Home > ప్రయాణం > నా డైరీ లో ఓ చాప్టర్ – పాండిచెర్రి

నా డైరీ లో ఓ చాప్టర్ – పాండిచెర్రి

చాల కాలం తర్వాత ఎక్కడికైనా వెళ్లి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్న తరుణం లో హైదరాబాద్ వీక్ ఎండ్ షూట్స్ ఆధ్వర్యం లో ఫోటోగ్రఫి ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది.

ఫ్రెంచ్ దేశపు సంప్రదాయం, తమిళ వంటకాల గుబాళింపులు, అంతకు మించిన సముద్ర తీరం, చక్కని ప్రశాంతత, ఇవ్వన్నిఒక ఎత్తైతే, ఒంటరిగా “నేను వేరు ప్రపంచం వేరు” అని భావించే నా మనసుకు మొదటి సారి కొందరి వ్యక్తులతో అది నాకు నచ్చి నేను మెచ్చే ఫోటోగ్రఫిని ఇష్టపడే వ్యక్తులతో కలిసివెల్తున్నాననే బలమైన కారణాలు నన్ను కూడా పాండిచేరి (పుడుచెరి) ప్రాంతానికి వెళ్ళడానికి ఉసిగొల్పాయి.

శుక్రవారం సాయంత్రం చార్మినార్ ఎక్ష్ప్రెస్స్ లో ప్రయాణం అని నాగరిగిరి కిషోర్ చెప్పడం తో ముందు రోజే కావాల్సిన (చాల తక్కువ బరువు ఉండేలా చూసుకోవడం నాకు ముందునుండే అలవాటు ఈసారి కూడా కేవలం  భుజాలకు వేసుకొనే ఒక్క బాగ్ లోనే కెమేరాతో పాటు బట్టల) లగేజ్ సర్దుకున్నాను.

19th Aug 11 – Friday :

యధావిదిగానే ఆఫీసుకు చేరుకున్నాను. అడపాదడప ఉండే పనులతో మధ్యాహ్నం రెండు దాటింది. అప్పటికే వర్షం తన ప్రతాపాన్ని చూపడం తో కొంచెం గుబులుతో కూడిన దిగులు కలిగింది. మూడు గంటల ప్రాంతానికి ఎక్కడ లేని పనోక్కటి బాస్ నా నెత్తిన పెట్టడడం తో గంట సేపు ఎక్సెల్ లో కుస్తీలు పడి పూర్తి చేశా. అప్పటికే వికాస్ మొండెదుల రెండు మూడు సార్లు కాల్ చేసి

ఏమైంది బాబు ఎక్కడున్నావ్ అంటూ అవతలినుండి ప్రశ్న.

పని అనే సాలేడు వలలో చిక్కుకున్నాను. వలను దాదాపు తెంపేసుకోవడం ఐపోయింది. ఇక బూజుని దులుపుకొని రావడమే ఆలస్యం అని చెప్పి త్వరగా పని ముగించుకొని, మా ఆఫీసు కుడి పక్క KFC ని అనుకోని ఉన్న రోడ్ లో రెండో ఎడమ వైపు వీధి సందులో వికాస్ రూం కి చేరుకొన్నాను. అప్పటికే తార్నాక నుండి జొన్నలగడ్డ రాకేశ్ ఫోన్ చేసి నేను సికింద్రబాద్ రైల్వే స్టేషన్ కి బయల్దేరాను స్టేషన్ బయట రేతిఫైల్ బస్సు స్టాప్ దగ్గర వెయిట్ చేస్తాను అని.

వికాస్ దగ్గరికి చేరుకోగానే కెమెరా, లాప్ టాప్, లేన్సేస్, డ్రెస్సులతో ఓ అతి పెద్ద బాగ్ సిద్దం చేసుకున్నాడు. ట్రైపాడ్ ఒకటి చేతిలో పట్టుకొని హడావిడిగా ఆటో లో ఐదు గంటల ప్రాంతాన బయల్దేరాం. ట్రాఫిక్ చెధను చీల్చుకుంటూ సాగిన మా ప్రయాణంతో ఆరున్నర ప్రాంతాన చేరుకున్నాం సికింద్రబాద్ స్టేషన్ కి.  

నాంపల్లి లో ఎక్కిన కొందరు, సికింద్రబాద్ లో మేము మిగతా వాళ్ళం రెండు మూడు స్లీపర్ గూడుల్లో అడుగుపెట్టాము. నాతో పాటు ఇరవై మంది. కొందరిది హైదరాబాద్ అయితే మరికొందరు వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన వ్యక్తులు అందరుకూడా సరైన సమయానికి చేరుకోవడానికి చాల కష్టపడినట్టు కనిపించింది. ఒకరిద్దరు తప్ప అందరుకుడా పాతిక నుండి ముప్పై లోపు యువతీ యువకులం, కావలసిన భోజనపు సరుకులతో మాకు కేటాయించిన బోగిల్లో కూర్చున్నాం. మెల్లిగా కదిలిన చార్మినార్ రైలు తో పాటు, ప్రయాణం అయ్యాయి మా ఆలోచనలు పాండిచేరి అందాన్ని ఊహిస్తూ.

