్ధాలు మారుతుంటే..

ఎక్కడికేల్తున్నాయో మానవ సంబంధాలు, స్వచ్చమైన అనుబంధాలు, ఆప్యాయత అనురాగాలు, పాపం ఈ పదాలన్నీ చదువుకోవడానికి, వినడానికి, కథల్లో, కవితల్లో ఉపోయోగించుకోవడానికే మిగిలిపోయేలా ఉన్నాయి.

తప్పెవరిది అని అడిగితే ఓ….. పెద్ద పెద్ద మైకులేసుకొని తెగ లెక్చర్లు ఇవ్వడానికి లగేత్తుకొని వస్తారు.

హు.. మూలలే సరిగా లేనపుడు ఇప్పుడేదో వెలగబెడదాం అనుకోవడం కూడా బ్రమే.

ఏమి  రఘు ఏమ్ మాట్లడట్లేదేంటి నీ ఫ్రెండు కదా అని గుర్రుమంటూ చూస్తూ వెటకారంగా గయ్యిమన్నంత లెవిల్లో మా వాడి అమ్మ అరిచేసరికి తేరుకున్నాను (సాధారణంగా ఆవిడని పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తుంట. వాడి తరువాత నను కొడుకుల చూసుకునేది. ఆమె అంత కోపిష్టెం కాదు గాని ఇక వీడు పెళ్లి చేసుకున్నప్పటి నుండి వీడితో పాటు నన్ను కూడా పురుగుల చూస్తున్నది. అందుకే అటువైపు వెళ్ళడమే తగ్గిపోయింది.) ఇక అరిచిన అరుపుకి విషయం నా వైపుకు మళ్ళింది అక్కడికి నేనేదో పొడిచేస్తాను అన్నట్టు.

బెదురు బెదురుగా పనమ్మాయి గ్లాసులో నీళ్ళు తెచ్చిస్తే తాగేస్తూ, నేను కిక్కురుమనలేదు. అనడానికి కూడా నా దగ్గర ఏమి లేదు కాబట్టి. ఏదో అలోచిస్తున్నోడిలా మొహం పెట్టి కూచున్న. కాసేపటి గొడవ తర్వత ఇక ఇది తెగేలా లేదని వాడ్ని బయటికి తీసుకొచ్చి కార్లో బయల్దేరాం..

విషయమంత  పూర్తిగా విన్న..

ఇరువైపులా నుండి ఆలో చించాక అర్ధమైన విషయం ఏవిటంటే..

-వారు విడిపోవడానికి కారణం కలిసుండాలనే ప్రేమ లేక పోవడమే.

-అనుక్షణం పని ఒత్తిడి.

-ఎప్పుడు గమ్యాలపై ఆధారపడి, ఆలోచనలు లక్ష్యాలను గురిచేస్తు, కాలం ఇరువురి మధ్యన ఒక ప్రేమ బంధం ఉందనే విషయాన్నే అనిచివేసింది.

ఇక  నేను తనను జాబు మాన్పించు. లేదా నువ్వు జాబు మానేయ్ అని సలహా ఇచ్చాను.

నా సలహాకి వెర్రిగా నవ్వుతు.

నేను జాబ్ మానేసి తన మీద ఆధారపడాల తనని జాబ్ మానేయ్ మనే ధైర్యం లేదు. తన జాబ్ విషయంలో జోక్యం చేసుకోవద్దని పెళ్ళికి ముందే కట్టుబడి ఉన్నాం అని.

మరి ఎం చేద్దాం అనుకుంటున్నావ్ రా…

ఎం లేదురా బ్రేక్ అప్ అంతే.

మరి ప్రేమ?

తనకే లేనపుడు ఇక నా ప్రేమతో పనేముంది.

తనేమంటుంది?

తను కూడా ఫిక్స్ అయ్యింది. స్టేట్స్ కి వెళ్ళాలని. నేను వద్దన్నాను. అది తనకు నచ్చలేదు. నేను కోరుకున్న కెరీర్ ఇది కాదని వాదిస్తుంది. పైగా ఆరేడు నెలలు కాదు ఏకంగా రెండు సంవత్సరాలు.

పోనీ నువ్ కూడా వెళ్ళు.

వెళ్ళడం నాకిష్టం లేదు రా..

ఇక  నాదగ్గర మాటల్లేవు ప్రశ్నల్లేవు. కాసేపటి తరువాత కారు భయటికి దిగి వాడిని వెళ్ళమని మెల్లిగా నడుస్తూ ఆలోచనలు మళ్లీ మొదలయ్యాయి.

మనుషుల్ని సాశిస్తున్నది సమాజమా? జీవనశైలియ? ఆలోచన విధానాల? అభిప్రాయాల? ఎంచుకున్న లక్ష్యాల? చదివిన చదువా? కుటుంబమా? తల్లి దండ్రులా? ఏంటో…

ఒక దానితో ఒకటి ముడి పడి గందరగోళంలో ఇరుక్కొని కొట్టు మిట్టడడమే “ఒత్తిడా!!”

ఆ ఒత్తిడి కి కాస్త ఊరడింపే ఈ పరిచయాల? ఏమో… అవునో… కాదో…

ఎన్ని అనుకున్న ప్రతి దేహానికి ఓక కెమిస్ట్రీ ఉంది. రసాయనిక చర్య ఉందని ఏదేదో చెప్తారు. కాని మనసుందని అది మానసికంగా ఒకరి తోడు కోరుతుందని ఎవరికీ వారికి తెలిసిన. తెలిసే పరిచయాలు మొదలవుతాయి అది ఆకర్షణ అని అనుకునే తావు కూడా మనసుకు రాదూ.

అర్ధంలేని ఒత్తిడికి ఆ పరిచయాలు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఆ బంధం అప్పటికి అల ముడి పడుతుంది.

కాని… జీవితాంతం కలిసుండడానికి చివరికి ఎన్నో విషయాలు పరిగనలోకోస్తాయని, ఒకరంటే ఒకరికి ప్రేమలో మమేకమై, ఒకరికోసం ఒకరుగా, ఇరువురు ఒకటిగా అనే తత్వం కలగక పోవడానికి కారణమేంటి???

ఏమో ఇవన్ని ఆలోచిస్తుంటే అమ్మ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబం లో కలిసుంటే అమ్మలక్కలు అదని ఇదని గొడవలోచ్చినా.. ఒకరికొకరు కలిసే ఉండి ఆలోచించుకొని సర్దుకు పోయే గుణం అలవడుతుంది.

అందరి ఆప్యాయతల నడుమ ఏదో ఒక క్షణంలో ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ మొదలవుతుంది.

పెళ్ళికి వయసులో తేడా ఉండాలి. పెళ్లి అయి నీ జీవితంలోకి అడుగుపెట్టిన తనని మచ్చిక చేసుకొని మనసు పెట్టి చూసుకునే గుణం నీకు రావాలి, నువ్వంటే గౌరవం తనకు రావాలి.

ఒకరిమీద ఒకరికి కచ్చితమైన, నమ్మకమైన ప్రేమ ఉంటె ఎన్ని గొడవలోచ్చిన ఎవరు విడదీయలేరు రా…

కట్టుబాటు తాడిమట్టలు అని పెద్దలు చెప్పిన ముచ్చట పెడ చెవిన పెడితే ఇగ ఇడాకులు ఇస్తారకులు అని అవ్వ అయ్యల ఇజ్జత్ తీస్తారు. మల్లోచ్చేది, వచ్చే టోడూ కూడా పెళ్ళాన్ని వోదిలేసినోడో మొగుణ్ణి వొదిలేసినదో గతి.

నిజమే… ప్రేమ పుట్టాలన్న బంధం కొనసాగాలన్న ఇరువురికి కావాల్సింది కచ్చితమైన నమ్మకం.

తను ప్రేమించిన వాడే సర్వస్వం అని ఆవిడా,

ఆవిడే నా లోకం ఆవిడే లేక పోతే నేను ఏమి కాను.

అనే అంతర్లీన ఆత్మీయ అనుభూతి కలగనంత వరకు ఏ సంబంధమైన – అది పెళ్ళి పేరుతో ముడి పడిన – ప్రేమ మత్తులో అల్లుకున్న అన్ని నీటిలో బుడగల లాంటివే.

ఒకరంటే ఒకరికి ఆత్మీయ భావన కలిగినపుడు, వయసుతో గాని, ప్రపంచంతో గాని, విషయాలతో గాని సంబంధం లేదు.

అలంటి అనుబంధానికి పెళ్లి అనే కట్టుబాటు తంతు కూడా అవసరం లేదనే నా అభిప్రాయం.

ఇక ఆత్మలు ఒకటయ్యాక విడిపోయే అవకాశమెక్కడుంటుంది. అనుక్షణం ఒకరికోసం ఒకరిగా తపిస్తుండగానే కాలం అల గడిచిపోతుంది.

బహుశా అలంటి ఆత్మీయ బంధాలు ఏర్పడాలంటే ఇద్దరు కలిసుండి ఒకరినొకరు అర్ధంచేసుకోవడానికి పెళ్లి అనే ముడితో కట్టేసి అవగాహన వచ్చేవరకు ఉమ్మడి కుటుంబాలనే వ్యవ్యహారం పనికొస్తుందని మా అమ్మ తత్వం. కావచ్చు..

నా మట్టుకైతే ప్రేమ అనే భావన నిజంగా మొదలైతే అది ఎన్నటికి ఆరిపోదు ఆరిపోతున్నదంటే వెలిగించాలని ఎంత ప్రయతించిన అది ఎవరో ఒకరి భావనని భలవంతంగా లొంగ దీసుకోవడమే అవుతుంది.

ప్రేమతో పెనవేసుకున్న బంధం గట్టిధయితే ఆ ప్రేమ బంధం ఎక్కడ యే  పరిస్థితిలో, యే జీవనవిధానంలో ఉన్న ఉన్నంతలో త్రుప్తి పొందుతూ ఆనందంగా గడిపే ప్రయత్నం జరుగుతుంటుందని నా అభిప్రాయం.

ఏంటో  ఆలోచనలన్నీ అర్ధం పర్ధం లేకుండా పారిపోతుంటే జేబులో మోగుతున్న సెల్లు రింగ్ టోన్ తో ఉన్నపలనా ఆగిపోయాయి. ఫోన్ తీసి చూస్తే తాక్షి….