నా పేరు రఘు మందాటి అని ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ చంద్ర శేకర్ సింగ్ వారి సతిమని, కిషోర్ నగరిగిరి వారి సతిమని, శివ శంకర్ రావు, వికాస్ మొండెదుల, హేమంత్, రాకేశ్ జొన్నలగడ్డ, దర్శన్ ఖన్నా,  హర్ష మిట్టల్, చైతన్య, సంగీత, విజయ్ బండారి, సందీప్ వేముల, ఆశిష్ నూకల, వంశీ ఆర్థం, సతీష్ లాల్ అందేకర్, నాగరాజు, అవినాష్ కాలే.

మూడు బోగిల్లో వ్యక్తులమంత ఒకే చోట చేరి ఒకటే అల్లరి కేరింతలు, పాపం వయసుమరిచి చేసిన మా కేరింతలు పక్కవారికి కాస్త ఇబ్బంది కలిగించిన కాసేపటిలో అందరు ఎంజాయ్ చేసారు.

నేను మాత్రం వీడియో కెమెరాను మెడలో వేసుకొని అందరి హావభావాలను రికార్డు చేస్తూ, ఎప్పటిలాగే ప్రతి ఒక్కరిని లోతుగా గమనించడం మొదలు పెట్టాను. ఎన్నో చిత్ర విచిత్ర విషయాలు నా మనసును దోచాయి. ఒక్కొక్కరి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ప్రతి ఒక్కరు తమ మనసు మాటకు విలువ ఇచ్చి తమ మనసుకు ఆనందం కలిగించే విషయం కోసమే ఆరాటపడడం. ఇరుకు జీవితపు రణగోణ కాలం లో ఒక్క రోజైన మనసుకు నచ్చే విధంగ ప్రశాంతంగా గడపాలనే కోరిక వారందరిలో కనిపించింది.

బయటికి అందరితో కలివిడిగా ఉన్న అంతరంగాన ఎన్నెన్నో మధుర భావాలతో కూడిన సృజనాత్మకమైన ఆలోచన సంద్రాల సమూహం ప్రతి ఒక్కరిలో కనిపించింది, ఏ ఒక్కరిని కదిలించిన, మనసుకు నచ్చే మరియు నాకు తెలియని ఎన్నో నిగూడ విషయాలు, వారి వారి ఆలోచనలు అన్ని కూడా చూస్తుంటే ఒక సామెత గుర్తొచ్చింది. ఒకే జాతి పక్షులు ఒక గూటికి చేరుతాయి. మేమందరం కూడా ఈ స్లీపర్ గూడులో ఒకర్నొకరం కలుసుకున్నాం.

తెచ్చుకున్న బిర్యాని ప్యాకిట్లు విప్పి తింటుండగా, ట్రైన్ వరంగల్ లో ఆగింది. సందీప్ వేముల పుణ్యమా అని వారి అన్న గారు తీసుకొచ్చిన బోజనాన్ని అందుకొని వేజిటేరియన్ వ్యక్తులం అంత కలిసి తినేసాము, కేరింతలు ముగిసిన కాసేపటికి ఒక్కొక్కరం నడుం వాల్చాం.

20 Aug 11 – SATURDAY :

ఇప్పటికి చాల సార్లు వెళ్ళాను చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కి. చూసిన ప్రతిసారి ఎందుకో కొత్తగా అనిపిస్తుంటుంది. బహుశ చెక్కు చెదరని గోతిక్ కట్టడపు విధానం రాజభవనంలా  తలపించే వంపు స్థంబాలు. అల చూస్తూ బయటికోస్తుండగా శరవన్ హోటల్ మా ఆకలి జిహ్వని ప్రేరేపించడంతో ఆగకుండా నేను మాత్రం సాంబార్ ఇడ్లీ, మేతి ఇడ్లీ, లాగించాను, ఎవరికీ వారు వారికి నచ్చిన వాటితో అల్పహారాన్ని పూర్తి చేసారు.

బయటికొచ్చి పక్కనే ఉన్న బస్సు స్టాప్ లో బస్సు ఎక్కాం  పుడుచేర్రి(పాండిచేరి) బస్సు దొరికే చోటుకి (సెంట్రల్). కిక్కిరిసిన బస్సు కిటికీ గుండా వెనక్కి వెళ్తున్నతమిళ వీధుల్ని రోడ్డుని, ఇరుపక్కన ఉన్న దుకానాలని, షాపింగ్ మాల్స్ ని చూస్తూ సాగింది మా ప్రయాణం. దాదాపు అరగంట ప్రయాణంలో నేను చెన్నై లో కాకా  హైదరాబాద్ లో ఓ లోకల్ బస్సులో ఉన్నాననే భావనే కలిగింది.