ఎక్కడున్నావ్? ఇంతకి ఏమైనా తిన్నావా? ఎం చేస్తున్నావ్? బయట తిరగకు ఎండలు మండిపోతున్నాయి.. తొందరగా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకెన్ని రోజులు మహా అంటే వారంలో ఎగ్జామ్స్ అయిపోతాయి…………. అవతలి వైపునుండి తన మాటలు సాగుతూనే సూర్యాస్తమయం అవుతుండగా ఇంటిముఖం పట్టా…

Monday, April 9, 2012

“సాయం”సంధ్యలు…

December 5, 2012 Leave a comment

ఇప్పటికి హైదరాబాద్ వదిలి నూట అరవై కిలోమీటర్లు దాటాము కాసేపట్లో తెలవారబోతోంది అంటూ అర్ధం కాని ఊరి పేరేదో చెప్పాడు. మరో సారి అడగాలన్న తాపత్రయం కూడా నాకు లేదు. ఛీకట్లతో జత కూడిన నీలం రంగును నెమ్మదిగా దులిపేసుకుంటూ నిటారుగా గాలిసవ్వళ్ళకు ఊగిసలాడుతున్న, ఆకాశాన్ని తాకుతున్నట్టుగా నిల్చున్న పెద్ద పెద్ద చెట్ల గుంపులు వేగంగా నెట్టుకుంటూ పోతున్న మా వెహికల్ కిటికీ గుండా లీనమై చూస్తున్న నాకు వాడి మాటలు పెద్దగా వినిపించట్లేదు.

ఆ ఎదవ కిటికీ మూసేయ్ ర బాబు చలికి చచ్చిపోతున్న… అంటుంటే తప్పదన్నట్టు కిటికీ మూసా.

నెమ్మదిగా కళ్ళుమూసుకొని వెనక్కి తల వాల్చి ఊగుతున్న వెహికల్ తో పాటే నా తల ఊపుతూ కాసేపు కూర్చున్నానో లేదో. కొత్తగా వచ్చిన హైదరాబాద్ రూల్ మహత్యమా అని కూలింగ్ కవర్ తీసేసిన కిటికీ అద్దం గుండా సూర్యుడు సురుక్కుమనిపించాడు. ఈసారి కిటికీ దింపి చూసా.. చుట్టూ అరటి చెట్ల తోటలు, పొలాలు, టేకు చెట్ల గుండా ప్రయాణం సాగుతున్నదని అర్ధమైంది. మేము కర్నాటక రాష్ట్రంలో ఉన్నామని నాకు అర్ధం కాని బాషలో ఊరి పేరుతో కూడిన బోర్డు. ఆ బోర్డు  లో ఏడూ కిలోమీటర్ల దూరంలో అని కనిపించడంతో.. ఆ బోర్డ్ వెనకాల ఓ గుడి గోపురం. నా కెమరాతో క్లిక్ మనిపించ. రాత్రంతా ఈ కెమరా పట్టుకొని వీడు ఏం చేసాడో ఏమో.. అప్పటికే ఛార్జింగ్ లేక కొట్టుకుంటోంది. మరో రెండు ఫోటోలు తీసానో లేదో చప్పున చల్లారిపోయింది. విసుగుతో కెమరా బాగ్ లో పెట్టేసి. అదే కిటికీ గుండా అలా చూస్తున్న.

అంతకు రెండు రోజుల ముందు రాత్రులు కూడా నిద్ర లేదు అందుకేనేమో శరీరం, మనసు, గొంతు, కళ్ళు అన్ని మత్తును వాటేసుకున్నాయి.

కంటికి కనిపిస్తున్న దృశ్యం తప్ప దేని మీద మనసు లగ్నం చేసే కుతూహలం ఇసుక రేణువంత కూడా లేదు. దానికి తోడు కడుపులో ఆకలి. సినిమా షూటింగ్ ల పుణ్యమా అని కొద్ది నెలలుగా టంచనుగా టైం ప్రకారం తినడం దేహానికి అలవాటైంది. అలవాటులో పొరపాటుగా ఏమి దొరికే అవకాశం కనిపించని ఈ చెట్ల మధ్యలో విపరీతమైన ఆకలి.

ఒరేయ్ నాయన ఇంకా ఎంత సేపురా.. నాకు ఆకలేస్తోంది అని విసుగ్గా అడిగా మనోహర్ గాడిని.

ఏరా ఇంకా ఏడూ కూడా కాలేదు అప్పుడేనా..

పోనిర ఎక్కడో చోట ఆపేయ్..

సారూ మీరు ఇంకో అరగంట ఓపిక పడితే ఒక పల్లె వస్తుంది. అక్కడేమైన దొరకొచ్చు అని మా యూనిట్ డ్రైవర్ రాజు చెప్పాడు.

పల్లెలు గ్రామాలూ ఊర్లు తిరగడం నాకు ఎంత ఇష్టమైన, ఎందుకో ఇంత నీరసంలో చిరాకు చికాకు తప్ప ఎలాంటి ఫీలింగ్ నాలో కలగట్లేదు.

ఈ మనోహర్ గాడు ఏదో సాంగ్ షూటింగ్ కి లొకేషన్ వెతకడానికి వద్దురా అని బతిమాలిన వెంటేసుకొచ్చాడు నన్ను.

మెలకువలోనే ఉండి కూడా కళ్ళు తెరుచుకోలేకపోతున్న.

ఏంటో ప్రపంచం బద్దలైన పర్వాలేదు నేను భరించలేని విషయాలు ఒకటి నిద్ర రెండు ఆకలి అందుకేనేమో ఈ రెండు విషయాల్లో కొత్త పాత అని లేకుండా నిర్మొహమాటంగ ఉంటాను. అందుకే…

రాజు బాబు తొందరగా పోనివ్వు నాయన..

ఓకే సార్.. వెంటనే వచ్చిన సమాధానం కి తోడుగ వేగం పుంజుకుంది.

వెచ్చని ఈదురు గాలులు కొంకర్లు తిరిగిన చేతులని, ఒళ్ళు ని సరి చేసింది. కాస్త విశ్రాంతిగా ఉంది. సర్రుమంటూ బ్రేక్ వేసాడు. ఒకే ఒక్క పూరి గుడిస రోడ్ కి కుడి వైపున. నెమ్మదిగా దిగాము. చుట్టూ చూసా ఎటు చూసిన దాదాపు రెండు మూడు కిలో మీటర్ల వరకు ఒక్క ఇల్లు కూడా లేదు. చుట్టూ చెట్లు, మధ్యన నల్లటి సింగల్ రోడ్, మా వెహికల్ మరియు  ఆ పూరిగుడిస.

రాజు వెళ్లి ఏదో అడిగాడు గుడిసెలో ఉన్న అవ్వని. బయటికొచ్చి సార్  మీరు ఈ వేపపుల్లలతో అక్కడ మొహాలు కడుక్కోండి ముసలవ్వ  పిండి పిసుకుతోంది పది నిమిషాల్లో వాళ్ళ  కొడుకొస్తాడట. పూరీలు రెడీ అవుతాయి.  గుడిసెకు ఆమడ దూరంలో గోళం నిండా నీళ్ళు చిన్న బకిటు మూరేడుకు సగముండే తెల్లని లోట లైఫ్బాయ్ సబ్బు.  ఆ పక్కనే నులక మంచం గబా గబా వెళ్ళాను నులక మంచంలో బ్యాగ్ పడేసి ఒంట్లో ఉన్న మజ్జు పోవాలని మొహంతో పాటు ఏకంగా స్నానం కూడా కానిచ్చ. ఒక్కసారిగా ఏదో తెలియని ఆనందం వెచ్చగా కాస్తున్న ఎండా చల్లగా వీస్తున్న గాలులు ఎప్పుడో చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి..

మనోహర్ గాడు వింతగా చూసి కాసేపు నవ్వుకున్న వాడు కూడా అమెరికా దర్పాన్ని వదిలి ప్రకృతికి అంకితమయ్యాడు కాసేపు..

టీ షర్టు జీన్స్ మార్చుకొని తల గట్టిగ తుడుచుకుంటుంటే వెచ్చటి మీగడ పాలు అవ్వ పట్టుకొచ్చింది. పెద్ద రావి చెట్టు నీడలో వేసిన నులక మంచం లో కూర్చొని రెండు చేతులతో ఆ వేడి పాల చెంబుని గట్టిగ అదిమి పట్టి ఒక్కో గుటక గుండెలోకి దిగుతుంటే ఏదో తెలియని శక్తి నాలో ప్రవహిస్తున్నట్టుంది. పాలు తాగడం పూర్తవుతుండగా సైకిల్ తొక్కుతూ తెల్లని ఫుల్ బనీను మోకాల్ల వరకు మలిచిన పాయింటు తో కుంకుమ బొట్టు దానిపై విబుదితో అడ్డబొట్టు చూడడానికి మనిషి దిట్టంగా ఏదో మలయాళం పాట పాడుకుంటూ వచ్చి సైకిల్ ని గుడిసెకానించి కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడికి దండం పెట్టుకొని పని మొదలు పెట్టాడు. పది నిమిషాల్లో మూడు ప్లేట్లతో, ఒక్క ప్లేటులో అరిటాకు వేసి నాలుగు పూరీలు చిన్న చిన్న గిన్నెల్లో వేడి వేడిగ గుమ గుమ లాడే పప్పు పాలకూరతో.

 

గుడిసెను చూస్తుంటే అది ఎందుకో హోటల్ లాగ అనిపించలేదు ఆ గుడిసె వెనకాల కాస్త పొలం చిన్న తోట ఉందంట అది ఆ ముసలవ్వ చూసుకుంటూ ఉంటుంది. అక్కడ కూలి పనికి వచ్చే వాళ్ళంతా వాళ్ళ తెచ్చుకున్న భోజనాలంత ఈ గుడిసె పక్కన చెట్టుకిందే చేస్తుంటారు.

వీళ్ళకి వీళ్ళ పిల్లలకని ఒక పది మందికి సరిపడా భోజనం ఈ ముసలవ్వ చేస్తుంటుంది.  ఇక పొద్దున్న  దారిన పోయేవాళ్ళు అడిగితే కాదనకుండా ఒక ఇరవై  మంది కి సరిపడా టిఫిను చేస్తుంటుందంట. సరిగ్గా హై వే కి పది కిలోమీటర్ల దూరం లో మూడు కిలో మీటర్ల ఒక పల్లెకి   దగ్గరలో ఉందని అర్ధమైంది. తల ఓ పది పూరీలు లాగించామో లేదో పెసర పప్పు మిరియాలతో చేసిన గుమ గుమ లాడే పొంగలి పై, పండు మిరపకాయతో చేసిన ఎర్రటి ఆవకాయ పచ్చడి అంచున వేసి నంజుకోడానికి వేయించిన చల్ల మిరపకాయలు చక్కగా ప్లేట్ లో సర్దుకొని అవ్వ, వాళ్ళ  కొడుకు పట్టుకొచ్చారు. అరిటాకుల మహత్యమో ఏమో వెచ్చగా పొగలు కక్కుతూ గుమ గుమ లాడుతుంటే ఆగకుండా లాగించాం. శుబ్బరంగా చేతులు కడుక్కుంటుంటే ఓ అరిటిపండు తీయ్యని జామ పండు చేతిలో పెట్టారు. ఆహా మహా ప్రసాదం లాగ చేతిలోకి తీసుకొని  తింటుండగా ఎంత అని రాజు అడిగి మాకు చెప్పాడు. చిత్రం ముగ్గురం తిన్న తిండికి వారు అడిగింది కేవలం యాబై రూపాయలు.

 

మాది హోటల్ కాదు బిడ్డ ఆకలని వస్తే ఉన్నంతలో సాయం చేయాలని మా అయ్య చెప్పేటోడు గదే నేను గూడ చేస్తున్న అని అవ్వ చెప్తోంది.

ఈ పొలం పనులకు బోయే పోరగాల్లకు తిండి సక్కగా దొరకదు వాళ్ళు సదుకొండ్రా అంటే వినరు అందుకే మా అవ్వ చేసిపెడతది. ఇగో ఆ కనపడే అరటి  జామ తోట నాదే అని చెప్పుకుంటూ పోతుంటే నేను మనోహర్ గాడు ఆశ్చర్యంగా వింటూ ఉన్నాం. అవ్వ వద్దంటున్న మనోహర్ గాడు మూడు వంద నోట్లు చేతిలో పెట్టి వేల్లోస్తాం. అని చెప్తుంటే కృష్ణన్ అయ్యర్  (అవ్వ కొడుకు పేరు) ఒక ఇరవై అరటి పళ్ళు ఓ పాతిక జామ పళ్ళు  సంచిలో పెట్టి ఇచ్చాడు. నేను మనోహర్  వెనకాల కూర్చున్నాం. రాజు నెమ్మదిగా బండి స్టార్ట్ చేసాడు. వేగంగా వీస్తున్న ఈదురు గాలి శబ్దం తప్ప చాల సేపు మాటలు లేవు. నా ఆలోచనలన్నీ ఆ పూరి గుడిసె చుట్టే తచ్చాడుతున్నాయి. ఇంకా సహజమైన నిస్వార్ధ సేవను చేసే మనుషులు మిగిలే ఉన్నారా…? ఎందుకో అప్పుడప్పుడు మానవ సమాజం మీద మనవ సంబంధాల మీద గౌరవం పెరుగుతుంటుంది ఇలాంటి వాళ్ళను చూస్తుంటే. ఏంటో చాలా కాలం తరువాత మనసుకు ఆనందం కలుగుతుంది.

 

ఒరేయ్! డబ్బు మనల్ని శాసిస్తుంద? లేక మనం డబ్బుకు దాసోహ మంటున్నమా?? సూటిగా అడిగిన వాడి ప్రశ్నతో ఆలోచనల్లోనుండి తేరుకున్నాను.

 

సమాజం పీకని ఊపిరాడనివ్వనంతగా పిసికే చనువుని ఆ డబ్బుకి మనమే  కల్పించాం.

ఏమో రా.. నువ్వు చెప్పింది నిజమే కాని ఇప్పుడు మనమేమి చేయలేము కదరా..

 

అంతే.. అందరం అల చేతులు దులుపెసుకొని మన పరిధులలో మన స్వేచ్చలో ఆనందంగా గడిపే ప్రయత్నమే నీది నాది. ప్రపంచాన్ని మర్చేయల్సిన పని లేదు మంచి మనసుతో నలుగురికి నాలుగు ముద్దలు పెట్టె ఆ అవ్వని చూడు. అంతకు మించిన దైవత్వం ఇంకేం ఉంటుందిరా??? మంచిని పంచుతున్నామని నొసలు మీద రాసుకొని తిరగనక్కర్లేదు. ఎవరిని అడగనక్కర్లేదు. ఎవరికీ చెప్పుకోనక్కరలేదు.  మనం మన అంతరాత్మ ఆ ముసలవ్వలాగ నిస్వార్ధంగా ఉంచుకోగలిగితే చాలు. అని నా ఉద్దేశం రా..

 

నిజమే.. అని వెనక్కి తల వాల్చాడు నేను కూడా అల తల వాల్చి కళ్ళు మూసుకున్నాను..

 

అరగంట ప్రయాణం తరువాత నెమ్మదిగా వాతావరణంలో మార్పు సూర్యుడు మేఘాల మూసుగు తొడిగాడు. వాతావరణం మరింత చల్ల బడింది. పల్లెల్లో నుండి మా ప్రయాణం ఇరుపక్కల చిన్న చిన్న గుడిసెలు మట్టి రోడ్డు చల్లని గాలులు అప్పుడప్పుడు ఉరుములు.

 

ఒక చోట పక్కకి ఆగాము. రాజు ఎవరినో ఏదో అడిగాడు ఒక చెరువు పచ్చని అరటి తోటలు సూర్యుడు సరిగ్గా కనపడే విధంగా ఉండే పొలం గట్లు బాదం తోట ఉండే చోటు గురించి. మరో మూడు కిలో మీటర్ల దూరం లో ఉందన్నాడు. ఇక మా ప్రయాణం ఆగకుండా సాగుతూ ఒక గూన పెంకుల ఇంటి ముందు ఆగింది. అది పల్లె చివరిదో మొదటిదో అర్ధం కాలేదు కాని ఆ ఇంటిముందు దానిని అనుకోని చెట్లు చేమలు పొలాలు తోటలు ఒక పెద్ద వాగు చూడడానికి అందంగా, ఆకాశం మబ్బుపట్టి ఉండడంతో కాస్త భయంగా అనిపించింది.

 

ఆ ఇంట్లో బక్క పలుచని మూరెడు పొడుగు గడ్డం తో ముసలాయన వాళ్ళ కొడుకు కోడలు పదేళ్ళ మనవడు. ఆ ఇంట్లో రెండు గదులు రెండో గదిలో చిన్న పిట్టగోడ అడ్డుగా కట్టెల పొయ్యి. ఆ ఊర్లో ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక నాలుగు గంటలు మాత్రమే కరెంటు ఉంటుంది. అలుకు అద్దిన నున్నటి నేల..

గడ్డం ముసలయానికి తెలుగు వచ్చు. వాళ్ళ కొడుకు రమేష్, కోడలు శాంతమ్మ, మనవడు నాగరాజు.

 

రాజు వాళ్ళతో ఏదో మాట్లాడి. ఆ తర్వాత

రమేషు రాజు ఇద్దరు మలయాళంలో మాట్లాడుకుంటూ బయటికెళ్ళారు..

 

కాసేపటికి చేపలతో వచ్చారు వంట మొదలయ్యింది. నేను మాంసం తినని సంగతి రాజు కి తెలియదు. అదే విషయం మనోహర్ చెప్పాడు. అయ్యో సారి సార్  నాకు తెలవదు మీకోసం ఎం చేపియ్యమంటారు. ఏదైనా పర్వాలేదు. పెరుగు కాని పచ్చడి ఉన్న చాలు వాళ్ళని ఇబ్బంది పెట్టకు అని అంటుంటే.. ఇబ్బంది ఎందుకు బిడ్డ అని లోపలనుండి ముసలాయన అన్నాడు. నేను నవ్వుకుంటూ పందిరి కింద మంచంలో కూర్చుండి  పోయా..

 

మా యూనిట్  డ్రైవర్ రాజు ను చూస్తే నాకు ఆశ్చర్యమేస్తుంటుంది. నిమిషాల్లో అల ఎలా పరిచయం చేసుకుంటాడో మనుషుల్ని అల ఎలా మచ్చిక చేసుకొని ఒప్పించగలడో అని. అదే ప్రశ్న వేస్తే ఏముంది ఇదంతా అలవాటైపోయింది అని తన సినిమా చరిత్రని అరగంట సేపు  చెప్తుండగా వంట సిద్దం అయ్యింది అని మలయాళంలో రమేషు చెప్పడం తో లోపలికెళ్ళి మాకోసం పరిచిన నూలు సంచుల్లో కూర్చున్నాం. శాంతమ్మ పల్లాలలో వడ్డించింది రాజుకి మనోహర్ కీ  వాళ్ళని కూడా కూచోమను అని రాజుతో చెప్పాను. మనం తిన్నాక తింటారట అన్నాడు.

 

చిన్నప్పుడు ఇంట్లో చెమటలు పట్టేంత తృప్తిగా ఆనందంగ మళ్ళీ ఇంతకాలానికి తిన్నాను. నాకోసం ముద్ద పప్పు పచ్చి పులుసు అప్పడం తో పాటు గిన్నెడు మీగడ పెరుగు పెట్టింది. తృప్తిగా భోజనం పూర్తి చేసుకున్నాం.

అమెరికాలో దొరకకుండ జిహ్వాని చంపేసుకున్న మనోహర్ కి ఊహించని చేపల పులుసుని యమ జుర్రుకున్నాడు. మా బోజనాలు కానిచ్చి బయటికొచ్చి పందిరి కింద నడుం వాల్చాను. ఏంటో ఎప్పుడు నిద్ర లోకి జారుకున్ననో ఏమో సన్నని నీటి తుంపర్లు పడుతుండగా మెలకువ వచ్చింది.  లేచి చూసా దూరంగా రమేష్ గేదేలకి చొప్ప పెడుతున్నాడు. టైం ఆరు కావొస్తోంది  అబ్బో చాల సేపే పడుకున్నాను..