ఒక AC  బస్సులో సీట్లని వెనక్కి నెట్టి ఆసీనులమవుతుండగా రజినీకాంత్ తమిళ్ మూవీ శివాజీ తో మొదలైన మా ప్రయాణం మధ్య మధ్యలో ఎడమవైపున మా చూపులను బంధించిన సముద్రం. ఒక చోట ఆగి స్నాక్స్ తీసుకొని మళ్లీ సినిమా పూర్తయ్యాక గాని చేరుకోలేదు పాండిచేరి. 

దాదాపు నాలుగున్నర ప్రాంతాన చేరుకొని, ఒళ్ళు విరుచుకొని, లోకల్ టాక్సీ తోడుతో  మిషన్ స్ట్రీట్  కుడివైపు సందులో హోటల్ కొరోమండల్ కి చేరుకున్నాం.  ఫ్రెంచ్ కట్టడపు గుబాళింపు, అందమైన రంగు రంగు వర్ణ చిత్రాలతో,  కరెంటు దీపాల వాలు సెట్టు తో, కళాత్మకమైన చెక్క బొమ్మతో, మనసుకు ఇంపుగా కలిగింది, మెట్లెక్కి 202  నెంబర్ రూంలో కాస్త సేద తీరి, మెల్లిగా బయటికొచ్చి హోటల్ లో ప్రతి గదిలో ప్రతి గోడకి, ఇవతల అవతల దాదాపు పాతికకు పైగా ఉన్న అందమైన వర్ణ చిత్రాలను చూసి అబ్బురపోయాను. గత కొన్నేళ్లలో నేను విడిది చేసిన హోటల్స్ కి దీనికి చాల తేడా ఉంది. ఆ తేడా నను అమితంగా ఆకట్టుకుంది. బాల్కని లో గాలి తగిలే విధంగా ఏర్పాటు చేసిన పూల కుండీలు, కుర్చీలు, టెర్రస్ పైనుండి చూస్తే కనిపించే చర్చి, అతిపెద్ద వీధి దీపపు స్థంబం. చెప్పుకుంటూ పోతే హోటల్ లో మేము గడిపిన ప్రతి క్షణం మరిచిపోలేనిది.

కాస్త వేడి ఎక్కువగానే ఉన్న చికాకు మాత్రం కలగలేదు.

అందరం ఐదున్నర ప్రాంతాన బయటికొచ్చి మా కెమరాలకి పని పెడుతూ వీధులన్నిటిని తెరపాగా చూస్తూ కుడి పక్కన సెయింట్ సి.ఎస్.సి. చర్చి కు ఎదురు  విక్టర్ సిమోనేల్, రోమన్ రోలాండ్ పేరు గల వీధులను చూస్తూ చెప్పులు కుట్టే వ్యక్తులు, ఆటో రిక్షాలను చూస్తూ, ఆడ మగ, వయసు తో తేడా లేకుండా అందరు సైకిల్ నే ఆశ్రయించిన తీరు బాగా నచ్చింది, విశాలమైన చక్కని వీధి దారులను, పార్కుని దాటుతూ, నాలుగు వీధుల మూల మలపులు తిరగ్గానే చేరుకున్నాం సముద్ర తీరానికి. దానికి అనుకోని ఉన్న “లే కాఫీ” పేరుగల హోటల్ ఒకటి రోమన్ మరియు ఫ్రెంచ్ కట్టడం ల తలపిస్తుంది. సముద్ర తీరాన రక రక ల వయసు వ్యక్తులు, ఒక్క క్షణం నేను ఇండియా లో లేను అని తలపించేలా విదేశీయుల సమూహం,  చుట్టూ ఉన్న  జనాలను, తీరానికి అనుకోని ఉన్న బ్రిడ్జ్ చివర్లో, స్నాక్స్ అమ్ముతూ కనిపించే చిల్లర కొట్లు, పిల్లలు, ప్రేమ జంటలు, యాత్రికులు,  ఇక ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సముద్ర అలల తీరాన్ని మౌనంగా చూస్తూ ఆనందించడం తో మాకు తెలియకుండానే వీధి దీపాలు వెలిసాయి. మేము ఇరవైమంది ఎవరి తోచిన చోటుకి వేరు పడి తొమ్మిదిన్నర ప్రాంతాన వెనుతిరిగి మిషన్ స్ట్రీట్ లో ఎవరికి తోచిన హోటల్ లో వారు బోజనాలు కానించారు . నేను మాత్రం రెండు పరోటలు ఒక  చపాతీ లాగించి తిరిగి హోటల్ గది కి చేరుకున్నాం.  పదిన్నర ప్రాంతాన కురిసిన వాన జల్లులతో వాతావరణం అంత హాయి గోలిపింది.

వర్షంలో పిల్లల్లాగా తడుస్తూ గేన్తులేస్తూ డాన్సు చేస్తున్న దర్శన్, హర్ష్, సందీప్ లను కాసేపు కెమెరా లో బంధించి నేను గదిలో నిద్రకు ఉపక్రమిస్తుంటే కొందరు మాత్రం ఈ చల్లని హాయి లో కాఫీ రుచిని ఆస్వాదించల్సిందేనని లే కఫ్ఫే కి బయల్దేరారు. ఆప్పటికే అలిసిన నేను నిద్రలోకి జారుకున్నాను.