చూస్తే రాజు మనోహర్ లేరు. రమేష్ ని ఎలా ఏమని అడగాలో తెలియలేదు గదిలోకి తొంగి చూస్తే ముసలయన ఉన్నాడు. మా బ్యాగ్ లు గదిలో ఓ మూలకి ఉన్నాయి.

 

ఇప్పుడే వస్తాం తాత అని చెప్పి వెళ్లారు. నీకు రెండ్రోజుల నుండి నిద్ర లేదంటాగ పడుకోనివ్వండి అన్నారు.

 

నెమ్మదిగా వర్షం మొదలయ్యింది. పందిరి నీడలో మంచం లో కూర్చున్నాను.

 

మనసు ఆలోచనల తో పాటు నేను ఒంటరిగా కూర్చుండి పోయా..

 

ఏంటో ప్రయాణం లాగే జీవితం కూడా ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో..  ప్రతి మలుపు ఏ గుర్తుని మిగుల్చుతుందో అంత సస్పెన్స్ అంత రహస్యం…

కర్ర పట్టుకొని నెమ్మదిగా శివ మంత్రమేదో జపం చేస్తూ నా పక్కనే కూర్చున్నాడు ఆ ముసలాయన.

“అంత రహస్యమే బిడ్డ చావు పుట్టుకలతో పాటు ప్రతి క్షణం కూడా పెద్ద రహస్యమే అని చెప్పాడు.” ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాను ఒక్క నిమిషం అర్ధం కాలేదు.

నిజంగా ఏంటి ఈ తాత నా ఆలోచనకు తన మాట అనుకోకుండా కలిసింద లేక…. అనే ఆలోచనలో ఉన్న

మళ్ళీ తానే మొదలు పెట్టాడు. “ప్రపంచానికి మన మనసు కనపడితే అంత గగుర్పాటే గగ్గోలాలే.”

 

ఒక్క నిమిషం పిచ్చెక్కిపోయింది.

 

ఇంతకి నువ్వు భగవంతున్ని నమ్ముతావ? భగవత్ తత్వాన్ని నమ్ముతావ? అని సూటిగా నా కళ్ళలోకి చూస్తూ అడిగాడు.

నాకు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలీదు తాత  అన్నాను.

వాస్తవం అనే గమ్యస్థానానికి అవాస్తవం అని నమ్మించే గంతలను కట్టుకొనే వెళ్ళాలి. అప్పుడే వాస్తవం మరింత శక్తివంతమవుతుంది. అనే సమాధానం వినపడింది. అది కూడా అర్ధం కాలేదు. ఆ మాటల్లో ఏదో రహస్యం దాగుంది అనిపించింది.

ఆ వెంటనే.. రహస్యాన్ని ఇప్పుడు రహస్యంగా ఉంచగలిగితేనే మరో తరం పాత రహస్యాన్ని చేధించే పరిశోధనలో కొత్త రహస్యాన్ని సృష్టించగలరు. అయిన ఇప్పుడు రహస్యం లో దాగిన వాస్తవాన్ని ఎవరు నమ్మగలరు. నమ్మించాల్సిన అవసరం భగవంతుడికి లేదు నమ్మే ఓపిక మనిషికి లేదు. అందుకే భగంతుడు ఎంతో దూరంలో ఉంటాడనే భ్రమలో ఉంటూ దూరం లోనే పెట్టేస్తారు మానవులు. భగవంతుడు ఏదో చెప్తాడు తమకేదో అర్ధమవుతుంది. వారు వేరొకరికి ఇంకేదో చెప్తుంటారు. ఇక అసలు రహస్యం ఎప్పటికి రహస్యంగానే ఉండిపోతుంది.

 

తన మాటలతో మరింత ఆశ్చర్యం కలిగింది నిజంగానే నా మనసుని వినగలుగుతున్నాడ?  ఒకేసారి వింత వింత ప్రశ్నలు నన్ను చుట్టూ ముట్టాయి.

 

వర్షం మరింత పెరిగింది. పచ్చని పొలాలు నిండి పోయాయి. ఏడు కావస్తోంది వీడు ఇంకా రాలేదు. మరో వైపు కాస్త గాబరా మొదలయ్యింది. కరెంటొచ్చింది వెంటనే ఫోన్ చార్జింగ్ పెట్టాను.. నో సిగ్నల్స్.

 

తాత మంచంలో పడుకొని ఏదో జపం చేసుకుంటున్నాడు.

మనసుల్ని చదివే శాస్త్రం ఒకటుంటుంది అని బలంగా నమ్మే నాకు తాత మాటలు అలవాటైపోయాయి. రమేష్ వచ్చి పక్కన కూచొని వచ్చి రాని తెలుగులో వర్షం పడుతోంది కదా దారి సరిగా ఉండదు మొత్తం నీళ్ళతో నిండిపోతుంది ఎక్కడైనా చిక్కుకున్నారు కావచ్చు అని..

 

నాగ రాజు వాళ్ళ అమ్మ కొంగు చుట్టూ తిరుగుతూ వంట చేస్తుంటే చూస్తున్నాడు. పప్పుచారు గుమ గుమ లాడుతుంది. రమేష్  పాలు పితుకేందుకు గేదల వైపు వెళ్ళాడు.

 

కంగారు పడకు వస్తారు లే అని మంచం మీది నుండే చెప్పాడు. సరే తాత అన్నాను.

 

ఆలోచనలన్నీ ఎవరినో గుర్తు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.

అచ్చంగా కొన్ని ఏళ్ళ క్రితం ఓ గడ్డం ముసలాయన ఇంటింటికి బిక్షం అడుక్కొని మా ఇంటికి దగ్గరలో ఉండే గుట్ట మీద గుడి వద్ద ఉండే వాడు. అప్పట్లో మా బోటి పిల్లలంతా పిచ్చోడు పిచ్చోడు అంటూ వెంట పడే వారు. మనిషి చాల సన్నగా ఎముకలు తేలి గట్టిగ ఉండే వాడు. తనని చూడాలంటేనే నాకు భయం. ఎవరిని ఏమనే వాడు కాదు తనలోకంలో తాను ఉండే వాడు. ఎప్పుడు అర్ధం కాకుండా ఏవేవో మాట్లాడుతుండే వాడు అక్కడే భధ్రకాళి చెరువులో స్నానం చేసేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచాక తనని అలా చూడడం అలవాటయ్యింది. చిత్రమైన విషయమేంటంటే తను చనిపోయే ముందు ఇక నేను చనిపోబోతున్నానని చెప్పడం.  అతనిదొక పెద్ద కథ తనని దగ్గరిగా చూసిన వాళ్ళు తన గురించి చిత్రమైన సంగతులు చెప్పేవారు.

 

ఆ తరువాత మళ్ళీ ఈ తాత.. నిజంగానే సైన్స్ కి అందని ఎన్నో రహస్యాలు ఉంటాయని తెలిసిన

ఏమి తెలియని మోసగాళ్ళు  దొంగలు సాధువుల వేషం వేసుకొని అమాయక ప్రజల్ని పీడించే వాళ్ళని  చూసి చూసి అసలు వాస్తవులు ఎవరో తెలుసుకొనే సమయం కాని ఆలోచన కాని మనం ఎప్పటికి రానివ్వమేమో..

 

నిజమే తాతా  చెప్పింది “నమ్మించాల్సిన అవసరం భగవంతుడికి లేదు నమ్మే ఓపిక మనిషికి లేదు” మిగతాదంత రంగులు పూసి భ్రమలోకి దింపడమే. దానికి తోడు మనుషుల అవసరాలు, భ్రమకు వాస్తవికత అని  నమ్మించే మరో కొత్త రంగు రాజకీయం చేరిపోతు పిచ్చిగా ఆడుకుంటున్నారు సమాజంతో..

 

లే.. భోజనం చేద్దాం అనడంతో అందరం కూచున్నాం బోజనానికి. నా ఆలోచనంత వీడు ఇంకా రాలేదనే.. ఊరు పేరు తెలియని చోట ఎవరో తెలియని మనుషుల మధ్య ఇలా ఆతిధ్యం తీసుకోవడం ఎందుకో చాల ఇబ్బందిగ మొహమాటంగా అనిపిస్తోంది. వర్షం శబ్దం, గంటె తో వడ్డిస్తున్న శబ్దం తప్ప మిగతాదంత నిశ్శబ్దం. ఎవ్వరం ఏం మాట్లాడకుండానే పప్పుచారుతో భోజనం పూర్తయ్యింది. రమేష్ అల ఊళ్ళో వరకు వేల్లోస్తా అని గొడుగు పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిన మనిషి గంటైన తిరిగి రాలేదు. వర్షం తన ప్రతాపం ఇంకా చూపెడుతూనే ఉంది.

 

బండి ఆగిపోయినట్టుంది. వాళ్ళు రావడానికి టైం పడుతుంది నువ్వు పడుకో బిడ్డ అన్నాడు తాత. సరే అని నెమ్మదిగా మంచంలో వాలాను..

నిక్కరేసుకున్న నాగ రాజు పుస్తకాలు ముందేసుకొని ఏవో రాస్తున్నాడు.. కళ్ళు మూసుకున్న కాసేపటికి నాగరాజు వచ్చిలేపి చేతికి దుప్పటి ఇచ్చాడు కప్పుకోమని. వెచ్చగా కప్పుకున్నాను. వింత వింత ఆలోచనలతో ఎప్పుడు నిద్ర లోకి జారుకున్ననో తెలీలేదు.

 

తెల్లగా తెలవారుతున్నట్టుంది. లేచి చూసా పక్కనే రెండు మంచాల్లో మనోహర్, రాజు. మనసు కుదుట పడింది. వాళ్ళని లేపకుండానే తాత నేను అల బయటికి నడిచాం. వీల్లెప్పుడొచ్చారు? ఏం జరిగిందట? అనే ప్రశ్నలు అడగకుండానే అల నడుచుకుంటూ వెళ్లాం.

 

పంటంతా వాగులో కొట్టుకుపోతోంది. తాత కళ్ళలో నాకు మాత్రమే కనిపిస్తున్న తడి.