21st AUG 11 – SUNDAY :

రాకేశ్ లేపడంతో ఇప్పుడేగా కళ్ళు మూసాను అప్పుడే తెలవారిందా అనుకుంటూ లేచాను. అప్పటికే మా కోసం సిద్ధం చేసిన బస్సులోకి ఐదున్నర ప్రాంతాన అందరం చేరుకోవడంతో మొదలైన మా ప్రయాణం కిటికీ వారగా చూస్తూ నిలువెత్తు వింత వింత రాజకీయ కటౌట్ లు చూసి వెర్రిగా నవ్వుకుంటూ,

మనస్సులో స్థానం మనుషుల్లోకేల్లి వారి కోసం ఏమైనా చేస్తే సంపాదించుకుంటారు అంతే కాని అడుగడుగు వింత వింత హావ భావాల్లో రంగులు పూసుకొని పోజులిచ్చిన కటౌట్ లు రోడ్డు కిరువైపులా పెడితే దొరకదన్న విషయం వారికి ఎపుడు తెలుస్తుందో.

దట్టంగా కమ్ముకున్న మేఘాల ముసుగులో భానుడు దాక్కోవడంతో ఇంకా చీకట్లు ముసురుకొనే ఉన్నాయి. సముద్ర తీరానికి కొంచెం దూరం లో మా బస్ ఆపడంతో చల్లగాలుల్ని సముద్రపు అలల్ని వీక్షించేందుకు బస్సు దిగి నెమ్మదిగా అడుగులేస్తూ పాదానికి ఇసుకకు అడ్డంగా ఉన్న చెప్పులని విడిచి మెత్తగా తగులుతున్న ఇసుకలో అడుగులేస్తూ, కుడి పక్కన నల్లగా నిగనిగ లాడుతున్న రాళ్ళు ఎడం పక్కన విశాలమైన సముద్రం దానికి అనుకోని ఉన్న తీరం అన్నిటిని అలవోకక చూస్తూ వీస్తున్న చల్లని గాలులు నా చెవుల్లో గిలిగింతలు పెడుతుంటే ముసురు చీకట్లో మెరిస్తున్న నీలి వర్ణం మనసుని హత్తుకుంది.

తీరానికి చేరుకుంటున్న తెప్పలు, అలలతో దోబుచులాడుతున్న పిల్లలు, సముద్రంపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న జాలర్లు, ప్రశాంత జీవనాన్ని కోరుకొని పోరుగుదేషలనుండి వచ్చి సేద తీరుతున్న విదేశీయులతో వాతావరణం అంత వింత హాయిగా తోచింది.

కాసేపటికి బస్సు లోకల్ గ దొరికే ఏదైనా వంటకాలను రుచి చేద్దామని ఓ కాకా హోటల్ దగ్గర నిలిపాడు. ఇష్టమైన పొంగల్ ని కడుపార తినేసి, మెల్లిగా సాగుతున్న మా ప్రయాణం పారడైస్ బీచ్ కి చేరుకుంది. అది ఇంకా తెరుచుకోలేదు, సముద్ర తీరానికి చేరుకోవాలంటే, మధ్యలో ఓ నది తీరాన్ని దాటాలి అది ఓ పడవ ద్వారా, పడవలు నిలిచే చోటు ఓ అందమైన గార్డెన్ మరియు పిల్లలు ఆడుకునే ఆట స్థలంకి అనుకోని ఉంటుంది. అదే గార్డెన్లో కాసేపు పిల్లల లాగా ఆడుకొని సమయం కావడంతో అందరం కూడా బోటు లో ఎక్కి మెల్లిగా నదిని దాటుతూ, దూరం గ ఉన్న దట్టమైన చెట్ల పొదళ్లను చూస్తూ పరిగెడుతున్న బోటు వెలుపలకి చేయి పెట్టి నీళ్ళను అందుకుంటూ ఆడుకుంటూ, నది ధాటి ఒడ్డుకు చేరుకున్నాం. విశాలమైన ఇసుకప్రాంతాన్ని దాటుతూ సాగర తీరానికి చేరుకున్నాం. అందరం తమ తమ లగేజిని ఒక పక్కన పెట్టి ఇసుకపై ఆటలాడుతూ కేరింతలు కొడుతూ పరగులు పెడుతూ అలలను డీకొడుతూ ఆడుతుంటే ధృశ్యాన్నంత బంధించడం ఇక నా పనైంది.

కాసేపటికి ఆగని మనసు కోరికను ఇక  ఆపుకోలేక, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నిలువెత్తు అలలని  డీకొనాలని యుద్ధానికి సిద్ధమైన యోదిడిలా అలతో తలపడేందుకు పరుగులుపెడుతూ దుమికాను, చిన్న పిల్లాడి రెక్క పట్టి పక్కన కుర్చోబెట్టినట్టు నన్ను ఆ సాగరం ఒక్క అలతో చాల సునాయాసంగా తీరం వైపుకు నెట్టింది.

ఉప్పు నీటిని తొలిసారి ఆస్వాదించాను. నేను ఈ ప్రకృతికి లీనమైనట్టు నా మనసు ప్రకృతిలో సగాభాగమై నా ఆణువణువూ సాగరంలో లీనం చేస్తూ, నాకు సాగరానికి మాత్రమే తెలిసిన ప్రణయ కలాపాలతో జరిపిన చిలిపి యుద్దాలు మాటలకు అందనివి.

మూడు నాలుగు గంటల మా ఆటలు ఆకలికి చేరువడంతో ఆపక తప్పలేదు. స్నానాలు కానించి బట్టలు మార్చుకొని తీరానికి ఆనుకోని ఉన్న పెద్ద గుడిసెలో అందరం కూర్చొని భోజనాలు కానించాం. కేసర్ స్వీట్ కాస్త నచ్చింది. వెన్నక్కి తిరిగి మరి సాగరానికి టాటా చెపుతూ నదిని దాటుతూ మల్లి బస్సులోకొచ్చి కూర్చునే సరికి పన్నెండు దాటింది. అటునుండి నేరుగా రూం కి చేరుకొని మల్లి ఫ్రెష్ అయి బాల్కనీ లో జర్మనీ నుండి విచ్చేసిన ఫ్రైడరిక్ మరియా తన మిత్రురాలితో జరిగిన సంబాషణలో రంగు రూపు వేరైనా నా లాగే ఆలోచించడం నాకు బలే అనిపించి పేస్ బుక్ లో తనని ఆడ్ చేసుకొని. వడి వడి గ అందరం కిందికి దిగి మల్లి బస్సులోకి చేరుకొన్నాం.

మతం ఒక వ్యక్తికి సంబంధించిందా? మనసుకు సంబంధించిందా? మెదడుకి సంబంధించిందా?

ఆధ్యాత్మికం అంటే నన్ను నేను తెలుసుకోవడమే నన్ను నేను గుర్తిన్చుకోవడమే కానీ మరొకటి కాదనే నా ఆలోచనలను బ్రేక్ వేస్తూ బస్సు అరబిందో ఆశ్రమానికి చేరుకుంది.

కెమెరా, సెల్ ఫోన్ కి అనుమతి లేదనడంతో బస్సులోనే పెట్టి చెప్పులనుకుడా వదిలి, నిశ్శబ్ధమైన ఆశ్రమం వీధిలోకి వెళ్తుంటే సముద్రం చివరన దొరికే పూసలు, రకరకా చిప్పలతో తయారు చేసిన దండలని విదేశీయులను ఆకర్షించడానికి వాటి గురించి వివరిస్తూ అమ్ముకునే వాళ్ళు విరివిగా కనిపించారు. ఆశ్రమం లోకి అడుగుపెట్టగానే కమ్మని సుగంధం ఆకట్టుకుంది కుడివైపునుండి ఇరుపక్కల చక్కగా పెరుగుతూ గలగలా నవ్వుతున్న పూలమొక్కలని చూస్తూ యోగి సమాధిని చేరుకున్నా, అందంగా పూలతో తీర్చిదిద్దారు ఆ చోటు మొత్తం.

ప్రశాంతం ఆవహించినా ఆచోటులో పది నిముషాలు నన్ను నేను  ధ్యానం లో ముంచేసుకున్నాను.

మెల్లిగా కళ్ళు తెరిచి నిశబ్దంగా అడుగులువేస్తూ, పుస్తకాలగధిని, చిత్ర పటాలున్న గదిని, చూస్తూ పక్కనే ఉన్న విన్జెంజ్ అనే జర్మన్ వ్యక్తి తో పరిచయం తనకు ఆశ్రమానికి పాండీ కి ఉన్న అనుబంధం నను ఆకట్టుకుంది. నలబై ఏళ్ళుగా ఇక్కడే మిషన్ స్ట్రీట్ రెండో విధిలో ఉంటున్నామని, సునామిని  తన కళ్ళ ఎదురుగా చూశానని, అంత పెద్ద సునామి ఈ ప్రాంతాన్ని ఏమాత్రం హాని చేయకపోవడం వెనకాల దాగిన మర్మాన్ని చాల ఉద్విగ్నంగా చెప్పుతున్న తీరుతో ఆ చోటు మరింత అందంగా తెలియని ఓ అధ్బుత రహస్యంగా తోచింది.

ఈ చోటు మీకెందుకు నచ్చింది అనే ప్రశ్నకు సమాధానం “ఐ లైక్ ఇట్” అని చెప్పాడు అంతే.

బయటకు అడుగుపెడుతుంటే ఆరడుగుల ఆజానుబాహుడు త్రిస్టన్, తనకన్నా అంగుళం తక్కువున్న అనస్తాసీ అనే యువతీ పరిచయం అయ్యారు.

వారితో గడిపిన అతి కొద్ది సంబాషణ నాకు చిత్రం గ తోచింది.