 

చుట్టూ ఇంకా చల్లగానే ఉంది. స్వేట్టర్ జేబుల్లోకి చేతులు పెట్టేసిన కూడా చల్లని వణుకు ఇంకా తగ్గట్లేదు. తాత మాత్రం పంచ, పైన శాలువ  బహుశ తాను నాలుగంట్లకే  లేచినట్టున్నాడు. స్నానం చేసి బొట్లతో నిండుగా ఉన్నాడు. మేము ప్రకృతి మరియు మాకు మాత్రమే అర్ధమయ్యే పెద్ద నిశ్శబ్దం.

 

చాల సేపు పెద్ద బండ రాయిపై కూర్చొని వెళ్ళిన దారిలోనే కాసేపటికి తాత నేను వెనక్కి తిరిగాం. ఇంకా సూర్యుడి జాడ తెలిట్లేదు.

 

హే రఘు మామ గుడ్ మార్నింగ్ రా.. ఏరా బాగా నిద్ర పట్టిందా.. అని మనోహర్ ఎదురొచ్చాడు.

 

ఏమైపోయావ్ రా.. ఏం లేదురా బండి ఆగిపోయింది. నానా తంటాలు పడి అది రిపేర్ చేయించి రాత్రి రెండు గంటలకు వచ్చాం. రమేష్ వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఆ వర్షంలో ఎటు వెళ్ళలేని పరిస్థితి. అంటూ చెప్పుకుంటు పోయాడు.

 

నేను వెంటనే తాత వైపు చూసా..  తనలో ఎలాంటి మార్పులేకుండా చాల నిశ్చలంగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నాడు.

 

మొహాలు కడుక్కొని వేడి వేడి ఉప్మా తినేసి బయటికొచ్చాం. రమేష్ చేతిలో కొన్ని డబ్బులు పెడుతుంటే వద్దంటే వద్దంటూ తీసుకోలేదు.

 

తాత మా దగ్గరికొచ్చి

మనిషికి మనిషే సాయం. కష్టాల్లో నాలాంటి అనామకుడు నీ ఇంటిముందుకు వస్తే నువ్వు సాయం చేయవా ఇది అంతే.. ఉంచండి నాయన జాగ్రత్తగ వెళ్ళండి..

 

బండి స్టార్ట్ చేసాం. అది నెమ్మదిగా తిరుగు ప్రయాణం వైపు దూసుకుంది.

 

నేను మనోహర్ ఇద్దరం బీకరమైన నిశ్శబ్దంలో ఉండి పోయాం. ఆ నిశ్శభ్డంలో తాత  మాట ఇంకా స్పష్టంగా  వినపడుతూనే ఉంది.

 

“కష్టాల్లో నాలాంటి అనామకుడు నీ ఇంటిముందుకు వస్తే నువ్వు సాయం చేయవ?!”

Categories: ప్రయాణం

స్మృతి సౌరభాలు

December 5, 2012 Leave a comment

ఇంకా వెతుకుతున్నాను. వెతకడం నాకు కొత్త కాదు మరిచిపోవడం నాకో సహజమైన అలవాటు ఏ వస్తువు ఎక్కడ పెట్టానో గుర్తుకు రాక వెతుకుతూనే ఉంటా చాల సేపు. చిత్రం ఏంటో గాని వెళ్ళిన చోటుకి పది సార్లు వెళితే తప్ప నాకు దారి గుర్తుకు రాదూ అంత మతి మరుపు. మొత్తానికి దొరికింది పుస్తకం దాని మధ్యలో చిక్కుకున్న ఒకప్పటి కాగితం. కాగితం అనడం కాదు గాని చిన్ని ఉత్తరం అది ఇప్పుడెందుకు? ఇప్పుడవసరం! అని అనిపించింది.

 

దాదాపు ఎంతో కాలమవుతోంది బహుశ ఓ పుష్కరానికి పై మాటే.. కొన్ని అనుబంధాలు మనకు తెలియకుండానే ఎలాంటి మనస్పర్ధలు లేకుండానే ఎంతో దూరానికి, కాలానికి కూడా అందనంత దూరంగా నెట్టబడతాయి. అలాంటి అనుబంధమే ఎందుకో గుర్తుకు తెచ్చుకోడానికి, గుర్తుకు రావడానికి కాలంతో పాటు ఇంత కాలం వేచి చూడాల్సి వచ్చిందేమో. ఊగుతున్న గతం తాలుకు వంతెనపై మనసుతో ఒక్కో అడుగును వేయిస్తూ.. అలా పదిహేనేండ్ల క్రితపు  హన్మకొండ పబ్లిక్ గార్డెన్ ని రోడ్ కి ఆనుకోనుండే గ్రంధాలయానికి ఎప్పటి లాగే అడుగు పెట్టా సాధారణంగా కుడి వైపు పత్రికల విభాగానికి ఎప్పుడో గాని వెళ్ళను నాకెందుకో ఆదివారం తప్ప ఏ రోజు పత్రికను చూడలేను. ఎప్పుడు మనిషిని మభ్య పెట్టె, భ్రమ పెట్టె, భయపెట్టే వార్తలు.. సమాజం లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యమే కాని ఎన్నో విపత్తులు మన మీదకు కూడా పొంచి వస్తున్నాయి అనే భయంకరమైన వార్తలంటే బొత్తిగా చిరాకు. అందుకే ఇక నా దోస్తులేమో అందులోకి దూరే వాళ్ళు నేనేమో మాసపత్రికలు పుస్తకాలుండే, నడుస్తుంటే నాకు సూటిగా ఎదురుగా చివరగా ఉండే విశాలమైన గదికి అలవాటు ప్రకారంగా చేరుకునే వాణ్ణి.. గదిలోకి చేరుకోగానే కుడి వైపు సంతకం దిద్ది ఎడం వైపు అందరిని దీక్షగా పరీక్షించే లైబ్రేరియన్ వైపు ఒక చూపేసి వెళ్లి పెద్ద పుస్తకాల అలమారా దగ్గరలో వెనక నుండి గాలి బాగా వీచే కిటికీకి వెన్ను చూపేల కూర్చొని తోచిన ప్రతి పుస్తకాన్ని గంటలకొద్దీ నమలడం అప్పట్లో అలవాటైన ఒక వ్యసనం..  ప్రతి రోజు లాగే ఆ రోజు కూడా పుస్తకాలన్నీ మూకుమ్మడిగా ముక్కున వేలేసుకొని కిక్కురు మనట్లేదు. వాటిని చూస్తున్న ప్రతి సారి ధ్యాన ముద్రలో ఉన్న జ్ఞాన సాధువులా  తలపిస్తాయి. వాటిని చూస్తున్నప్పుడల్లా సాధువులు ఎందుకు మౌనంగా నిశ్శబ్ధంగా ఉంటారో అర్ధమవుతుంది. ప్రపంచం అంత పుస్తకాలను దాస్తున్న ఆ అలమారలో ఉందేమో అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంటుంది. లోకం అంతా కూడా అరచేతిలో ఇమిడి వేలుతో తిప్పే ప్రతి పేజిలో బంది అయి నాతో ముచ్చట పెడుతుందని వింతగా మురిసేవాన్ని..

ఎప్పుడు నిశ్శబ్దం తొణికిసలాడే ఆ చోటులో కిటికి గుండా  వీచే గాలి కమ్మని సంగీతాన్ని తలపిస్తూ ఆ సవ్వళ్ళు మనసుని  పుస్తకాల్లోని లోకాలకు యిట్టే తీసుకెల్దుండే.. ఆ గదిలో ఉన్నంత సేపు ఎవరు ఎవరితో పెద్దగ మాట్లాడుకోకపోయిన రోజు కనిపించే వ్యక్తులు నోరు మెదపకుండా చిరునవ్వుతో పలకరించుకునే వారు. అలా చిరునవ్వు పలకరింపులో పరిచమైన వ్యక్తే శంకర్ ఆ పరిచయం గదికే అంకితం కాకుండా నా అడుగులు కూడా తనతో నెమ్మదిగా సాగేవి రోడ్ కి అవతల పబ్లిక్ గార్డెన్ ప్రహారి గోడకి ఆనుకొని కాలానికి తగ్గట్టుగా సీత ఫలాలు, కంకులు, పరికిపళ్ళు , గేగులు, మామిడి పళ్ళు, అలా గ్రామాల్లో నుండి బుట్టల్లో బండ్లల్లో తెచ్చి జామకాయలు కోసి ఉప్పు కారం చల్లి ఇచ్చే బండి కి, ఉడికించిన పల్లిలను పొట్లం కట్టి నిమ్మకాయ పిండి ఇచ్చే ఇంకో బండికి అటు పక్కనో ఇటు పక్కనో పెట్టుకొని అమ్మే వాళ్ళు. రోజు గ్రంధాలయం నుండి అడుగు బయట పెట్టడం ఆలస్యం ఏది కనపడితే అది కొనుక్కోవాలనే ఉండేది నాకు. ఎప్పటిలాగే జేబు ఎలాంటి బరువు లేకుండా చాల స్వచ్చంగా ఉండేది. శంకర్ జేబులో వారానికోసారి ఐదు రూపాయలనుండి ఇరవై రూపాయల వరకు ఉండేవి. అవి వారానికి సరిపడే విధంగా మేమిద్దరం  ఖర్చు పెట్టేవాళ్ళం. పండో లేక పల్లిలో కంకో ఏదో ఒక చిరు తిండి తీసుకొని గార్డెన్ లోకి అడుగు పెట్టి కర్ర పట్టుకొని ముందుకు అడిగేస్తున్నట్టు కనిపించే తెల్లని గాంధీ విగ్రహం దగ్గర మెట్ల మీద కూర్చొని నెమ్మదిగా లాగించేవాళ్ళం. అప్పుడప్పుడు గార్డెన్ కమ్యునిటీ హాల్ లో రాజస్థానీ మేళాలు జరుగుతుండేవి జరుగుతున్న రోజుల్లో ఎక్కువ సేపు అక్కడే గడిపే వాళ్ళం. శంకర్ బహుశ నా కన్నా వయసులో కాస్త పెద్ద వాడు ఎక్కువగా పుస్తకాలతో గడుపుతూ పొద్దున్న ఇంటింటికి పేపర్, పాల ప్యాకెట్లు వేస్తుండడం ఇక పరిక్షల సమయంలో పరీక్షా సెంటర్స్ లో ఏదో ఒక సెంటర్ దగ్గర ఎంసెట్ ఈ సెట్ కోచింగ్ సెంటర్ల కరపత్రాలు నలబై రూపాయలకోసం సూర్యుడు ఈ పక్కనుండి ఆపక్కకి ఒదిగే వరకు అక్కడక్కడే తిరుగుతూ అందరి చేతుల్లో పెడుతుండే వాడు. బహుశ సమాజంలో మెలగగలగడం బ్రతకగలగడం అప్పటికే అలవాటయ్యిందేమో ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా ప్రపంచానికి దూరంగా తన ఆలోచనలు ఉండేవి. డిగ్నిటీ పేరుతో మనుషుల్ని మషిన్లు గ మార్చే రోజులు అప్పుడే కొత్తగా మొదలవుతున్నాయి. ఆ తరుణంలో నాకు శంకర్ ఒక ఆదర్శం. ఏ పని చేసిన దానికి గౌరవం ఇవ్వాలని మన చుట్టూ ఉన్న చిన్నా చితక కార్మికుల నుండి బడా వ్యాపారాలు ఉన్నతాధికారులు ప్రతి ఒకరు కూడా కష్టపడి పని చేసుకుంటూ చేసే పనిలో ఆనందం వెతుక్కుంటున్నారు. అందులో తప్పేముంది అంటూ ఒకరికి హాని కలిగించని ఏ పనైనా ఇష్టంగా చేసేవాడు వచ్చిన ప్రతిఫలాన్ని కళ్ళు  పెద్దవిగా చేసి చూసుకుంటూ మురిసిపోయేవాడు. ఇక మా ఇద్దరికి చెడు అని ముద్రేసుకున్న ఏ అలవాట్లు లేకపోవడంతో చాల ధైర్యంగ గర్వంగా ఉండే వాళ్ళం. సమాజం గుర్తించ తగ్గ చదువు లేక పోయిన మానవత్వానికి సరిపడా సంస్కారం మనిషిని అనిపించుకోగలిగే సభ్యత తనకి మెండుగా ఉన్నాయి. తన మాటలు ఎప్పుడు ఉత్తేజితంగా ఉండేవి మంచి మనసుతో ప్రపంచాన్ని గెలిచేయ్యోచ్చు అనే గట్టి నమ్మకం నాలో బహుశ తన సాంగత్యంలోనే అలవడిందనే చెప్పుకోవాలి.

ఒకరోజు పబ్లిక్ గార్డెన్ లో నేరెళ్ళ వేణుమాధవ్ కళ ప్రాంగణం లో జీవ హింస మహా పాపం పేరుతో శాకాహారం ప్రాముఖ్యతను తెలియచెప్పే మహత్తర కార్యక్రమంలో నాకు శంకర్ కి లక్ష్మి పరిచయం అయ్యింది ఆ పరిచయం తరువాత శాకాహార నినాదం వాడ వాడ ల స్కూల్ కాలేజీ స్టూడెంట్స్ తో నిర్వహించిన ర్యాలి లో పాల్గొన్నాం. అంతా అయ్యాక నాలుగు రోజుల తరువాత యధావిధిగా లైబ్రరీ ధాటి గార్డెన్ లోకి వెళ్ళగానే లక్ష్మి కనిపించింది. అప్పటి వరకు నేను గమనించిన అమ్మాయిల్లో కన్నా కాస్త పరిణితి చెందిన ఆలోచన విధానం తన మాటల్లో కనిపించడంతో నాకన్నా పెద్దావిడ అనే భావన పడిపోయింది అందుకే ఇక తన పేరుకి గారు తగిలించి మాట్లాడడం మొదలయ్యింది.

ఎంత చేసిన మాంసాహారం ఎంత పాపమో ప్రజలకి తెలియట్లేదు అని వాపోతుంటే దానికి శంకర్ మనం చేయగలిగింది మనం చేస్తాం. ఏ ఉద్యమానికైనా ఫలితం వెంటనే రావాలనుకోవడం మన అమాయకత్వం. ప్రపంచానికి మంచి చేసేవాడు ఆ మంచిని ముందు మనం మన చుట్టూ అలవరుచుకోవాలి. బహుశ నన్ను మాంసాహారం నుండి బయటపడేసిన అనేక ప్రేరెపనలో ఇది కూడా ఒక కారణమే. నడుం బిగించి ఎంత కష్టపడిన ఇన్ని సంవత్సరాలైనా నా కుటుంబం లో నా మిత్రుల్లో ఒక్కరిని కూడా పూర్తి శాకహారిగ మార్చలేకపోయాను. ఆ టైం లోనే కరాకండిగ ఒక నిర్ణయం తీసుకున్నాం ముగ్గురం. ఎవ్వరిని మార్చలేక పోయిన మనం మంసాహరులుగా మారకుడదని. ఆ శపథం మాట పక్కన పెడితే నను పూర్తి శాకహారిగా మార్చిన బలమైన ప్రేరేణ మాత్రం వేరే చోట కలిగింది.

లక్ష్మి తాను మెడిసిన్ చేయలనుకునేది. నాన్న డాక్టర్ చాల స్వతంత్రురాలు అభ్యుదయ భావాలు ఎక్కువగా ఉండేవి. ఇంచుమించి శంకర్ లక్ష్మి ఆలోచనలు చాల పరిణితి చెంది ఒకేలా ఉండేవి. కాలం తో పాటు ఎవరి కాలంలో వాళ్ళం బిజీ ఐపోయీ రోజు కాకపోయినా వారానికో పది రోజులకో కలుసుకునే వాళ్ళం.

ఆ రోజు సాయంత్రం శంకర్ నేను అశోక టాకీస్ రోడ్ మీద మంచి మంచి సీనరీలున్న పోస్టర్లు అమ్మే చోటుకి చేరుకొని చెట్లు చేమలతో కళకళ లాడే అందమైన దృశ్యం ఉన్న పోస్టర్ ఒకటి ఐదు రూపాయలకి కొని చౌరస్తా లో పెద్ద కాలువ పక్కన జుబైర్ బుక్ స్టాల్ కి ఆనుకొని ఉన్న ఫ్రేములు తాయారు చేసే దుకాణం లో పదిహేను రూపాయలిచ్చి ఆ పోస్టర్ ని కార్డు బోర్డ్ ఫ్రేం తయారు చేపించి బుక్ స్టాల్ లో దొరికే మెరిసిపోయే గిఫ్ట్ ప్యాక్ కవర్తో చక్కగా ప్యాక్ చేసి దాని పైన ఒక పేపర్ అతికించి మరుసటి రోజు ఆదివారం ఉదయం ఆరు గంటలకి నేను శంకర్ పబ్లిక్ గార్డెన్ లో రోడ్ మీద లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉండగా తను వచ్చింది. చేతిలో ఉన్న గిఫ్ట్ ని తన చేతికందిస్తూ హ్యాపీ బర్త్ డే లక్ష్మి అన్నాడు. తనతో పాటే నేను కూడా వంత పాడాను. పైన అతికించిన కాగితం మీద హ్యాపీ బర్త్ డే అనే పదాలు రాసి ఇట్లు శంకర్ అని రాసిచ్చింది నేనే..

 

ఇక అక్కడినుండి మా ముగ్గిరి ప్రయాణం చిన్న గ్రామం లోకి.. తన తో ఒక బాగ్ తెచ్చుకుంది ఆ బ్యాగ్ తీసి మా ముందు పెట్టింది నాకెప్పుడు తిండి ధ్యాసే బర్త్ డే కదా తినడానికి ఏమైనా తెచ్చిందేమో అనుకున్న తీర చూస్తే బ్యాగ్ నిండా చింత గింజలు, సీత ఫలం గింజలు దాదాపు రెండు మూడు కిలోలుంటాయి. నాకు అర్ధం కాలేదు. మా ఇద్దరి చేతుల్లో పెడుతూ తను ఒక చేత్తో తీసుకొని అల నడుచుకుంటూ దారికి ఇరువైపులా విసురుకుంటూ ఒక నాలుగు కిలో మీటర్లు నడిచాక గాని గింజలు విసిరేసే మా ఆట ఆగలేదు. అప్పుడు చెప్పడం మొదలు పెట్టింది ఇప్పుడు మనం విసిరినా కొన్ని వందల గింజల్లో ఒక మూడు చెట్లు మొలకెత్తిన చాలు కొంత మందికి నీడనిస్తుంది ఆ నీడకు ఒకప్పటి మనమే కారకులం అనే త్రుప్తి. అందుకే మీతో ఈ ఆట ఆడించాను అంది. ఆ రోజు తో నాకు తెలియని మరో లక్ష్మి కనిపించింది.

అలా మా పరిచయం కొనసాగుతున్నది.

 

ఓ రోజు నన్ను శంకర్ ఎం జి ఎం హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు అక్కడ కొందరు  రోగులు పడి ఉన్నారు. తీర వాకాబు చేస్తే కల్తి సార తాగి ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తనకు తెలిసిన పరిచయమున్న  తన దోస్తులని కూడా తీసుకొచ్చాడు వారందరి సహాయంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ ఎనిమిది మందిని ఒక గదిలో వరసగా పడుకోబెట్టి డాక్టర్లచే వైద్యం అందిస్తున్నారు. శంకర్ మరో పదిహేను మంది కలిసి హాస్పిటల్ బయట రోడ్ మీద కల్తి సారా అమ్ముతున్న వాళ్ళని ప్రబుత్వం శిక్షించాలి అనే ఫ్లై కార్డ్ లు వెంటనే తయారయ్యాయి. గట్టిగ అరుస్తూ నినాదాలు చేస్తున్నారు. వచ్చే పోయేవాళ్ళు మా చుట్టూ మూగారు కాసేపట్లోనే దాదాపు రోడ్ మొత్తం జనాలతో కిక్కిరిసింది. దానికితోడు కుల సంఘాల రాజకీయ నాయకులు కొందరు వచ్చారు ఉద్యమం లో ప్రసంగించారు. జరుగుతున్న తతంగంలో ఎవరో వచ్చి చెప్పారు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని. నేను శంకర్ ఆ గదిలోకి వెళ్ళాం. అప్పటికే జనాలు కిక్కిరిసిపోయారు వారి వారి బంధువులతో. చాల సేపు చూసి శంకర్ బయటికొచ్చాడు. తన వెంటే నేను కూడా హాస్పిటల్ కి దూరంగా వెళ్ళాం నిశ్శబ్దంగా నడుస్తున్నాం. చనిపోయిన వారిని దగ్గరగా చూడడం అదే మొదటి సారి ఆ ఏడుపులు నాకు భయంగా అనిపించాయి. అందుకే నేను కూడా ఏమి మాట్లాడలేక పోయా. శంకర్ ఏడుస్తున్నాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. పిచ్చిగా అరుస్తున్నాడు నాకు ఎం చేయాలో తోచట్లేదు. దగ్గరికొచ్చాడు నా కళ్ళలోకి చూస్తూ చచ్చిన వాళ్ళలో మా నాన్న ఉన్నాడు అని నను దగ్గరికి తీసుకొని ఏడుస్తున్నాడు. నాక్కూడా ఏడుపు ఆగలేదు. నా తల్లి ఎప్పుడు చనిపోయిందో తెలిదు మాటలు రాని ఈ ముసలోడే నన్ను పెంచాడు. ఇప్పుడిలా వెళ్ళిపోయాడు. అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.