వారికి రంగు, రూపు, దేశం, మతం, అనే భావనలు లేవు అంత ఒకటే ఏ సరిహద్దు తమని కట్టడి చేయలేవు.

పెళ్లి గురించిన చర్చకు, పెళ్లి అనేది కేవలం ఒక తంతు మాత్రమే కలిసి కాపురం చేయవలసినవి రెండు మనసులు. పదిహేనేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చాం అప్పటి నుండి మేము ఇప్పటి వరకు కలిసే ఉంటున్నాం ఉంటాం. అని పలుకుతున్న మాటలకి చక్కని పలువరుస పట్టుకుంటే కంది పోయే పాల చర్మంతో నవ్వుతు కనిపించింది అనస్తాని. తను కూడా తనతో ఏకీభవించి యస్ మేము కలిసే ఉంటాం. అని మెరుస్తున్న కళ్ళకి అడ్డుపడుతున్న సన్నని కురులని పక్కకు నెడుతూ చెప్పింది.

మీరు ఇక్కడ ఉండడానికి కారణం అనే ప్రశ్నకు వారిద్దరు ఇచ్చిన సమాధానం వీ లైక్ ఇట్.

ఆశ్చర్యం.. నా చుట్టూ ఉన్న ఒక్కొక్కరు, ఒక్కో రకంగ ఉన్న చివరికి ప్రతి ఒక్కరు కోరుకుంటుంది కేవలం మనస్త్రుప్తి.

పరి విధాల ఆలోచనలతో బస్సులో  లో ఉన్న కెమరా ని మేడలో వేసుకొని ఏదో తీయడానికి ప్రయత్నించా కాని కెమరకి చిక్కని అందమేదో ఆ వీధుల్లో ఉంది. దాన్ని బందించలేక పోయా.

ఆశ్రమం మొత్తం ఫ్రెంచ్ కట్టడాన్ని తలపించిన భారతీయ వాస్తు సువాసనలు ఆణువణువూ వెదజల్లుతున్నాయి.

బయట వీధిల్లో తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఆపి ఇది వి ఐ పి లు ఉండే చోటు ఇక్కడ ఫోటోలు తీయకండి అని వారించారు.

పాపం వి ఐ పి అనబడే వారు నా కెమరాని మాత్రమే ఆపగలరు, నా మనసు కన్నుని కాదనే విషయం బహుశ పోలీసు వారు తెలుసుకోలేకపోయారు.

షాపింగ్ లో బిజీ ఐపోయి ఆలస్యంగా బస్సు దగ్గరికి చేరుకున్న రాకేశ్ రాకతో అందరం బస్సు ఎక్కడంతో మొదలైన ప్రయాణం వీధుల్ని, రహదారులని, సిటీ ని దాటుకుంటూ, చిన్న పల్లెని టౌన్ లని చూస్తూ ఆరోవెల్లి వైపుకు సాగింది.

పాత సీసకు కొత్తరంగు పులుముకున్నట్టు, వంద రెండు వందలకు అద్దెకు దొరికే మోటార్ సైకిల్, మోపెడ్, లూన, బ్యాటరితో నడిచే స్కూటర్ ల పై విదేశీయుల ప్రయాణం కొంచెం వింతగా కనిపించింది.

సందీప్ వేముల తీసుకొచ్చిన జంతికలతో, మిగతా వాళ్ళు తీసుకొచ్చిన స్నాక్స్ తో, జోకులతో, నిద్రతో సాగుతున్న ప్రయాణం మధ్యలో మత్రిమందిర్ మెడిటేషన్ చాంబర్ వద్ద ఆగింది. కొన్ని ఎకరాల్లో ఏర్పాటైన ఆ ప్రాంతం అంత పచ్చని చెట్లతో, చక్కని వాతావరణం తో నిండింది. పిల్ల దారిలో నెమ్మదిగా అడుగులేస్తూ లోపలికేల్తుంటే మధ్యలో ఆధునాత కట్టడాడంలో మత్రిమందిర్ కట్టడానికి సంబంధించిన విశేషాలతో ఏర్పాటు చేసిన ఫోటో మ్యుజియం బావుంది. దానికి ఎదురగా ఫ్రెంచ్ హోటల్ షాపింగ్ స్టాల్ , గేలరీ, పాతకాలపు కట్టడం, ఇవి దాటుతూ కాస్త ముందుకెళితే చిన్న టీ, జ్యూస్ సెంటర్, దాని పక్కనునున్న దారి గుండా ఒక ఇరవై నిముషాలు నడిస్తే గాని రాలేదు గోళాకారంలో ఉన్న మత్రిమండపం. గ్రామం యొక్క ఆత్మ (SOUL OF THE CITY) గ పేరుగాంచిన ఈ ప్రదేశం లోపలికి  వెళ్లలేకపోయాం కాని బయటినుండే చూసాం అధ్బుతంగా ఉంది.