కాసేపటికి ఒక్క శవం తప్ప మిగతావన్నీ గది కాలి అయ్యాయి. బయట ఉద్యమం నెమ్మదిగా సద్దు మణిగింది మేము దూరం నుండే గమనిస్తున్నాం. రాజకీయ నాయకులూ గాని పోలీసులు గాని ఎవరు ఎం చేయట్లేదు అంత నిశ్శబ్దం యధావిధిగా రోడ్ వచ్చి పోయే వాహనాలతో మల్లి రద్దీ అయ్యింది. పేపర్ వాళ్ళు శవాన్ని నాలుగు వైపులా నుండి ఫోటోలు తీసుకున్నారు. పాపం శంకర్ జేబులో డబ్బులు లేవు ఎం చేయాలో తోచక దగ్గరికి కూడా వెళ్ళలేదు. హాస్పిటల్ వాళ్ళు లోపలికి తీసుకెళ్ళారు. ఆ తరువాత ఎం జరిగిందో నాకు శంకర్ కి ఏమి తెలియదు ఇప్పటికి.

 

ఈ సంగటన జరిగిన చాల కాలానికి మళ్ళీ కలిసాం ముగ్గురం లక్ష్మి కి సంగతి తెలిసినట్టుంది చాల బాధ పడింది. అప్పటికే ఒకరికొకరు మానసికంగా దగ్గరయ్యరనిపించింది. తనకని ఎవరు మిగలని శంకర్ కోసం లక్ష్మి ఉండడం నాకెంతో ఆనందం వేసింది. ఇద్దరికీ కూడా ఎవరికీ వారు ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో వారికి ఒక స్పష్టత ఉంది. వారిరువిరి నడుమన ఉన్న ప్రేమ బహుశ సమాజానికి అర్ధం కానిది అర్ధం చేసుకోలేనిది. అందుకేనేమో వారిరువురి అందరికి దూరంగా ఉంటారు. రెండేళ్ళ పరిచయం వారిని జీవితాంతం కలిసుండగల నమ్మకాన్ని శక్తిని ఇచ్చింది.

 

ఆ రోజు మధ్యాహ్నం పద్మావతి ఎక్స్ప్రెస్స్ మరి కొద్ది సేపట్లో ప్లాట్ ఫాం కి వస్తుందనగా నేను శంకర్ ఆటో లో వరంగల్ రైల్వే స్టేషన్ కి చేరాం. అప్పటికే లక్ష్మి శంకర్ కోసం టికెట్ తీసుకుంది. మేము కలిసి బతకాలి అనుకుంటున్నాం. అందుకే దూరంగా వెళ్దామనుకుంటున్నాం.  మా ప్రేమని అర్ధం చేసుకునే విశాల హృదయం ఎవరికీ లేదు అలాంటి చోటులో మేముండలేము. అనే మాటతో లక్ష్మి శంకర్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఇద్దరు ట్రైన్ ఎక్కారు. ట్రైన్ లో వెళుతున్న రెండు హృదయాలతో నా హృదయాన్ని పరుగులు పెట్టించి ట్రైన్ వెళ్ళిన చాల సేపటి వరకు నేనక్కడే కూర్చుండి పోయా.

 

చాల కాలం తరువాత నను చేరిన ఉత్తరంలో

ప్రేమించడం ఆనందం… ప్రేమింపబడడం మహదానందం… అనే పరిచయ వాక్యాలతో ఆ లెటర్ మొదలయ్యింది. నను రమ్మని ఆహ్వానం. వెంటనే తిరుపతికి ప్రయాణం. ఒక రేకుల గదిలో ఉన్నారు. శంకర్, లక్ష్మి చదువు కోసం తను తిరుపతికి రాగానే చూసుకున్న పని చెప్పులు కుట్టడం అదొక్కటే వాళ్ళ నాన్న తనకి వెన్నకన్న ముందు పెట్టిన విద్య. అలా మొదలు పెట్టి ఆ పని ఈ పని అని కాకుండా దొరికిన ప్రతి పని చేస్తూ లక్ష్మిని చదివించాడు అతి కష్టం మీద లక్ష్మి తాను అనుకున్నట్టుగా మెడిసిన్ పూర్తి చేసింది. చివరగా నాకు తెలిసినప్పటికీ తిరుపతి నుండి వారి మకాం పూరి క్షేత్రానికి మారిందని దేవుడి దయవల్ల ఏ లోటు లేదని. పూరి లో ఎక్కడున్నారో అనే సంగతి ఇప్పటికి తెలియలేదు. జీవితం లో మళ్ళీ నాకు కలిసిన కలవక పోయినా వారి ప్రపంచంలో మహదానందం గ ఉంటారని తలుస్తున్న…

 

నిజమే ప్రేమించడం ఒక ఆనందం ప్రేమింప బడడం మహదానందం మనం ఎంతో మంది ప్రేమికులని చూసాము. కాని ఈ జంట మాత్రం నాకు ఎప్పుడు ఆదర్శమే నాకే కాదు అందరికి

ఎందుకంటే శంకర్ కి చిన్నప్పుడే పోలియో వచ్చి కుడి కాలు చచ్చు పడి పోయింది. కర్ర సహాయం లేకుండా నడవలేని పరిస్థితి.. తనని అవయవంతో కాక మనసుతో అర్ధం చేసుకొని తనతో జీవితం సాగించడానికి సిద్దపడి కలిసుంటున్న లక్ష్మికి హాట్స్ ఆఫ్.. లక్ష్మి కోసమే జీవిస్తున్న నా మిత్రుడు శంకర్ కి హాట్స్ ఆఫ్..   

 

వారి చివరి సారి కలిసినా సన్నివేశం తరువాత సాగినా నా పదేళ్ళ ప్రస్తానం లో

ప్రపంచం మనుషుల్ని మిషిన్లుగా మారుస్తూ అనుబంధాల అత్మీయతలను సైతం డబ్బుతో కొలుస్తూ సున్నితత్వానికి అర్ధం మారిపోయిన ఈ సమాజం లో నా ఈ మనసుని మనసుతో ప్రేమించే మనసులు నా కోసం ఇంకా మిగిలే ఉన్నాయంటూ ఆత్మీయుల్ని ఈ ఫేస్ బుక్ కల్పించిది. ఇదే ఫేస్ బుక్ వాళ్ళని కూడా కల్పిస్తే ఎంత బావుండు.

 

వచ్చే నెల ఫోటోగ్రఫీ పుణ్యమా అని ఓ పెళ్లి షూట్, ఓ క్యాలెండర్ షూట్ కోసం పలాస వెళ్తున్నాను. అక్కడి నుండి నా ప్రయాణం పూరి, కోణార్క్, చిలికా లేక్.. చూడాలి పూరి వరకు వెళ్తున్న వారిని కలిస్తే మహదానందం కలుసుకోలేక పోయినా మనసులో వారి జ్ఞాపకాలు చెదరకుండా పదిల పరుచుకుంటూ…

Categories: కథనం

పోస్ట్ మాన్

December 5, 2012 Leave a comment

ఈ మధ్య కాలం లో చాల రోజుల తర్వాత ఫేసుబుక్ మిత్రుని (మహేష్ కుమార్ కత్తి) పుణ్యమా అని రెండు అందమైన లఘు చిత్రాలు చూడగలిగాను. ఒకటి అద్వైతం(తెలుగు) రెండు పోస్ట్ మాన్ (తమిళం). ఈ రెండు నన్ను చాల అమితంగా ఆకట్టుకున్నాయి.

పోస్ట్ మాన్ చిత్రం విషయానికొస్తే ఓ అందమైన గ్రామం లో ఆత్మీయ సందేశాలను చేరే వేసే ఓ ఇంటివ్యక్తిగా పరిగణించే పోస్ట్ మాన్ కథ. ఇంటింటికి వెళ్లి వారి ఉత్తరాలను చేర  వేస్తూ. వారి వారి జీవితాల్లో సుఖ దుఖాలను  పంచుకుంటూ కాలం వేల్లదిస్తున్న తరుణంలో సమాచార సాంకేతిక విప్లవం తన గ్రామాన్ని సాశించింది ఫోన్ రూపం లో. ఇప్పుడు గ్రామా పెద్ద కాడి నుండి. కిరణం కొట్టు వరకు అందరు ఫోనే. దుబాయి లో ఉన్న భర్తతో క్షణం లో వయ్యారపు చిలిపి కబుర్లను పక్క పక్కనే కుర్చుని సాగిస్తున్న అనుభవాన్ని తీసుకొచ్చిన ఫోను ప్రభావం తో ఇక  ఉత్తరం  అనే కాగితం ముక్క చిత్తు కాగితాలతో నేస్తం కట్టింది.. గ్రామస్తులే తన జీవితం అనుకున్న పోస్ట్ మెన్ ఇక ఎవరికీ అక్కరలేకుండా పోయాడు.

ఈ చిత్రం చూస్తున్న కొద్ది. నన్ను నా చిన్ననాటి జ్ఞాపకాల సంద్రం లోకి నెట్టింది.

నేను పుట్టి పెరిగిన కాపువాడ(హనుమకొండ) లో అట్లేస్ సైకిల్ (పెద్ద సైకిల్ అని పిలిచేవాళ్ళము) మీద బెల్లు మోగిస్తూ కాకి బట్టలతో హేండిల్ పై ఉన్న కరెల్ కు నలబై పై చిలుకు ఉత్తరాలని  బిగించుకొని “పోస్ట్” అంటూ శబ్దం చేస్తూ వెళ్తుండేవాడు చిన్న నాటి నా జ్ఞాపకాల్లో ఈ మా పోస్ట్ మెన్ మమయ్యది చాల గొప్ప పాత్రా వహించాడు.

మా ఇంటికి ఆనుకొని ఇద్దరు వ్యక్తులు పట్టే చిన్న సందు ఉండేది. ఆ సందు చివరి ఇంట్లో చింతకింది రాజమ్మ వాళ్ళు కొత్తగా కట్టుకున్న బంగాలలో కాలిగా ఉన్న గదిలో మా అమ్మ చెల్లెలు శ్రీకల  చిన్నమ్మ – భర్త రాజన్న బాబాయి వాళ్ళ దోస్తు “రాజమౌళి LLB ” హనమకొండ లో ఉండి చదువుకోవాలనే ఉద్దేశం ప్రకారం ఆ గది ని కిరాయికి తీసుకున్నారు. మా అమ్మ పెద్ద చదువులు చదువుతున్నా వాళ్ళతో కలిసి చదువుకుంటే అన్ని సంగతులు తెలుస్తుయి అని చెప్పి స్కూల్ నుంచి రాగానే నన్ను మా అన్నయ (వేణు) ఇద్దరని ఆ గదికి తోలేది.

నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే అప్పటి వరకు నన్ను ఎవరితో అడుకోనివ్వకుండా బయటికి అడుగుపెట్టనివ్వకుండా ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటనో అని బయపడుతుండేది అలాంటిది తను ఇలా పంపివ్వడం. నేను అనుకునే వాడిని అందరికి తగలని దెబ్బలు నాకు మాత్రమే తగులుతాయ అని. ఒకసారి అమ్మ చెప్పింది నేను పుట్టాక నాలుగు సంవత్సరాలవరకు ఏడుస్తున్నప్పుడు ఊపిరి పట్టేవాడినని స్పృహ కోల్పోయి పది నిమిషాలవరకు ఉలుకు పలుకు లేకుండా ఉండేవాడినని. అల నాకు చాల సార్లు జరగడం తో నన్ను క్షణం కూడా తన ఓడిలోనుండి వేరుచేయకుండా ఏడుపు అనే క్షణాన్ని నా ధరి చేరనివ్వకుండా చాల జాగ్రతలు తీసుకునేదని. డాక్టర్ లు కూడా బయపడేవారట నాకు ఇంజక్షన్ ఇవ్వాలంటే. ఈ విషయం తెలుసుకున్నప్పటి నుండి నాకై నేను తన మనసుని ఇబ్బంది పెట్టె పనులు చేయకూడదని తను చెప్పినట్టే నడుచుకునే వాణ్ణి. మా ఇంటి ముందు పొడుగ్గా, పెద్ద వారైతే నలుగురు చిన్నవారైతే ఆరుగురు కుచునేందుకు వీలుగా గద్దె (అరుగు) ఉండేది. పక్కింటి శీను, మహేశు, శారద, ఆ ఇంటిపక్క సంబరాజు, ఎదురింట్లో బేబీ మా ఇంటి కుడి సందు మీనయ్య మనవళ్ళు కిరణ్, కిషోర్, రాజు. అందరు మా ఇంటి ముందు రోడ్డు మీదే రక రకాల ఆటలడుతుంటే ఆ గద్దె మీద కూర్చొని చూస్తుండే వాణ్ణి. ఆ గద్దె మిధ కూర్చోవడానికి పర్మిషన్ కూడా నా  రెండో తరగతి లో వచ్చింది. అప్పటి వరకు ఏమి తెలియని నాకు అమ్మ ఆర్డర్ శిరసావహించి గదికి వేల్లనరంభించాను.

రాజమౌళి మామయ్య గదిలో ఇంకా తన ఫ్రండ్స్ పేర్లు తెలియదు కానీ ఇద్దరుండే వారు.  ఆ గది లో ఉన్న వారి సహచర్యం నాకో కొత్త విషయాలను నేర్పించే ఓ మంచి పుస్తకం ల తోచింది. ఆ గది కేల్లడం Home  Work పూర్తి చేసుకోవడం. ఆ పక్కనే వారు గీసిన బొమ్మల్ని చూడడం. పెద్ద పెద్ద పుస్తకాలని తిరగేయడం. ఇది నా పని. గది లో ఉన్న వారికి ఒక్కొక్కరి చొప్పున వారానికి నాలుగైదేసి ఉత్తరాలని పోస్ట్ మాన్ మామయ్య తీసుకొచ్చేవాడు.

నా కోసమని చందమామ కథల పేరుతో ఉన్న పుస్తకాన్ని చదువుకోమని ఇచ్చేవాడు. అందులో ఉన్న కలం స్నేహం శిర్షిక కంటే పడే వరకు కూడా నాకీ ఉత్తరాల గొడవ తెలిసింది కాదు. రాజమౌళి మామయ్య ప్రోత్సాహంతో, వీక్లీ, మంత్లి, బుక్స్ లో నా వయసు ఉన్న వారందరికీ కలం స్నేహం పేరుతో రాసేవాన్ని. చారణ పోస్టు కార్డులు నాకోసం ఇచ్చేవాడు. బహుశ ప్రపంచం తో ఎలా సంబాశించాలో నేర్పించింది తనే అనుకుంట. అల మొదలయ్యింది పోస్ట్ మెన్ మామయ్యతో నా అనుబంధం.

ఎక్కడో తెలియని వ్యక్తులతో కొత్తగా స్నేహం కుదిరింది. మధురానుభూతుల అనుభవాలు మంచి కబుర్లు మరెన్నో విషయాలను క్యారేల్కు బిగించుకొని నాకోసం రెండ్రోజులకోకసరైన స్కూల్ కి గాని ఇంటికి గాని నాయన రఘు అంటూ అందించేవాడు. ఒక్కోసారైతే ఏ పెద్ద సైకిల్ బెల్లు మోగిన పోస్ట్ మెన్ మామయ్య కావచ్చు అని పరుగెత్తుకొచ్చి బయటకి తొంగి చూసేవాన్ని..

ఈ మా పోస్ట్ మెన్ మామయ్య రాజమండ్రి శీను, పార్వతీపురం రమేషు, అనంతగిరిలోని రాము, రాజశేకర్, వంశీ, సుభాషు, కరీంనగర్ మధు, శ్యామల, ఖమ్మం సుశీల, హైదరాబాదు కిరణ్, రాంబాబు, సురేష్, పీటర్ (ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు అవ్వుద్ది ) వారందరి సాన్నిహిత్యం కోసం నన్ను తనపై ఆధారపడేలాగా  చేసుకున్నాడు..

చాల సంవత్సరాలు గడిచాక తీపిగుర్తుల మధురజ్ఞాపకాల సంపదని పాత పుస్తకాల సంచిలో బద్రంగా మా ఇంట్లో ముందు గది సేల్ఫుల్లో చివరి దాంట్లో దక్కున్నాయి..

ఉత్తరాలు రాయడం తగ్గించి బొమ్మలు గీయడం లో మనసు లగ్నం చేశాను. ఇంకా ఇంట్లో కరెంటు లేదు అందుకే చాల సమయం రాజమౌళి మామయ్య గదిలో గడిపేవాణ్ణి.

ఆ టైం లోనే పబ్లిక్ ఫోన్ మా స్కూల్ పక్కన వెలిసింది. అల వచ్చిందో లేదో ఉజిలిబేసు, జెండా కాడ, గుండం వాడలో, కట్ట దగ్గర, ఎక్కడ చూడు టెలిఫోన్ బూత్ లు వెలిసాయి. నలబై యాబై ఉత్తరాలతో నిండి ఉండే పోస్ట్ మెన్ మామయ్య సైకిల్ క్యారెల్ కాస్త పది పర్కతో కనిపించడం మొదలు పెట్టింది. రోజు నవ్వుతు చలాకి గ కనిపించే పోస్ట్ మెన్ మామయ్య ఎప్పుడో వారానికోసారి కనపడ్డం మొదలు పెట్టాడు.

యధ్రుచికం గానే నాదగ్గర కూడా ఫోన్ నెంబర్ ల చిన్న బుక్ ఒక్కటి నాతో పాటే ఉండసాగింది, రోజులు గడుస్తున్న కొద్ది వద్దనుకున్న ఇది నాకు అవసరం లేదు అని అనిపించినా వచ్చి వాలాయి సెల్లు ఫోను, మెయిల్ అక్కౌంట్లు, స్క్రాఫ్ బుక్స్ లు, ఫెసుబూక్ గ్రూప్ లు, ఫ్లిక్కర్ చిత్రాలు..

నా చిన్నప్పుడు కలం స్నేహం మిత్రులు ఒక యాభై ఉన్నారంటే ఎంతో గొప్ప ధైర్యం మరియు మంచి అనుభూతి కలిగించేది. మరి ఇప్పుడో అక్కౌంట్లో ఫ్రెండ్స్ లిస్టు లో ఎంత ఎక్కువ ఫ్రండ్స్ ఉంటె అంత పబ్లిసిటీ, హోదా అందరితో పెద్దగా సంబశించేది లేకపోయినా పేరుకు మాత్రం ఫ్రెండ్స్ లిస్టు లో ఫ్రెండ్స్ పెరుకుపోతునే ఉంటారు.

అబ్బ… నాలుగు వేల ఐదు వందలేన ఫ్రెండ్స్ లిస్టు కెపాసిటీ అని విసుక్కుంటూ మరో అక్కౌంట్లు ఓపెన్ చేసుకుంటున్న సహా మిత్రులూ.. చాలానే ఉన్నారు..

మనిషి మార్పుని కోరుతూ అడుగులేస్తున్న తరుణం లో పాతా విషయాన్నీ మరవడం సహజమైపోతుంది.

ఎంత సహజం అంటే ఈ మీడియా నెట్వర్క్ గ్రూప్ ల ధాటికి పోస్ట్ మేనా అంటే ఎవరు?

ఓ! లేట్ మి చెక్ ఇన్ వికీపీడియా అనే రోజులు వచ్చిన ఆశ్చర్యం లేదేమో..

***

Short movie link : http://youtu.be/VU3iiKQY_9M