తిరిగి ఫ్రెంచ్ హోటల్ లో పాత కట్టడంలో పిల్లితో ఆడుకుంటున్న పిల్లలతో కాసేపు గడిపి తిరిగి బస్సులో కూర్చొని ఆరోవెల్లి చేరుకోనేసరికి చీకటి పడటంతో వెనుదిరిగి మధ్యలో షాపింగ్ కార్యక్రమాలు చేసుకుంటుంటే. రాకేశ్, చంద్ర శేకర్ సింగ్ గారి మధ్యలో జరిగిన సంభాషణతో  తెలుసుకున్న శేకర్ గారి పాజిటివ్ దృక్పధాన్ని.

షాపింగ్ అంత పూర్తి చేసుకొని హోటల్ రూం కి చేరుకునే సరికి తొమ్మిది దాటింది.

కాసేపు విశ్రాంతి తీసుకొని బిజీ లెక్కలతో దర్శన్ ఖన్నా, తీసిన ఫొటోస్ అన్ని లాప్ టాప్ లోకి పంపిస్తూ వికాస్ ఇలా ఎవరి పనుల్లో వారు ఉండగా మేము వెజిటేరియన్ బృందం నేను, రాకేశ్, వికాస్, హర్ష్, సందీప్, దర్శన్ బయటికొచ్చి మిషన్ స్ట్రీట్ లో కాసేపు నడిచిన తర్వాత కుడి వైపున ఆనంద్ భవన్ ఇండియన్ ఫుడ్, ఎడమ వైపున డన్జేలేనియ ఇటాలియన్ ఫుడ్, ఇంత దూరం వచ్చాం. కొత్త వంటలని ట్రై చేద్దాం అని ఇటాలియన్ కే వోటు వేసాం.

పేరు తెలియని నోరు తిరగని వంటకాల పేర్ల లిస్టు ముందు పెట్టి అందర్ని పరిచయం చేసుకున్నాడు ఆ హోటల్ ని నడిపిస్తున్న మాక్స్. తన సలహా ప్రకారం మూడు వంటకాలని రుచి చేసాం. తీర చూస్తే మైదా, చీజ్, ఆలివ్ ఆయిల్ తో చేసిన (పాస్తా) వంటకాలు, చాల బావున్నై మధ్యలో మాక్స్ తో సంబాషణ, తనకు ఫోటోగ్రఫి పై ఉన్న మక్కువ, ముప్పై ఏండ్ల నుండి పాండి లోనే గడుపుతుండడం. అన్ని పంచుకున్న తర్వాత, ఇక్కడే ఎందుకు ఉండాలనిపించింది అనే ప్రశ్నకు సమాధానం “ఐ లైక్ ఇట్”. భోజనం పూర్తి చేసి బ్రేవులు తీస్తూ తిన్నగా మల్లి గదికి చేరుకున్నాం.

ఇక మాంసం ప్రియులేమో టెర్రస్ పైన బోజనాలు కానిస్తుంటే మరి కొందరు గదుల్లో బిజీ అయ్యారు. నేను రాకేశ్ వికాస్ మెట్లపై కూర్చొని, మనసు, మెదడు, సమాజం, బంధం, అనుబంధం లాంటి చర్చలతో బిజీ ఐపోయాం.

పదకొండున్నర ప్రాంతాన మెలకువతో ఉన్నవాల్లమంత సాగర తీరాన ఉన్న లే కఫ్ఫే కి వెళ్ళాం. అక్కడికి చేరుకోగానే, ఇంకా విదేశీయులు బైక్ ల పై తచ్చడ్డం. ఆ సమయంలో కూడా జనాలు తిరగడం అక్కడి సాధారణ విషయం.

కొందరు కోల్డ్ మరికొందరు హాట్ కాఫీ ఆర్డర్ లిస్తే నేను మాత్రం రెండు బిస్కెట్ లతో సరిపుచ్చుకున్న.

ఇక అక్కడినుండి మొదలైన ఎస్ ఎస్ రావు గారి జోకుల పర్వానికి కడుపుబ్బా పడి పడి నవ్వుతు అర్ధరాత్రి రెండు గంటల వరకు వీధుల్లో తిరిగి గదికి చేరుకున్నాం. బహుశ చాల కాలం తర్వాత  అందరు మనస్పూర్తిగా నవ్వుకున్నాం ముఖ్యంగా నేను.

ఆ జోకులను నెమరువేసుకుంటూ దుప్పటి కప్పుకొన్నాను.

22nd AUG 11 – MONDAY :

ఇదే చివరి రోజు

ఎందుకో లేట్ గ లేచాను. అప్పటికే కొందరు సాగరతీరాన సూర్యోదయాన్ని ఆస్వాదించి వచ్చామని చెప్పారు. నేను మిస్ అయ్యననే భావన కలిగింది. ఈ రోజు స్ట్రీట్ ఫోటోగ్రఫి చేద్దామని నిర్ణయించుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కో వీధికి వెళ్తే నేను వికాస్ మరో వీధికి వెళ్ళాం. కనిపిస్తున్న మాకు కొత్తగ అనిపించినా ప్రతి కట్టడాన్ని బంధిస్తూ, అరబిందో ఆశ్రమ వెనుక వీధుల్ని చూస్తూ, సునామీకి కోల్పోయిన సన్నిహితులను తలచుకుంటూ కాలం గడుపుతున్న ముసలి వాళ్ళను, జాలర్ల ఇళ్ళను చూస్తూ, చేపల మార్కెట్, రద్దీగా ఉన్న మార్కెట్, స్కూల్, కాలేజీ, సభ జరుగుతున్న మిషినరీ చర్చిని తమిళ, తెలుగు, ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మనీ రక రకాల దేశాల వ్యక్తుల్ని చూస్తూ, అక్కడక్కడ కనిపిస్తున్న దేశ విదేశపు వంటకాల హోటల్స్ ని, రెస్టారెంట్లని చూస్తూ  నడుస్తున్న నాకు మాత్రం. ఆ సమయం లో బిజీ బిజీ గ రద్దీగా ఉన్న వాతావరణానికి బదులు ప్రతి వ్యక్తి కూడా నాలాంటి వాడే అనే తలపుతో అడుగులు పడసాగాయి.

గమ్మత్తైన మనసును దోస్తున్నా ఎన్నో విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి. అందుకేనేమో నా లాంటి వాడు ఎప్పుడో ఒక్కసారైనా తన మనసుకు తన గురించి ఆలోచించడానికి కాస్త సమయం అవసరం. అందుకే ఇలాంటి ప్రయాణాలు నాకు చాల అవసరం అని తెలుసుకున్నాను.

నా మనసుని ఎంతగానో మార్చింది.

బహుశ ఇలాంటి అనుభవమే అందరికి కలిగిందేమో ఎవరికి ఈ ప్రాంతాన్ని వొదిలి రాబుద్దికాలేదు.

బలవంతంగా మమ్మల్ని లాగేస్తున్నట్టుగా తిరిగి గదుల్లోకి చేరుకొని, అన్ని సిద్ధం చేసుకొని, రెండు ఆటోల్లో “మమ్మల్ని వదులుకోలేక తన ప్రేమ కౌగిల్లో దాచుకున్న ఈ సాగర తీరాన్ని బలవంతానా వదిలేసి” బస్సు స్టాప్ కి చేరుకున్నాం.

రోజులు ఇంత త్వరగా ఎలా గడిచాయో ఇప్పటికి ఎవరికి అర్ధం కాని అంతు చిక్కని ఓ ప్రశ్నగ మిగిలింది. నా మనసు మాటలు రాకేశ్ కి వినపడినట్టున్నాయి అందుకే మరో కొద్ది రోజుల్లో పది రోజుల కోసం వస్తాను ఇక్కడికి అన్నాడు. ఎందుకు అని అడిగిన ప్రశ్నకి సమాధానం  ఐ లైక్ ఇట్ అనడంతో అర్ధం చేసుకో గలిగాను లైక్ కి అర్ధం ఏంటో.

నాకు మళ్లీ రావాలనుంది. తప్పక వస్తాను అని చెప్పను. ఎందుకు అని ప్రశ్నించిన నా మెదడుకు  మనసు చెప్పిన సమాధానం “ఐ లైక్ ఇట్” ఎందుకు లైక్ అంటే నా మనసుకు కలిగిన దాహాన్ని తీర్చే చోటుల అనిపించింది కాబట్టి లైక్ అని సమాధానం ఇచ్చుకున్నాను.

ఆటో ని బస్సు ని మారుస్తూ ఆరు గంటల ప్రాంతాన మళ్లీ రైల్వే స్టేషన్ కి చేరుకున్నాం. అప్పటికి గాని గుర్తుకు  రాలేదు ప్రొద్దున నుండి ఏమి తినలేదని, ఆకలిగా ఉన్న నాకు మళ్లీ శరవన్ హోటల్  ప్రేమగా  పిలిచింది.

అధ్బుతమైన సాంబార్ రైస్ తో పాటు బనానా చిప్స్ మరో కొన్ని రోజులవరకు గుర్తుండి పోయే రుచిని ఆస్వాదించాను. వెంటనే పెరుగన్నంతో పూర్తి చేసి, ట్రైన్ ఎక్కి గడిచిన మధుర క్షణాలను నెమరువేస్తూ తిరిగి నా ప్రాపంచిక గృహానికి పయన మయ్యాయి నాతోపాటు నా ఆలోచనలు. 

ఈ ప్రయాణం లో చివరికి తెలుసుకున్న విషయం నేను ఈ ప్రపంచం వేరు కాదని. అంత ఒకటే అనే భావనతో రేపటి నా రోజు మొదలవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిన విషయం.

మనసు పుస్తకంలో ఈ నాలుగు రోజుల చాప్టర్  మరిచిపోలేనిది. నాకే కాదు నాతో వచ్చిన ప్రతివారికి ఇదే భావన కలిగి ఉంటుందని నా భావన. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు..

Categories: ప్రయాణం
  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: